బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యువ మోడల్‌ను దారుణంగా హత్య చేసిన ఓలా క్యాబ్ డ్రైవర్: జాగ్రత్తలు తీసుకోవాలంటూ పోలీసులు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కోల్‌కతాకు చెందిన యువ మోడల్, ఈవెంట్ మేనేజర్ పూజ సింగ్ డే(30ని దారుణంగా హత్య చేసిన ఓలా టాక్సీ డ్రైవర్‌ హెచ్ఎం నగేష్‌ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు వచ్చిన పూజ.. తిరిగి కోల్‌కతా వెళుతుండగా కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద జులై 31న హత్యకు గురైంది.

విమానాశ్రయానికి తీసుకెళ్లాలంటూ..

విమానాశ్రయానికి తీసుకెళ్లాలంటూ..

ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హత్య జరిగిన రోజు తెల్లవారుజామున కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం వెళ్లేందుకు పూజ.. ఓ ఓలా క్యాబ్ డ్రైవర్‌ను సంప్రదించింది. ఆ క్యాబ్ డ్రైవర్ నగేష్‌కు ఫోన్ చేసి జులై 31న ఉదయం 4గంటలకు తనను విమానాశ్రయానికి తీసుకెళ్లాలని కోరింది. కోల్‌కతా వెళ్లేందుకు తాను బస చేసిన పరప్పన అగ్రహార హోటల్ నుంచి ఆ ఓలా క్యాబ్‌లో బయల్దేరింది.

డబ్బులు ఇవ్వలేదని దారుణం..

డబ్బులు ఇవ్వలేదని దారుణం..

అయితే, నిందితుడు, క్యాబ్ డ్రైవర్ నగేష్ నేరుగా విమానాశ్రయం తీసుకెళ్లకుండా ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు.పూజను డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. ఆమె నిరాకరించడంతో జాక్ రాడ్‌తో పూజను తీవ్రంగా కొట్టి, ఆమె వద్ద ఉన్న నగదు, మొబైల్ ఫోన్లు ఇతర విలువైన వస్తువులు తీసుకున్నాడు. అంతేగాక, పూజ భర్తకు ఫోన్ చేసిన నిందితుడు నగేష్.. రూ. 5లక్షలు డిమాండ్ చేశాడు.

పూజ మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్తులు

పూజ మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్తులు

ఆ తర్వాత విమానాశ్రయం కాంపౌండ్ సమీపంలో, కియా వెనుకాల పూజ మృతదేహాన్ని వదిలేసి పరారయ్యాడు నిందితుడు నగేష్. కాగా, విమానాశ్రయంలో సమీపంలోని కడయరప్పనహళ్లి గ్రామస్తులు పూజ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పూజ ధరించిన టైటాన్ వాచ్, జలస్ జీన్స్, బ్రాండెడ్ శాండల్స్ ను బట్టి పోలీసులు బాధితురాలిని గుర్తించారు.

వ్యక్తిగతంగా బుక్ చేసుకోవద్దు..

వ్యక్తిగతంగా బుక్ చేసుకోవద్దు..

జులై 30న బెంగళూరులో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన పూజ.. మళ్లీ పశ్చిమబెంగాల్ వెళుతుండగా ఈ దారుణం జరిగిందని పోలీసులు తెలిపారు. ఘటనపై పూజ భర్త కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెంగళూరు పోలీసులను ఆశ్రయించారు. ప్రయాణికులు ఎవ్వరూ కూడా వ్యక్తిగతంగా క్యాబ్ బుక్ చేసుకోవద్దని.. క్యాబ్ అగ్రిగేటర్స్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

English summary
The driver of a car linked to an app-based taxi aggregator service Ola in Bengaluru has been arrested by the Bengaluru police in connection with the murder of a young model and event manager from Kolkata on July 31.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X