బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ దెబ్బ, ఏసీపీలు బదిలి: రూ. 600 కోట్లు చీటింగ్ కేసు, అనుమానాలు

|
Google Oneindia TeluguNews

Recommended Video

Ambident Fraud Case : గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ రావడంతోనే సీసీబీ అధికారుల మీద వేటు | Oneindia

బెంగళూరు: ఆంబిడెంట్ కంపెనీ చీటింగ్ కేసు విచారణ చేస్తున్న బెంగళూరు సీసీబీ విభాగం ఏసీపీ వెంకటేష్ ప్రసన్నను బదిలి చేస్తూ పై అధికారులు ఆదేశారు. ఆంబిడెంట్ కంపెనీ చీటింగ్ కేసు విచారణలో ఉండగానే ఏసీపీ వెంటకేష్ ప్రసన్న బదిలి కావడంతో సాటి అధికారులు షాక్ కు గురైనారు. గాలి జనార్దన్ రెడ్డి సన్నిహితుడు ఆలీఖాన్ ముందస్తు బెయిల్ ను కోర్టు రద్దు చేసింది. సీసీబీ అధికారులు బదిలి కావడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పోలీసు అధికారులు అంటున్నారు.

జైలుకు గాలి

జైలుకు గాలి

బెంగళూరు సీసీబీ విభాగం ఏసీపీగా పని చేస్తున్న వెంకటేష్ ప్రసన్న బెంగళూరు సీసీఆర్ బి విభాగానికి బదిలి అయ్యారు. ఆండిడెంట్ కంపెనీ చీటింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఈనెల 11వ తేదీన అరెస్టు అయ్యారు.

గాలికి బెయిల్, అధికారులు బదిలి

గాలికి బెయిల్, అధికారులు బదిలి

బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డి అనంతరం బెయిల్ మీద బయటకు వచ్చారు. గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ మీద బయటకు వచ్చిన వెంటనే ఆంబిడెంట్ కంపెనీ చీటింగ్ కేసు విచారణ చేస్తున్న సీసీబీ విభాగం ఏసీపీలు మంజునాథ్ చౌధరి, పీటీ. సుబ్రమణ్య, మరియప్పలను పై అధికారులు బదిలి చేశారు.

రూ. వందల కోట్లు చీటింగ్

రూ. వందల కోట్లు చీటింగ్


సుమారు రూ. 600 కోట్లకు పైగా ప్రజలకు కుచ్చుటోపీ పెట్టారని ఆంబిడెంట్ కంపెనీ మీద కేసు నమోదు చేశారు. ఇదే కేసులో కర్ణాకట మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిని సీసీబీ పోలీసు అధికారులు విచారణ చేసి అరెస్టు చేసి జైలుకు పంపించారు. గాలి జనార్దన్ రెడ్డి కేసు విచారణ మొత్తం ఏసీపీ వెంకటేశ్ ప్రసన్న ఆధ్వర్యంలోనే జరిగింది.

ముందస్తు బెయిల్ రద్దు

ముందస్తు బెయిల్ రద్దు

గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ రావడంతో సీసీబీ అధికారుల మీద వేటు పడింది. ఆంబిడెంట్ కంపెనీ చీటింగ్ కేసులోనే విచారణ ఎదుర్కొంటున్న ఆయన సన్నిహితుడు ఆలీఖాన్ ముందస్తు బెయిల్ ను బెంగళూరు 61వ సిటీ పివిల్ కోర్టు మంగళవారం రద్దు చేసింది.

బదిలిపై అనుమానాలు

బదిలిపై అనుమానాలు

ముందస్తు బెయిల్ ను కోర్టు రద్దు చెయ్యడంతో ఆలీఖాన్ 1వ ఏసీసీ న్యాయస్థానం ముందు లొంగిపోయాడు. ఆలీఖాన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. వందల రూపాయల కోట్ల చీటింగ్ కేసు విచారణ చేస్తున్న అధికారులను ఒక్కసారిగా బదిలి చెయ్యడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

English summary
Bengaluru CCB ACP Prasanna Venkatesh who was investigating ambident fraud case got transfered to ccrb.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X