బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పీసీసీ అధ్యక్షుడికి షాక్: సీబీఐ మెరుపుదాడి: మోడీకి చేతనైంది అదొక్కటేనంటూ: తెల్లవారుజాము నుంచే

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్ నివాసంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ అధికారులు మెరుపుదాడి చేశారు. ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో చోటు చేసుకున్న ఈ దాడులు రాజకీయ రంగును పులుముకొంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అప్పుడే విమర్శలను సైతం సంధించడం ప్రారంభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదుపాజ్ఙలతో కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం తన రాజకీయ ప్రత్యర్థులపై రాజ్యాంగ బద్ధ సంస్థలను ప్రయోగిస్తోందని మండిపడుతున్నారు.

Recommended Video

CBI Raids : ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో DK శివకుమార్..CBI సోదాలు!

ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో డీకే శివకుమార్ ఇప్పటికే సీబీఐ రాడార్ పరిధిలో ఉన్నారు. ఈ కేసులో ఆయనను ఇదివరకు సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. రిమాండ్‌కూ తరలించారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై ఉన్నారు. బెయిల్‌పై విడుదలైన తరువాత కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సారథ్య బాధ్యతలను చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉప ఎన్నికలకు సిద్ధపడుతోంది. రెండు అసెంబ్లీ స్థానాలకు వచ్చేనెల 3వ తేదీన ఉప ఎన్నికలను నిర్వహించనున్నారు.

Bengaluru: CBI raids at the premises of Karnataka Congress chief DK Shivakumar

ఈ పరిస్థితుల్లో- సీబీఐ అధికారులు ఆయన ఇంటిపై దాడులు చేపట్టారు. బెంగళూరులోని ఆయన నివాసంలో ఈ తెల్లవారు జాము నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. సీబీఐ దాడుల పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఘాటు విమర్శలను సంధిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పలపై ఆరోపణలు గుప్పించారు. రాజకీయంగా ఎదుర్కొనడం చేతకాకపోవడం వల్లే రాజ్యాంగబద్ధమైన సంస్థలను ప్రయోగిస్తున్నారని విమర్శించారు.

Bengaluru: CBI raids at the premises of Karnataka Congress chief DK Shivakumar

ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా వరుస ట్వీట్లను సంధించారు. సీబీఐ, ఆదాయపు పన్ను, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వంటి సంస్థలను ప్రయోగించి.. తన రాజకీయ ప్రత్యర్థులను బీజేపీ ఇబ్బందులకు గురి చేస్తోందని నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీకి చేతనైంది అదొక్కటేనని ఆరోపించారు. సీబీఐ దర్యాప్తుల ద్వారా తమ పార్టీ నాయకులను బెదిరింపులు, భయభ్రాంతులకు గురి చేస్తోందని, లోబరచుకోవడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. మోడీ ప్రయత్నాలు ఫలించవని, ఏ ఒక్క నేత కూడా బీజేపీ నేతల ముందు మోకరిల్లబోరని చెప్పారు.

Bengaluru: CBI raids at the premises of Karnataka Congress chief DK Shivakumar

ఇదిలా ఉంటే బీజేపీ కక్షపూరిత ధోరణిలో వ్యవహరిస్తోందని మండిపడ్డారు కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య. ఉపఎన్నికలకు సన్నద్ధం అవుతున్న నేపథ్యంలో పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఇంటిపై సీబీఐ దాడులు జరగడాన్ని ఆయన ఖండించారు. తమ దృష్టిని మరల్చి, ఆందోళనకరమైన వాతావరణం సృష్టించేందుకు బీజేపీ యత్నిస్తోందని సిద్దరామయ్య మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

English summary
CBI raids underway at residences of KPCC president D K Shivakumar and Congress leader D K Suresh. Responding to these raids, Congress leader Randeep Singh Surjewala tweeted. Modi and Yeddyurappa Govts and BJP’s frontal organizations CBI-ED-IT raids on Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X