బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్టార్ హీరో ఇల్లు కూల్చివేతకు ఏడు రోజులు టైం

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కన్నడ చాలెంజింగ్ స్టార్ దర్శన్ తూగుదీప నివాసంలో నిర్మించిన అక్రమ కట్టడాన్ని స్వచ్ఛందంగా తొలగించడానికి బెంగళూరు జిల్లాధికారి ఒక్క వారం గడువు ఇచ్చారు. మీరు స్వచ్ఛందంగా తొలగించకుంటే తామే కూల్చేస్తామని బీబీఎంపీ అధికారులు చెప్పారు.

బెంగళూరు నగరంలోని రాజరాజేశ్వరి నగర్ లో దర్శన్ నివాసం ఉంది. దర్శన్ రాజకాలువ (డ్రైనేజ్) మీద ఇంటిని నిర్మించారని ఆరోపణలు వచ్చాయి. బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) గత రెండు నెలల నుంచి ఆపరేషన్ రాజకాలువ కొనసాగిస్తోంది.

Darshan

అప్పటి బీబీఎంపీ మేయర్ మంజునాథ రెడ్డి అధికారులతో కలిసి దర్శన్ ఇంటిని పరిశీలించారు. దర్శన్ ఇంటిని అక్రమంగా నిర్మించారని గుర్తించారు. కర్ణాటక మాజీ మంత్రి శ్యామనూరు శివశంకరప్పకు చెందిన ఎస్ఎస్ ఆసుపత్రి అక్రమంగా నిర్మించారని గుర్తించారు.

హీరో దర్శన్, మాజీ మంత్రి శివశంకరప్పకు చెందిన కట్టడాలను వారంలో స్వచ్ఛందంగా తొలగించడానికి అవకాశం ఇచ్చారు. బెంగళూరు నగరంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు.

English summary
The BBMP's Rajarajeshwarinagar Zone Joint Commissioner Veerabadrappa said he had sent a letter to the Revenue Department seeking superimposed maps of location of Kannada film actor Darshan’s house and former minister Shamanur Shivakumar's SS hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X