వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిర్‌పోర్టులో ఛాతి నొప్పి.. కన్నుమూసిన ప్రముఖ నటుడు,మాజీ ఎంపీ..

|
Google Oneindia TeluguNews

ప్రముఖ బెంగాలీ నటుడు,తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ తపస్ పాల్(61) మంగళవారం(ఫిబ్రవరి 18)న ముంబైలో గుండెపోటుతో మృతి చెందారు.ఇటీవల ముంబైలోని కుమార్తె ఇంటికి వెళ్లిన తపస్.. మంగళవారం సాయంత్రం 4గంటలకు కోల్‌కతా తిరిగి వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అదే సమయంలో ఉన్నట్టుండి ఛాతిలో నొప్పి రావడంతో హుటాహుటిన ఆయన్ను జుహులోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూశారు.

 1980లో చిత్రపరిశ్రమలోకి..

1980లో చిత్రపరిశ్రమలోకి..

తపస్ పాల్‌కు భార్య నందిని, కుమార్తె సోహిని పాల్ ఉన్నారు. గుండె సంబంధిత సమస్యలతో గతంలోనూ ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆయన మరణంపై బెంగాలీ నటుడు మాలిక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొంతకాలంగా తపస్ ఆరోగ్యం బాగోలేదన్నారు. కాగా,తపస్ పాల్ 1980లో తరుణ్‌ మజుందార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'దాదర్‌ కీర్తి' సినిమాతో బెంగాలీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు.

 మాధురి దీక్షిత్ తొలి చిత్రం ఆయనతోనే..

మాధురి దీక్షిత్ తొలి చిత్రం ఆయనతోనే..

బెంగాలీలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన తపస్ పాల్.. 1984లో వచ్చిన అబోధ్ చిత్రంలో మాధురీ దీక్షిత్‌తో కలిసి నటించారు. హిరెన్ నాగ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మాధురీ దీక్షిత్ తొలి చిత్రం కావడం గమనార్హం. తన మూడు దశాబ్దాల నట ప్రస్థానంలో ప్రొసేన్‌జీ ఛటర్జీ,సౌమిత్ర ఛటర్జీ,రాఖీ,మౌసమి ఛటర్జీ వంటి నటీనటులతో ఆయన నటించారు. చివరిసారిగా 2013లో ఖిలాడీ అనే చిత్రంలో తపస్ నటించారు.

Recommended Video

#WatchVideo : Two Headed Snake Found In West Bengal || Oneindia Telugu
 పలువురు ప్రముఖుల సంతాపం..

పలువురు ప్రముఖుల సంతాపం..

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి రెండుసార్లు ఎంపీగా, ఒకసారిగా ఎమ్మెల్యేగానూ తపస్ పాల్ పనిచేశారు. డిసెంబర్ 31,2016లో చిట్ ఫండ్ స్కామ్‌లో అరెస్ట్ అయ్యారు. 13 నెలల జూలు శిక్ష తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. ఆయన మృతిపై పలువురు బెంగాలీ నటుడు,తృణమూల్ కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేశారు.

English summary
Bengali actor and former Trinamool Congress MP Tapas Pal died in Mumbai on February 18 after suffering a cardiac arrest. He was 61.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X