బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాలి జనార్దన్ రెడ్డి ఇంటిలో సోదాలు, మామ విచారణ, శ్రీరాములు ఎంట్రీ, అరెస్టు భయం!

|
Google Oneindia TeluguNews

Recommended Video

మైనింగ్ కింగ్ ఇంటిలో సోదాలు..!

బళ్లారి (కర్ణాటక): బళ్లారిలోని సిరుగుప్ప రోడ్డులో ఉన్న కర్ణాటక మాజీమంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఇంటిలో బెంగళూరు సీసీబీ పోలీసులు గురువారం దాడులు చేశారు. బెంగళూరు సీసీబీ పోలీసుల ప్రత్యేక బృందాలు గాలి జనార్దన్ ఇంటిలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గాలి జనార్దన్ రెడ్డి ఇంటితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులకు చెందని 15 చోట్ల బెంగళూరు సీసీబీ పోలీసులు సోదాలు చేస్తున్నారు.

అవంబావి ఇల్లు

అవంబావి ఇల్లు

బళ్లారిలోని అవంబావి ప్రాంతంలో ఉన్న గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి బెంగళూరు సీసీబీ పోలీసు అధికారి మంజునాథ్ చౌధరి నేతృత్వంలోని అధికారులు వెళ్లారు. అనంతరం గాలి జనార్దన్ రెడ్డి ఇంటిలోని బంగారం, విలువైన ప్రతాలను అధికారులు పరిశీలిస్తున్నారు.

జనార్దన్ రెడ్డి మామ విచారణ

జనార్దన్ రెడ్డి మామ విచారణ

బెంగళూరు సీసీబీ పోలీసులు దాడులు చేసిన సమయంలో ఇంటిలో గాలి జనార్దన్ రెడ్డి మామ పరమేశ్వర్ రెడ్డి మాత్రమే ఉన్నారని సమాచారం. గాలి జనార్దన్ రెడ్డి మామ పరమేశ్వర్ రెడ్డిని బెంగళూరు సీసీబీ పోలీసులు విచారణ చేసి వివరాలు సేకరిస్తున్నారు.

బీజేపీ ఎమ్మెల్యే శ్రీరాములు ఎంట్రీ

బీజేపీ ఎమ్మెల్యే శ్రీరాములు ఎంట్రీ

గాలి జనార్దన్ రెడ్డి ఇంటిలో బెంగళూరు సీసీబీ పోలీసులు సోదాలు చేస్తున్నారని సమాచారం తెలుసుకున్న వెంటనే బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బళ్లారి శ్రీరాములు అక్కడి వెళ్లారు. స్నేహితుడు గాలి జనార్దన్ రెడ్డి కేసు విషయంలో బెంగళూరు సీసీబీ పోలీసుల విచారణకు బళ్లారి శ్రీరాములు పూర్తిగా సహకరిస్తున్నారని సమాచారం.

లుక్ ఔట్ నోటీసులు

లుక్ ఔట్ నోటీసులు

అరెస్టు భయంతో తప్పించుకు తిరుగుతున్న గాలి జనార్దన్ రెడ్డి ఆచూకి తెలుసుకోవడం కోసం బెంగళూరు పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. బెంగళూరు నగరంతో పాటు హైదరాబాద్, ఢిల్లీ, చిత్రదుర్గ, ఉత్తర కర్ణాటక ప్రాంతాల్లో గాలి జనార్దన్ రెడ్డి కోసం బెంగళూరు సీసీబీ పోలీసులు గాలిస్తున్నారు.

ముందస్తు బెయిల్

ముందస్తు బెయిల్

బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేస్తారని భయంతో గాలి జనార్దన్ రెడ్డి న్యాయవాదులతో సంప్రదించారని తెలిసింది. ముందస్తు బెయిల్ కోసం గాలి జనార్దన్ రెడ్డి కోర్టును ఆశ్రయించే పనిలో నిమగ్నం అయ్యారని సమాచారం. అయితే కోర్టులకు సెలవుల కారణంగా గాలి జనార్దన్ రెడ్డి ముందస్తు బెయిల్ తీసుకోవడానికి ఆసల్యం అయ్యే అవకాశం ఉందని తెలిసింది.

English summary
Karnataka: Bengaluru CCB police raids Gali Janardhan Redds house in Bellary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X