బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మందుబాబులకు షాక్: బీర్లు కొనాలంటే దేశీ మద్యం కొనాల్సిందేనట..!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు నగరంలో మందుబాబులు గోల చేస్తున్నారు. అదేదో మందు ఎక్కువై గోల చేయడం లేదు.. బీర్లు దొరక్క వైన్ షాపుల ముందు గోల చేస్తున్నారు. అవును ఇది నిజం. ఏదో పండగపూట బంధువులందరితో కలిసి ఓ చుక్కేద్దామనుకున్న బీర్ ప్రియులకు నిరాశే మిగిలింది. బీర్ కేసులు కొనేందుకు వైన్ షాపుకు వెళ్లిన వారకి అక్కడ ఖాళీ రిఫ్రిజరేటర్లు దర్శనమిస్తున్నాయి. అందులో ఒక్క బీర్ బాటిల్ కూడా కనిపించకపోవడంతో మందుబాబులు చాలా డిస్సప్పాయింట్ అయ్యారు. ప్రస్తుతం బెంగళూరులో బీర్ల షార్టేజీ నడుస్తోంది.

కొత్త నిబంధనతో ఇబ్బంది పడుతున్న మందుబాబులు

కొత్త నిబంధనతో ఇబ్బంది పడుతున్న మందుబాబులు

బెంగళూరు మహానగరంలో బీర్ల స్టాక్ ఎందుకు తక్కువైందో తెలిస్తే షాక్ అవుతారు. కేవలం భారత్‌లో తయారయ్యే మద్యం మాత్రమే అమ్మాలని ప్రభుత్వం నిబంధన తీసుకురావడంతోనే వచ్చిన స్టాక్ వచ్చినట్లే అయిపోతోందని వైన్‌షాన్ యజమానులు చెబుతున్నారు. అంతేకాదు స్వదేశీ మద్యంతో బీర్ల కంటే ఎక్కువగా రెవిన్యూ వస్తోందని ప్రభుత్వం భావిస్తున్నట్లు వైన్‌షాపు యాజమాన్యాలు చెబుతున్నాయి.

వైను షాపుల్లో బీర్ దొరకడం గగనమైపోయిందని ఇందిరానగర్‌కు చెందిన కెవిన్ మెనెజెస్ అనే మద్యం ప్రియుడు చెప్పాడు. చాలావరకు బీర్ బ్రాండ్లు దొరకడం లేదన్నాడు. ఈ పరిస్థితి గత 10 రోజులుగా ఉందని చెప్పాడు. వైన్ షాపు యజమానులను ఇదేంటి అని అడిగితే లిక్కర్ డిపార్ట్‌మెంట్‌నుంచి స్టాక్ రావడం లేదనే సమాధానం చెబుతున్నారని కెవిన్ వెల్లడించాడు. ఇక శనివారమైతే బీర్లు తప్ప అన్ని రకాల మద్యం బాటిళ్లను అమ్ముతున్నట్లు వైన్‌షాపు యాజమాన్యాలు చెబుతున్నాయని కెవిన్ చెప్పాడు. దేశీయ మద్యంను కొనుగోలు చేస్తేనే బీర్లు అమ్ముతామన్న షరతును విధించారని కెవిన్ చెప్పాడు.

పండగ వేళ కదా... అందుకే కొరత ఏర్పడి ఉండొచ్చు

పండగ వేళ కదా... అందుకే కొరత ఏర్పడి ఉండొచ్చు

ఇదిలా ఉంటే బెంగళూరు నగరంలో బీర్లు షార్టేజీ రావడాన్ని అధికారులు కొట్టిపారేశారు. వారాంతంలో సెలవులు ఎక్కువగా వచ్చినందున స్టాక్ త్వరగా అయిపోయిఉంటుంది తప్ప దీనికి దేశీయ మద్యం కొనుగోలుకు ఎలాంటి సంబంధం లేదన్నారు. త్వరలోనే బీర్లు మళ్లీ వైన్‌షాపుల్లో దర్శనమిస్తాయని చెప్పారు. ఇదిలా ఉంటే అవసరమైన బీర్ల స్టాకును లిక్కర్ డిపార్ట్‌మెంట్‌ సప్లై చేయడం లేదని స్టేట్ వైన్ మర్చంట్స్ అసోసియేషన్ సభ్యుడు ఒకరు ఆరోపించారు. దేశీయ మద్యం ఎంత కొనుగోలు చేస్తామో అంతే బీర్లు సప్లై జరుగుతోందని వారు వాపోయారు. బీర్ల కంటే దేశీయ మద్యంపైనే ఎక్కువగా పన్ను వస్తుండటంతో ప్రభుత్వం ఇలా చేస్తోందని ఆరోపించారు. ఇది ఒక్క బెంగళూరు నగరంలోనే కాదని రాష్ట్రవ్యాప్తంగా బీర్ల సప్లయ్ తగ్గిపోయిందని చెప్పారు. అయితే బెంగళూరులోనే అత్యధికంగా బీర్లు అమ్ముడుపోతుండటంతో బీర్ల స్టాక్ సప్లయ్ తగ్గిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

కొత్త బ్రాండ్లతో ఇబ్బంది పడుతున్న మందుబాబులు

కొత్త బ్రాండ్లతో ఇబ్బంది పడుతున్న మందుబాబులు

ఇక చాలామంది ఇష్టంగా తీసుకునే బీర్ల బ్రాండ్ అస్సలు దొరకడం లేదని వైన్ షాపులో పనిచేసే సుందర్ బాబు అనే వ్యక్తి తెలిపాడు. పదిరోజులుగా ఇదే పరిస్థితి నెలకొందని చెప్పాడు. పదిరోజులకు ముందు కూడా బీర్లు సమృద్ధిగా దొరికేవని ఆయన చెప్పాడు. ప్రస్తుతం లభిస్తున్న బీర్లు చాలామంది కస్టమర్లు ఇష్టపడరని సుందర్ చెబుతున్నాడు. బీర్ల షార్టేజీ ఇందిరానగర్, కోరమంగళ ప్రాంతాల్లో ఎక్కువగా ఉందని మరో వ్యక్తి వెల్లడించాడు. రెగ్యులర్ బీర్ బ్రాండ్లు సప్లయ్ లేకపోవడంతో అత్యధిక ధరలు పలుకుతున్న ఫారిన్ బీర్‌ బ్రాండ్లను బలవంతంగా అమ్మాల్సి వస్తోందని చెప్పాడు.

English summary
Beer lovers in the city seem to be finding it difficult to lay their hands on their favourite brand of the bubbly. At many outlets, empty refrigerators greet customers as Bengaluru is witnessing short supply of beer.Various outlets located in the city have blamed the shortage on the state government’s push for the sale of Indian Made Liquor (IML). They allege that IML sale is being promoted as it generates more revenue than beer for the state exchequer as resources have dwindled due to the recent farm loan waiver.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X