వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కత్తిపోట్లతో పదవతరగతి విధ్యార్థి దుర్మరణం, అమ్మాయి వ్యవహరమే కారణం?

పదవతరగతి చదివే 15 ఏళ్ళ ఎన్ హర్షరాజ్ అనే విధ్యార్థి కత్తిపోట్లకు గురై మరణించాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని నార్త్ బెంగుళూర్ లోని యాల్హాంకా స్కూల్ క్యాంపస్ లో చోటుచేసుకొంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు:;పదవతరగతి చదివే 15 ఏళ్ళ ఎన్ హర్షరాజ్ అనే విధ్యార్థి కత్తిపోట్లకు గురై మరణించాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని నార్త్ బెంగుళూరులోని యాల్హాంకా స్కూల్ క్యాంపస్ లో చోటుచేసుకొంది.

తోటి విధ్యార్థులతో గొడవ సందర్భంగా హర్షరాజ్ అనే విధ్యార్థిని తోటివిద్యార్థులు కత్తితో పొడిచారు. ఛాతీపై కత్తిపోట్లతో గాయాలు కావడంతో స్కూల్ బయటే హర్షరాజ్ చనిపోయాడు. ఈ ఘటనకు ఓ విధ్యార్థిని వ్యవహరమే కారణమని పోలీసులు చెబుతున్నారు.

ఈ ఘటన స్కూల్ క్యాంపస్ ఆవరణలోనే చోటుచేసుకొంది.అంతేకాదు పోలీస్ స్టేషన్ కు 200 మీటర్ల పరిధిలోనే ఈ దారుణం చోటుచేసుకొంది.స్కూల్ క్యాంపస్ లోనే హర్షరాజ్ తీవ్ర గాయాలతో పడి ఉండడాన్ని చూసిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆసుపత్రికి తరలించారు.

Bengaluru: 15-yr-old stabbed to death near his school over alleged affair

ఈ స్కూల్ కు సమీపంలోనే ఉన్న కాలేజీకి చెందిన ఓ అమ్మాయి వ్యవహరమై చోటు చేసుకొన్న గొడవ వల్లే హర్షరాజ్ మరణించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. హర్షరాజ్ స్నేహితులను క్లాస్ మేట్స్ ను ఈ విషయమై పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

ఈ అమ్మాయి విషయమై కొందరితో హర్షరాజ్ సోమవారం ఉదయమే గొడవ పడ్డారని తెలుస్తోంది.పది నుండి 12 మంది విధ్యార్థులతో హర్షరాజ్ వాగ్వావాదానికి దిగాడు,.అయితే మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో కొందరు విధ్యార్థులు గొడవపడ్డారని హర్షరాజ్ స్కూల్ విధ్యార్థులు పోలీసులకు చెప్పారు.

రైల్వే ట్రాక్ పక్కనే ఉన్న రోడ్డు పైనే గొడవ పడుతూ విధ్యార్థులు వచ్చారని చెప్పారు.అయితే ఈ గొడవ మధ్యలో ఓ బాలుడు తన వెంట తెచ్చుకొన్న కత్తితో పొడవడంతో హర్షరాజ్ తీవ్రంగా గాయపడ్డాడని పోలీసులుచెబుతున్నారు.

మరో వైపు ఇదే ఘటనలో చెవికి గాయాలైన ఓ విధ్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందాడని పోలీసులు చెప్పారు. హర్షరాజ్ తండ్రి పాల వ్యాపారం చేస్తున్నాడు. హర్షరాజ్ కు ఓ సోదరి కూడ ఉంది.

English summary
A Class 10 student was stabbed to death outside his school campus in Yelahanka, North Bengaluru, on Monday afternoon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X