బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హెల్మెట్ పెట్టుకోలేదని బైక్‌పై షూ విసిరిన కానిస్టేబుల్, సస్పెన్షన్

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు:కొంతమంది పోలీసులు చూపిస్తున్న అత్యుత్సాహం వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తోంది. హెల్మెట్ పెట్టుకోలేదనే కారణంగా బెంగుళూరుకు చెందిన కానిస్టేబుల్ ఒకరు వాహనదారుడిపై షూ విసిరాడు. అయితే ఈ ఘటనను ఓ వ్యక్తి రికార్డు చేసి యూ ట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌ గా మారింది.

బెంగుళూరు ట్రాఫిక్ కానిస్టేబుల్ వ్యవహరించిన తీరు ప్రస్తుతం విమర్శలకు తావిస్తోంది. కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు ట్రాఫిక్ కానిస్టేబుల్ వ్యవహరశైలిపై ప్రజలు మండిపడుతున్నారు. టూ వీలర్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు హెల్మెట్ పెట్టుకోలేదు.

 Bengaluru Cop Throws Shoe At Bikers For Not Wearing Helmets. Video Is Viral

అయితే ఈ విషయాన్ని గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ తన కాలికి ఉన్న షూను తీసుకొని టూ వీలర్ పై ప్రయాణం చేస్తున్న వారిపై విసిరాడు. ఆ బైక్ పై ప్రయాణిస్తున్న వారిలో ఒకరికి కానిస్టేబుల్ విసిరిన షూ తగిలింది.

అయితే ఈ తతంగాన్ని అదే రోడ్డులో టూ వీలర్ వెనుకే వస్తున్న రిషబ్ చటర్జీ అనే వ్యక్తి వీడియో తీశాడు. యూట్యూబ్ లో ఈ వీడియోను పోస్ట్ చేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 20 వ తేదిన ఈ ఘటన చోటు చేసుకొంది.

అయితే ఈ వీడియో వైరల్ గా మారింది. ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి అసలు విషయం వచ్చింది. దీంతో ద్విచక్ర వాహనదారుడిపై షూ విసిరిన కానిస్టేబుల్ ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకొన్నారు

బెంగళూరు ట్రాఫిక్‌ పోలీసులను తాము ప్రేమిస్తామని, కానీ ఇటు పోలీసులు, అటు బైకర్లు ఇలా చేయడం చాలా ప్రమాదకరమని ఈ పోస్టుకు ఓ యూజర్‌ కామెంట్‌ పెట్టాడు. బెంగళూరు ట్రాఫిక్‌ పోలీసుల ఎఫ్‌బీకి కూడా దీన్ని షేర్‌ చేయాలని కోరాడు. నెంబర్‌ ప్లేట్‌ను నమోదు చేసుకుని వారికి జరిమానా విధించవచ్చని ఆయన సూచించారు.

English summary
A Bengaluru traffic constable has been suspended after he was caught on camera throwing a shoe at two bikers for not wearing a helmet. The constable in question was captured on camera in a video uploaded by a Bengaluru-based YouTuber which went viral.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X