బెంగళూరులో కుప్పకూలిన భవనం, ఆంధ్రా యువకుడు మృతి, మూడు నెలల క్రితం పెళ్లి !
బెంగళూరు నగరంలోని ఈజీపుర ప్రాంతంలో సోమవారం గ్యాస్ సిలిండర్ పేలి మూడు అంతస్తుల కట్టడం కుప్పకూలిన కేసులో మృతుల సంఖ్య మళ్లీ పెరిగింది. ఇప్పటి వరకూ ఈ ప్రమాదానికి సంబంధించి ఏడు మంది మరణించారని డీసీపీ చంద్ర
బెంగళూరు: బెంగళూరు నగరంలోని ఈజీపుర ప్రాంతంలో సోమవారం గ్యాస్ సిలిండర్ పేలి మూడు అంతస్తుల కట్టడం కుప్పకూలిన కేసులో మృతుల సంఖ్య మళ్లీ పెరిగింది. ఇప్పటి వరకూ ఈ ప్రమాదానికి సంబంధించి ఏడు మంది మరణించారని డీసీపీ చంద్రగుప్త మీడియాకు చెప్పారు.
గ్యాస్ సిలిండర్ పేలడంతో కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం ఎదురింటిలో నివాసం ఉంటున్న మాల్యాద్రి (24) అనే యువకుడు బౌరింగ్ ఆసుపత్రిలో చికిత్స విఫలమై మరణించాడు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన మాల్యాద్రి రెండు సంవత్సరాల క్రితం బెంగళూరు చేరుకుని అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నాడు.

మూడు నెలల క్రితమే మాల్యాద్రికి వివాహం అయ్యిందని డీసీపీ చంద్రగుప్త చెప్పారు. గ్యాస్ సిలిండర్ పేలడం, కట్టడం కూలడంతో మాల్యాద్రికి తీవ్రగాయాలైనాయి. వెంటనే అతన్ని బౌరింగ్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై సోమవారం సాయంత్రం మాల్యాద్రి మరణించాడు. శిథిలాల కింద చిక్కుకుని శరవణ అనే వ్యక్తి మరణించాడు. అతని మృతదేహం బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. శిథిలాలు పూర్తిగా తొలగిస్తున్నామని అగ్నిమాపక శాఖ, పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications