బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరులో యువతి మర్మాంగంలో కారం చల్లి, గెరిటతో ?

మైనర్ బాలిక ప్రేమకు సహకరించిందని ఆరోపిస్తూ బెంగళూరు నగరంలో 19 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి ఇంటిలో నిర్భందించి ఆమె మర్మాంగంలో కారణం పోసి గెరిటలతో గుచ్చి చిత్రహింసలకు గురి చేసి నరకం చూపించారు.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు నగరంలో మరో దారుణం జరిగింది. దేశం తలదించుకునే పని చేసి ఐటీ నగరానికి మరో చెడ్డపేరు మూటకట్టారు. మైనర్ బాలిక ప్రేమించిన వ్యక్తితో వెళ్లిందని, అందుకు ఓ యువతి కారణం అని ఆరోపిస్తూ ఆమెను కిడ్నాప్ చేసి నరకం చూపించారు.

ఈ దారుణానికి దిగజారిన ముగ్గురు మహిళలతో సహ ఐదు మందిని బెంగళూరులోని నందిని లేఔట్ పోలీసులు అరెస్టు చేశారు. రుబినా తాజ్, యాస్మిన్, ఇందిరా, జబీర్, ఇమ్రాన్ అనే నిందితులను యశవంతపుర, ఎంఎస్ పాళ్య ప్రాంతాల్లో అరెస్టు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.

నందిని లేఔట్ లో నివాసం ఉంటున్నమైనర్ బాలిక ఈనెల 15వ తేదిన మాయం అయ్యింది. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న 19 ఏళ్ల యువతి ఇంటికి వస్తున్న వ్యక్తి తమ కుమార్తెను ప్రేమించి మాయ చేసి పిలుచుకుని వెళ్లిపోయాడని, వారికి పక్కింటి యువతి సహకరించిందని అమ్మాయి కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది.

Bengaluru: 19-year-old woman stripped, molested and tortured

ఈనెల 17వ తేదిన సమీపంలో నివాసం ఉంటున్న 19 ఏళ్ల యువతి ఇంటికి అమ్మాయి కుటుంబ సభ్యులు వెళ్లి గొడవ పెట్టుకున్నారు. ఆ యువతి మా ఇంటికి వస్తున్న వ్యక్తి కేఆర్ పురం సమీపంలోని టిన్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాడని చెప్పి అక్కడకు తీసుకు వెళ్లారు.

అయితే అక్కడ ఆ యువకుడు, మైనర్ బాలిక కనిపించలేదు. అంతే మైనర్ బాలిక కుటుంబ సభ్యులు రెచ్చిపోయారు. యువతిని ఆటోలో కిడ్నాప్ చేసి వారి ఇంటికి తీసుకు వెళ్లి నిర్భందించారు. తరువాత యువతిని నగ్నంగా తయారు చేసి చిత్రహింసలు పెట్టారు.

ఆమె మర్మాంగంలో కారంపోడి పోసి గెరిటలతో గుచ్చి నరకం చూపించారు. ఇద్దరు వ్యక్తులకు మరో ముగ్గురు మహిళలు సహకరించడంతో ఆమెను చిత్రహింసలకు గురి చేశారు. బాధితురాలు తప్పించుకుని ఇంటికి వెళ్లి జరిగిన విషయం తల్లికి చెప్పింది. యువతి ఆమె తల్లి ఫిర్యాదు చెయ్యడంతో ముగ్గురు మహిళలతో సహ ఐదు మందిని అరెస్టు చేశారు.

19 ఏళ్ల బాధితురాలికి చికిత్స చేయిస్తున్నామని పోలీసులు తెలిపారు. 15వ తేది మాయం అయిన మైనర్ బాలికను, యువకుడి ఉన్న ప్రాంతం గుర్తించి వారిని పిలుచుకుని వచ్చి విచారిస్తున్నామని నందిని లేఔట్ పోలీసులు తెలిపారు.

English summary
Nandini Layout police arrested Tasina Rehman, Yasmin Jabiulla Taj, Indramma Raju, Imran Pasha and Jabiulla Wasim, residents of Yeshwantpur, M S Palya and Lakshmidevi Nagar in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X