బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus patients: బెంగళూరు హోటల్స్ లో కరోనా క్వారంటైన్ లు, A to Z

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి వ్యాపిస్తోంది. కరోనా వైరస్ అరికట్టడానికి అనేక దేశాల ప్రభుత్వాలు నానా తంటాలు పడుతున్నాయి. బెంగళూరు నగరంలో కరోనా కట్టడికి అనేక చర్యలు తీసుకుంటున్నారు. బెంగళూరు నగరంలో కరోన వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. బెంగళూరులో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అరికట్టడానికి బీబీఎంపీ మరో ముందడుగు వేసింది. కరోనా వైరస్ వ్యాధి సోకిన అనుమానితులకు ప్రత్యేక చికిత్స అందించడానికి బెంగళూరు నగరంలోని ప్రముఖ హోటల్స్ లో క్వారంటైన్ లు ఏర్పాటు చేశారు. హోటల్స్ లోని క్వారంటైన్ లో ఉంటున్న వారు ఆసుపత్రులకు వెళ్లకుండా, హోటల్ గదుల్లో నుంచి బయటకు రాకుండా చూస్తున్నామని, బెంగళూరులో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరగకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని బెంగళూరు మేయర్ తెలిపారు.

Coronavirus: ఒకే ఫ్యామిలీలో ఐదు మందికి, యువతితో లింక్, ఎలా వెళ్లి ఎలా వచ్చిందంటే?Coronavirus: ఒకే ఫ్యామిలీలో ఐదు మందికి, యువతితో లింక్, ఎలా వెళ్లి ఎలా వచ్చిందంటే?

17 హోటల్స్ లో A to Z

17 హోటల్స్ లో A to Z

బెంగళూరు నగరంలో కరోనా వైరస్ వ్యాధి సోకిన వారిని గుర్తిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాధి సోకిన అనుమానితులను గుర్తించి బెంగళూరు నగరంలో మొదటి విడతలో 17 హోటల్స్ లోని క్వారంటైన్ లోని వేర్వేరు గదుల్లో ఉండటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. హోటల్స్ లోని క్వారంటైన్ లో ఉంటున్న వారు ఒకరిని ఒకరు కలవకుండా చర్యలు తీసుకుంటున్నామని బృహత్ బెంగళూరు మహానగర పాలికె (BBMP) మేయర్ తన ఫేస్ బుక్ లో వివరించారు.

హోటల్స్ లో అన్ని జాగ్రత్తలు!

హోటల్స్ లో అన్ని జాగ్రత్తలు!

హోటల్స్ లోని క్వారంటైన్ ఉండే కరోనా వైరస్ వ్యాధి అనుమానితులకు అల్పహారంతో పాటు భోజనం, వారికి కావలసిన సౌకర్యలు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా వైరస్ సోకిందని అనుమానంతో హోటల్స్ లోని క్వారంటైన్ లో ఉంటున్న వారికి టిఫిన్, భోజనం, చిరుతిండ్లను వాణిజ్య, పరిశ్రమల శాఖ అధికారులు నియమించిన ఉద్యోగులు వాటిని చెక్ చేసి క్రమ పద్దతిలో అందించడానికి అన్ని చర్యలు తీసుకున్నారు. అవసరం అయితే రెవెన్యూ శాఖ అధికారుల సహకారం తీసుకుని కరోనా వైరస్ వ్యాధి సోకిన అనుమానితులు హోటల్స్ లోని క్వారంటైన్స్ లో త్వరగా కోలుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామని బీబీఎంపీ అధికారులు తెలిపారు.

హోటల్స్ క్వారంటైన్ లు ఎలా ఉపయోగిస్తారంటే?

హోటల్స్ క్వారంటైన్ లు ఎలా ఉపయోగిస్తారంటే?

కరోనా వైరస్ వ్యాధి సోకిందని అనుమానంతో గుర్తించిన వారిని బెంగళూరు నగరంలోని 17 హోటల్స్ లోని క్వారంటైన్ లకు తరలిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాధి సోకిందనే అనుమానంతో హోటల్స్ లోని క్వారంటైన్స్ కు తరలించే వారికి వ్యాధి ఉందా?, లేదా ? అనే విషయం నిర్ధారణ అయ్యే వరకు అక్కడే ఉండటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ సమయంలో అనుమానిత కరోనా వైరస్ వ్యాధి లక్షణాలు ఉన్న వారికి అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వం చెల్లించడానికి సిద్దం అయ్యింది.

హోటల్స్ లో ఏసీలు బంద్

హోటల్స్ లో ఏసీలు బంద్

కరోనా వైరస్ వ్యాధి నయం కావడానికి చికిత్స అందిస్తున్న హోటల్స్ లోని క్వారంటైన్స్ లో ఏసీ పూర్తిగా నిలిపివేశారు. హోటల్స్ లో ఉంటున్న వారికి టిఫిన్, భోజనం సరఫరా చేసిన తరువాత ఆ ఆహారం మిగిలిపోతే వేరే వారికి ఇవ్వకూడదని, అనుమానిత రోగులకు ఆహారం పేపర్ ప్లేట్ లు ఉపయోగించాలని ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు. హోటల్స్ లోని క్వారంటైన్ లో ఎంత మంది ఉంటున్నారు అనే పూర్తి లేక్కలు వేస్తున్నారు. హోటల్స్ నిర్వహకులకు ఎంత డబ్బులు చెల్లించాలి అనే విషయం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటి నిర్ణయిస్తుందని సంబంధిత అధికారులు తెలిపారు.

English summary
Coronavirus: Bruhat Bengaluru Mahanagara Palike (BBMP) identified 17 hotels in Bengaluru city to quarantine COVID-19 patients.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X