బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: మీకేం పోయేకాలం, చైనా బుద్ది, పైత్యం పట్టిందా ? బెంగళూరు అపార్ట్ మెంట్ లో మహిళ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ న్యూఢిల్లీ: ఐటీ, బీటీ సంస్థల దేశరాజధాని సిలికాన్ సిటీ బెంగళూరులో కరోనా వైరస్ (COVID 19) పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కరోనా పాజిటివ్ కేసులు అరికట్టడంలో బృహత్ బెంగళూరు మహానగర పాలికె (BBMP) అధికారులు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో ? ఆదేవుడికే తెలియాలి. అయితే కరోనా పాజిటివ్ ఉన్న తల్లి, ఇద్దరు చిన్న పిల్లలు నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ ను రేకుల షీట్లతో సీల్ చేశారు. ఆ మహిళ ఇంటితో పాటు పక్కన ఉన్న మరో ఫ్లాట్ లో నివాసం ఉంటున్న వృద్ద దంపతుల ఇంటిని రేకుల షీట్లతో సీల్ డౌన్ చేశారు. నిరంకుశపాలన కొనసాగే చైనాలో చేసినట్లు అచ్చం అలాగే బీబీఎంపీ అధికారులు వారు పైత్యం చూపించడంతో ఆఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మీకేం పోయోకాం వచ్చింది అంటూ అధికారులపై నెటిజన్లు శాపనార్తాలు పెట్టారు.

క్వారంటైన్ లో యువతి హీరోయిన్ లా ఉందని, అర్దరాత్రి డాక్టర్ రెండుసార్లు, పాపం పండింది, సీసీటీవీల్లో !క్వారంటైన్ లో యువతి హీరోయిన్ లా ఉందని, అర్దరాత్రి డాక్టర్ రెండుసార్లు, పాపం పండింది, సీసీటీవీల్లో !

 చైనాలో అంతేగా అంతేగా

చైనాలో అంతేగా అంతేగా

కరోనా వైరస్ పుట్టినిల్లు చైనాలో ఆ వైరస్ సోకిన ప్రజల పట్ల అక్కడి డ్రాగన్ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోంది. కరోనా రోగుల విషయంలో చైనా ప్రభుత్వం దారుణంగా ప్రవర్తించింది. ఇది ఏమిటని ఎవరైనా ప్రశ్నిస్తే అంతా మాఇష్టం అంటూ చైనా ప్రభుత్వం చెప్పింది. చైనా ప్రభుత్వం పైత్యంతో ఆదేశంలోని కరోనా వైరస్ వ్యాధి సోకిన రోగులు అనేక అవమానాలకు గురైనారు. అయితే ఆ విషయం ఆదేశానికి సంబంధించినది కావడంతో ఇతర దేశాలు పెద్దగా పట్టించుకోలేదు.

 బెంగళూరులో ఏం జరిగిందంటే ?

బెంగళూరులో ఏం జరిగిందంటే ?

సిలికాన్ సిటీ బెంగళూరులో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. జులై 14వ తేదీ నుంచి జులై 22వ తేదీ ఉదయం వరకు బెంగళూరులో మళ్లీ లాక్ డౌన్ అమలు చేశారు. అయితే లాక్ డౌన్ ప్లాన్ బెడిసికొట్టడం, మామూలు రోజుల కంటే లాక్ డౌన్ సమయంలోనే కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ కావడంతో ఆ ప్లాన్ ను పక్కనపెట్టిన కర్ణాటక ప్రభుత్వం బెంగళూరు సిటీ, గ్రామీణ జిల్లాలతో పాటు ఆ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలులో ఉన్న లాక్ డౌన్ కు మంగళం పాడేసింది.

 అపార్ట్ మెంట్ లో తల్లి, పిల్లలు

అపార్ట్ మెంట్ లో తల్లి, పిల్లలు

బెంగళూరు సిటీలోని ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న తల్లి, ఆమె ఇద్దరు చిన్న పిల్లలకు కరోనా వైరస్ పాజిటివ్ అని బీబీఎంపీ అధికారులు గుర్తించారు. అపార్ట్ మెంట్ లో అనేక ఫ్లాట్స్ లో అనేక కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. మహిళ, ఇద్దరు పిల్లల కారణంగా ఇతరులకు కరోనా వైరస్ వ్యాపించకుండా చూడాలని బీబీఎంపీ అధికారులు నిర్ణయించారు.

చైనా పైత్యం పట్టుకుంది

మహిళ ఇంటిని సీల్ డౌన్ చెయ్యలని నిర్ణయించిన బీబీఎంపీ అధికారుల తీరు అంత వరకు బాగానే ఉంది. తరువాత వారి మైండ్ లో ఓ చీడపురుగు తిరగడంతో వారి పైత్యం తలకు ఎక్కింది. నేరుగా మహిళ నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ దగ్గరకు వెళ్లారు. తరువాత ఆమె నివాసం ఉంటున్న ఇంటితో పాటు పక్కనే అనుకుని మరో ఫ్లాట్ లో నివాసం ఉంటున్న వృద్దదంపతుల ఇంటికి రేకుల షీట్లు బిగించి బయట నుంచి పటాపటా అంటూ మేకులు కొట్టేశారు.

 మీకు ఎలాంటి చాన్స్ ఇవ్వం

మీకు ఎలాంటి చాన్స్ ఇవ్వం

ఎలాంటి సందర్బంలో కరోనా పాజిటివ్ ఉన్న మహిళ, ఆమె పిల్లలు ఇంటి నుంచి బయటకు రాకుండా చేశారు. పనిలోపనిగా బీబీఎంపీ అధికారుల పైత్యం ముదిరిపోవడంతో ఇనుప రేకులు మిగిలిపోయాయని పక్కంటిలో నివాసం ఉంటున్న వృద్ద దంపతుల ఇంటికి రేకుల షీట్లు బిగించి చేతులు దులుపుకున్నారు. ఇనుప రేకులతో ఇంటిలో నుంచి చీమకూడా బయటకు రాకుండా సీల్ డౌన్ చేస్తున్న సమయంలో అదే అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న వారు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యాయి.

 చైనాలో ఉన్నామా ? లేక భారత్ లో

చైనాలో ఉన్నామా ? లేక భారత్ లో

ఎవరికైనా కరోనా వైరస్ పాజిటివ్ అని వెలుగు చూస్తే వారి ఇళ్లతో పాటు ఆ ప్రాంతాన్ని సీల్ డౌన్ చేస్తున్నారు. అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న మహిళకు, ఆమె ఇద్దరు చిన్న పిల్లలకు కరోనా పాజిటివ్ అని తెలిస్తే ఆమె ఫ్లాట్ ను సీల్ డౌన్ చెయ్యాలి, లేదా అపార్ట్ మెంట్ గేట్ కు తాళం వేసి లాక్ డౌన్ చెయ్యాలి. చైనాలో లాగా కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్న ఇంటిని ఇనుప రేకులతో ఎలా సీల్ చేశారో అచ్చం అలాగే బెంగళూరులో రేకుల షీట్లతో సీల్ చెయ్యడంతో నెటిజన్లు మండిపడుతున్నారు.

Recommended Video

Tollywood Juniour Artists Requesting Government to Help During COVID-19 Pandemic Situations
 మీకేం పోయేకాలం వచ్చింది !

మీకేం పోయేకాలం వచ్చింది !

కరోనా పాజిటివ్ వచ్చిన మహిళ ఇంటి పక్కన మరో ఫ్లాట్ లోని వృద్దదంపతుల ఇంటికి రేకుల షీట్లు ఎందుకు బిగించారు ? లోపల అగ్నిప్రమాదం జరిగితే వారు ఎలా బయటకు రావాలి ? ఊపిరిఆడక వారి ప్రాణాలు పోవాలా ? స్వతంత్ర భారతదేశంలో మీరు ఇలాగేనా వ్యవహరించేది ? అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో బూతులు తిట్టారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో కళ్లు తెరిచిన బీబీఎంపీ అధికారులు అపార్ట్ మెంట్ లోని రెండు ఫ్టాట్స్ కు బిగించిన రేకుల షీట్లను రాత్రికిరాత్రి తొలగించి హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం మీద బీబీఎంపీ అధికారుల పైత్యం ముదిరిపోయి ఇలా చెయ్యడంతో నెటిజన్ల దగ్గర తిట్లదండకం వినవలసి వచ్చింది.

English summary
Coronavirus: Bengaluru BBMP administration adopted inhuman China model To Sealdown COVID 19 positivie patients house.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X