• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇస్మార్ట్ కొడుకు.. అయ్య ఫోనులో గేమ్స్ ఆడుతూ.. రాసలీలల బాగోతం బయటేశాడుగా..!

|

బెంగళూరు : స్మార్ట్‌ఫోన్లు.. ఇస్మార్ట్ శంకర్ల బాగోతాలు బయటపెడుతున్నాయి. తప్పుల మీద తప్పులు చేస్తూ దొరకబోమనే ధీమాతో ఉన్న ఇస్మార్ట్ శంకర్లు స్మార్ట్‌ఫోన్ల కారణంగా చిక్కుల్లో పడుతున్నారు. అదే క్రమంలో ఓ తండ్రి పరువు బజారున వేశాడు కొడుకు. ఏ స్మార్ట్‌ఫోన్లో ఇతర మహిళతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు భద్రపరుచుకున్నాడో.. అదే స్మార్ట్‌ఫోన్ అతడిని పోలీసులకు పట్టించింది. బెంగళూరులో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వైరల్‌గా మారింది.

గులాబీవనం కాదది, గాలి బుడగ.. పునాదిలేని భవంతి మీద తండ్రీకొడుకులు.. దత్తన్న సురుకులు..!

బాప్ ఏక్ నెంబరీ.. బేటా ఇస్మార్ట్ శంకరీ..!

బాప్ ఏక్ నెంబరీ.. బేటా ఇస్మార్ట్ శంకరీ..!

బెంగళూరుకు చెందిన ఓ సామాజిక వేదిక నాయకుడు స్మార్ట్‌ఫోన్ కారణంగా అడ్డంగా బుక్కయ్యాడు. వివాహితుడైన సదరు లీడర్ నెరుపుతున్న అనైతిక రాసలీలల గుట్టు రట్టైంది. అయితే కొడుకు కారణంగా అతడి బాగోతం బయటపడటం ప్రస్తుతం హాట్ టాపికైంది. ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. భార్య, పిల్లలతో అందమైన కుటుంబం కలిగిన ఆ నాయకుడు చివరకు తాను తీసుకున్న గోతిలో తానే పడి ఇప్పుడు చట్టం ద‌ృష్టిలో రిమార్క్ వేసుకున్నాడు.

బెంగళూరులోని బనాశంకరీ స్టేజ్ 3 ప్రాంతంలో నివాసముండే నాగరాజు స్థానికంగా ఓ సామాజిక సంస్థ నేతగా చలామణీ అవుతున్నాడు. అతని భార్య అక్కడే ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. వీరిద్దరికీ ఓ అబ్బాయి. అతడు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అయితే పదిమందికి పదిరకాలుగా మంచి చెడు చెప్పే ఆ పెద్దాయన మాత్రం దారి తప్పాడు. పెళ్లై పదిహేను సంవత్సరాలు దాటినా.. నాగరాజు పరస్త్రీ వ్యామోహంలో పడ్డాడు. అంతేకాదు ఆమెతో చనువుగా మాట్లాడిన ఆడియో క్లిప్పులన్నీ భద్రంగా స్మార్ట్‌ఫోన్లో దాచుకున్నాడు.

వివాహేతర సంబంధం.. స్మార్ట్‌ఫోన్ కొంప ముంచిందిగా..!

వివాహేతర సంబంధం.. స్మార్ట్‌ఫోన్ కొంప ముంచిందిగా..!

నాగరాజు ఇతర మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే గాకుండా ఆమెతో సన్నిహితంగా మెలిగిన వీడియోలతో పాటు కొన్ని ఆడియోలు స్టోర్ చేసుకున్నాడు. అయితే ఇటీవల తన పధ్నాలుగేళ్ల కొడుకు గేమ్స్ ఆడుకుంటానంటే తన ఫోన్ ఇచ్చాడు. అదే నాగరాజు కొంప ముంచింది. ఆ బాలుడు ఆడుకుంటూ వాయిస్ రికార్డు చేసే క్రమంలో ఆడియో గ్యాలరీ ఓపెన్ చేశాడు. అయితే అందులో అన్నీ బూతు పురాణాలే వినిపించడంతో షాక్ తిన్నాడు. అందులో మగ గొంతు తన తండ్రిది కావడంతో మరింత ఆందోళనకు గురయ్యాడు. అంతేకాదు కొన్ని రాసలీలల వీడియోలు కూడా బయటపడ్డట్లు తెలుస్తోంది.

 ఫోన్‌లో గేమ్స్ ఆడుతూ.. అయ్య ఆటలు బయటపెట్టాడుగా..!

ఫోన్‌లో గేమ్స్ ఆడుతూ.. అయ్య ఆటలు బయటపెట్టాడుగా..!

తండ్రి బాగోతం బయటపడటంతో ఆ బాలుడు వెంటనే తన తల్లికి విషయం చెప్పాడు. నాన్న ఫోన్ ఒకసారి చూడమ్మా అంటూ ఆమె చేతికి అందించాడు. అవి చూసిన ఆమె అప్పటిదాకా నాగరాజులోని రెండో కోణం తెలియక షాక్‌కు గురైంది. వెంటనే తన భర్తను నిలదీసింది. సదరు మహిళతో ఉన్న వివాహేతర సంబంధంపై గుచ్చిగుచ్చి ప్రశ్నించింది. అయినా కూడా నాగరాజు బెదరలేదు.

ఆమె ప్రశ్నలకు కోపోద్రిక్తుడైన నాగరాజు తన బాగోతాన్ని అంతటితో వదిలేయాలని.. బయటపెడితే మాత్రం తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించాడు. ఆ నేపథ్యంలో ఆమె పోలీసులను ఆశ్రయించారు. భర్త వివాహేతర సంబంధం గురించి ప్రశ్నిస్తే తనపై దాడి చేసి కొట్టాడని ఫిర్యాదు చేశారు. అక్రమ సంబంధం కొనసాగించడమే గాకుండా తనను చంపుతానని కూడా బెదిరిస్తున్నాడని ఆరోపించారు. అదలావుంటే ఆమె కంప్లైంట్‌ను వెనక్కి తీసుకునేలా నాగరాజు కుటుంబ సభ్యులు వత్తిడి పెంచుతున్నట్లు సమాచారం.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 43 year old man who gave his mobile phone to his teenage son to keep him engaged, Now faces the possibility of his 15 year old marriage ending. The 14 year old boy discovered audio recordings of his father's conversations with his girl friend on the device and bought the extramarital affair to his mother's notice.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more