బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరు ఎయిర్ షో ప్రమాదం: తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే భారీ అగ్నిప్రమాదం సంభవించిందా..?

|
Google Oneindia TeluguNews

బెంగళూరులో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎయిర్ షోలో అడుగడుగునా నిర్లక్ష్యం దర్శనమిస్తోంది. కేంద్ర విమానాయాన శాఖ ఆధ్వర్యంలో ఎలహెంకలో జరగుతున్న ఈ ఎయిర్‌షోలో ఇప్పటికే రెండు ప్రమాదాలు జరిగాయి. ఎయిర్ షోను తిలకించేందుకు వచ్చిన వీక్షకులు ప్రాణాలతో పరుగులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంతకీ లోపం ఎక్కడుంది..? ఇంత ప్రతిష్టాత్మకమైన ఎయిర్ షోకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందా..?

బెంగళూరు ఎయిర్ షో పార్కింగ్ లో అగ్నిప్రమాదం .. పదుల సంఖ్యలో కాలిబూడిదైన కార్లు ( వీడియో)బెంగళూరు ఎయిర్ షో పార్కింగ్ లో అగ్నిప్రమాదం .. పదుల సంఖ్యలో కాలిబూడిదైన కార్లు ( వీడియో)

బెంగళూరులోని ఎలహెంక ఎయిర్ బేస్‌లో పలు దేశాల నుంచి వచ్చిన చిన్న విమానాల నుంచి పెద్ద జంబో విమానాల వరకు కొలువుదీరాయి. ఇక ఎయిర్ షో ప్రారంభం అవుతుంది అనగా వరుస ప్రమాదాలు దర్శనమిస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ రిహార్సల్ చేస్తుండగా రెండు జెట్ విమానాలు గాల్లోనే ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఇందులో ఇద్దరు పైలట్లు క్షేమంగా బయటపడ్డారు. మరో పైలట్ వింగ్ కమాండర్ గాంధీ మృతి చెందారు. గాల్లో రెండు జెట్ విమానాలు విన్యాసాలు చేస్తుండగా... అంటే ఒకదానిపై మరొకటి వెళుతూ విన్యాసం చేస్తున్న సమయంలో రెండు విమానాలు ఢీకొన్నాయి. అయితే సాంకేతిక తప్పిదాల వల్లే ఈ రెండు విమానాలు ఢీకొన్నాయని భావిస్తున్నారు.

Bengaluru Airshow : How did fire engulf in the parking lot

ఇక శనివారం ఎయిర్ షోను తిలకించేందుకు వేలమంది ప్రజలు ఎలహెంకా ఎయిర్ బేస్‌కు చేరుకున్నారు. కార్ల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేసినప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పెను ప్రమాదమే సంభవించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం పెద్ద గాలులు వీయడంతో ఎండుగడ్డికి మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మంటలు ఇతర కార్లకు వ్యాపించడంతో ప్రమాదం తీవ్రతరంగా మారింది. అయితే పార్కింగ్ స్పేస్‌లో ఫైర్ ఇంజిన్లు లేకపోవడంతో సకాలంలో మంటలు అదుపు చేయలేకపోయారు. దీంతో దాదాపు 300 కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఒకవేళ ఫైర్ ఇంజిన్లు పార్కింగ్ లాట్‌లో ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని భావిస్తున్నారు. వెంటనే స్పందించి అగ్నిని అప్పటికే ఆర్పివేసి ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Bengaluru Airshow : How did fire engulf in the parking lot

మొత్తానికి ఇలాంటి ప్రతిష్టాత్మకమైన షోలు నిర్వహించే సమయంలో జాగ్రత్త చర్యలు మరిన్ని తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఎయిర్ షో చూసేందుకు వచ్చిన వీక్షకులు. అంతేకాదు పార్కింగ్ స్పేస్‌లో కూడా ఫైర్ ఇంజిన్లను పెట్టినట్లయితే ఇంతపెద్ద ప్రమాదం జరిగేది కాదని వారు చెప్పారు. ప్రమాదం పార్కింగ్ స్పేస్‌లో జరిగింది కాబట్టి అంతా ఊపిరి పీల్చుకున్నారని అదే వీక్షకుల గ్యాలరీ వద్ద ఈ స్థాయి ప్రమాదం సంభవించి ఉంటే పరిస్థితి ఊహించేందుకే భయంకరంగా ఉందని వారు అన్నారు. ఎయిర్ షో చూసేందుకు టికెట్ల రూపంలో ఇంత డబ్బును వసూలు చేస్తున్నప్పుడు జాగ్రత్తలు కూడా అంతే స్థాయిలో ఉండాలని సూచించారు.

English summary
Bengaluru airshow which took of in a grand manner witnessed two accidents in a span of just four days. Earlier two fighter jets crashed in mid air while practicing for the show and in a fresh incident fire broke out in the parking space where 300 cars were gutted. People who were at the show blamed the event managers for their failure in not arranging fire engines in the parking space.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X