వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సినీ నటుడు, నుస్రత్ ఫ్రెండ్ యాశ్ బీజేపీలోకి: యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపు

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లోకి వలసలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే అధికార టీఎంసీ నుంచి కీలక నేతలు బీజేపీలో చేరగా.. తాజాగా, ఓ బెంగాలీ నటుడు కూడా కాషాయ కండువా కప్పుకున్నారు.

బీజేపీలోకి సినీనటుడు యాశ్ దాస్‌గుప్తా

బీజేపీలోకి సినీనటుడు యాశ్ దాస్‌గుప్తా

బెంగాలీ నటుడు యాశ్ దాస్‌గుప్తా బుధవారం బీజేపీలో చేరారు. బీజేపీ నేతలు కైలాశ్ విజయవర్గీయ, ముకుల్ రాయ్ సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దాస్ గుప్తాకు బీజేపీ సభ్యత్వాన్ని విజయవర్గీయ ఈ సందర్భంగా అందజేశారు.

దాస్‌గుప్తాతోపాటు మరికొందరు కూడా బీజేపీలో చేరారు.

యువత రాజకీయాల్లోకి రావాలంటూ పిలుపు

అశోక్ భద్ర, మల్లికా బందోపాధ్యాయ్, పాపియా అధికారి, సౌమిలి ఘోష్ బిస్వాస్, త్రమిల భట్టాచార్య బీజేపీ కండువా కప్పుకున్నారు. కాగా, వన్, మోన్ జానే నా, టోటల్ దాదాగిరి, ఫిదా లాంటి సినిమాల్లో సినిమాల్లో యాశ్ దాస్‌గుప్తా నటించారు. బీజేపీలో చేరిన సందర్భంగా యాశ్ మాట్లాడుతూ.. దేశానికి మంచి చేసేందుకు మరింత ఎక్కువ మంది రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. కాగా, టీఎంసీ ఎంపీ, నటి నుస్రత్ జహాన్‌కు మంచి స్నేహితుడు కావడం గమనార్హం. వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ వర్సెస్ బీజేపీ..

యాశ్ పార్టీలో చేరిక పట్ల పలువురు బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. సాదరంగా స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూసుకెళుతోంది. బెంగాల్‌లో అధికారం చేపట్టేది తామనంటే ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా, రాష్ట్రంలో ఏప్రిల్-మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మరికొద్ది వారాల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని 42 పార్లమెంటు స్థానాలకు గానూ 18 స్థానాలను దక్కించుకుని బీజేపీ సత్తా చాటింది. అధికార టీఎంసీని గద్దె దించుతామని తేల్చి చెబుతున్నారు. ఇప్పటికే హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లాంటి కీలక నేతలు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా బెంగాల్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 200 స్థానాలకుపైగా కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ నేతలు చెబుతుండగా, డబుల్ డిజిట్ కూడా దాటలేరంటూ టీఎంసీ ఎదురుదాడి చేస్తోంది.

English summary
Bengali actor Yash Dasgupta, on Wednesday, joined the Bharatiya Janata Party (BJP), in Kolkata. Local media had reported that there were speculations that Dasgupta could join BJP ahead of the West Bengal Assembly polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X