• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మళ్లీ నోరుపారేసుకున్న మేఘాలయ గవర్నర్.. బెంగాళీ యూత్‌పై కాంట్రవర్శియల్ కామెంట్స్..

|

ఢిల్లీ : నూతన విద్యా విధానంలో భాగంగా హిందీని తప్పనిసరి భాషగా అమలుచేయాలన్న ప్రతిపాదనపై కేంద్రం వెనక్కి తగ్గింది. అయితే దానిపై రాజుకున్న దుమారం మాత్రం కొనసాగుతూనే ఉంది. కేంద్ర ప్రతిపాదనపై రాష్ట్రాల నుంచి వ్యతిరేకత ఎదురవడంపై స్పందించిన మేఘాలయ గవర్నర్ తథాగథ రాయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బెంగాలీ యువతను కించపరిచేలా మాట్లాడారు.

అనవసర రాద్దాంతం

అనవసర రాద్దాంతం

హిందీని తప్పనిసరి భాషగా అమలుచేయాలన్న ప్రతిపాదనపై విపక్షాలు అనవరసర రాద్దాంతం చేస్తున్నాయని తథాగథ రాయ్ అభిప్రాయపడ్డారు. అసోం, మహారాష్ట్ర, ఒడిశాలు హిందీయేతర రాష్ట్రాలైనప్పటికీ వారు ఆ నిర్ణయాన్నని వ్యతిరేకించడంలేదని అన్నారు. ఈ మేరకు వరస ట్వీట్లు చేసిన ఆయన.. ఈ విషయంలో బెంగాల్ వైఖరిని తప్పుబట్టారు. హిందీ అమలు విషయంలో ఆ రాష్ట్ర అభ్యంతరాలను అర్థంలేనివని కొట్టిపారేశారు.

బెంగాల్ ఎప్పుడో ప్రాభవం కోల్పోయింది

బెంగాల్ ఎప్పుడో ప్రాభవం కోల్పోయింది

విద్యాసాగర్, వివేకానంద, ఠాగూర్, నేతాజీ తదితర మహామహులు పుట్టిన బెంగాల్‌లో హిందీ అవసరం లేదన్న నాయకుల వాదనను తథాగథ రాయ్ కొట్టి పారేశారు. అలాంటి గొప్ప వ్యక్తులకు, హిందీ నేర్చుకోవడానికి మధ్య ఉన్న సంబంధం ఏంటో అర్థం కావడంలేదని అన్నారు. ఆ మహానుభావులతోనే బెంగాల్ ప్రాభవం కోల్పోయిందని అభిప్రాయపడ్డారు.

బార్ డ్యాన్సర్లుగా బెంగాలీ యువతులు

బార్ డ్యాన్సర్లుగా బెంగాలీ యువతులు

హిందీ రానందునే బెంగాలీలు సరైన ఉపాధి పొందలేకపోతున్నారన్న తథాగథ రాయ్.. యువతను కించపరిచేలా మాట్లాడారు. హర్యానా నుంచి కేరళ వరకు బెంగాల్ యువకులు ఇళ్లలో పాచి పనులు చేస్తున్నారని, అమ్మాయిలు ముంబైలో బార్ డ్యాన్సర్లుగా మారుతున్నారని విమర్శించారు. బెంగాల్ యువత ఇలాంటి పనులు చేస్తారని కలలో కూడా ఊహించలేదని అన్నారు.

నిరసనకు సిద్ధమైన తృణమూల్

నిరసనకు సిద్ధమైన తృణమూల్

బెంగాల్‌ రాష్ట్రానికి చెందిన తథాగథ రాయ్ సొంత భాష, యువతపై చేసిన వ్యాఖ్యలపై పెను దుమారమే రేగింది. ట్విట్టర్ ఫాలోవర్లలో కొందరు ఆయన వ్యాఖ్యల్ని సమర్థించగా.. మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్‌తో పాటు ఇతర రాష్ట్రాల యువత కూడా ఇలాంటి పనులు చేస్తున్నారన్న విషయాన్ని తథాగథ రాయ్ గుర్తుంచుకోవాలని ఫైర్ అయ్యారు. కేవలం హిందీ రాకపోవడం వల్లే ఉద్యోగాలు దొరకడంలేదన్న వాదనలో నిజం లేదని, సరైన విద్యా సౌకర్యాలు, ఉపాధి దొరకని కారణంగానే అలా జరుగుతోందని అన్నారు. మేఘాలయ గవర్నర్ ట్వీట్‌పై తృణమూల్ కాంగ్రెస్ నిరసన ప్రదర్శనకు సిద్ధమైంది. ఇదిలా ఉంటే తథాగథ రాయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ కాంట్రవర్శియల్ కామెంట్లు చేసినా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Meghalaya Governor Tathagata Roy has delivered another shocker, commenting that Bengal's greatness is gone and Bengalis are "sweeping the floors" or "are bar dancers in Mumbai". He was offering his views on some states resisting Hindi learning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more