• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Drugs Case: చాలెంజ్ చేసి మేడమ్ సైలెంట్, ఇంట్లో ఏం చేస్తోందంటే ?, నార్త్ ఇండియన్ నాటు మసాలా !

|

బెంగళూరు/ ముంబాయి: బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసులో అరెస్టు అయ్యి సుమారు ఐదు నెలల పాటుజైలు జీవితం గడిపి బెయిల్ మీద బయటకు వచ్చిన స్యాండిల్ వుడ్ బ్యూటీక్వీన్, రాగిణి అలియాస్ రాగిణి ద్వివేది ప్రస్తుతం ఏం చేస్తోంది ? అంటూ సినీవర్గాలు ఆరా తీశాయి. తాను జైలుకు వెళ్లడానికి కారణం అయిన వారి బండారం బయటపెట్టడానికి ప్రెస్ మీట్ పెడుతానని, మొత్తం చేప్పేస్తానని జైలు నుంచి బయటకు వచ్చిన గంటలోనే రాగిణి నానా హంగామా చేస్తూ చాలెంజ్ లు చేసింది. అయితే జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత ఎవ్వరి కంటపడకుండా రాగిణి నార్త్ ఇండియా నాటు మసాలా వంటలు చేస్తోందని వెలుగు చూడటంతో స్యాండిల్ వుడ్ వర్గాలు, మేడమ్ అభిమానులు షాక్ అయ్యారు.

Illegal affair: సెక్సీ సైన్స్ టీచర్, లెక్కల మాస్టర్, స్కూల్ లో ఆ ప్రయోగాలు, మొగుడికి తెలిసి!Illegal affair: సెక్సీ సైన్స్ టీచర్, లెక్కల మాస్టర్, స్కూల్ లో ఆ ప్రయోగాలు, మొగుడికి తెలిసి!

 రాగిణి ఆర్ డి కిచెన్

రాగిణి ఆర్ డి కిచెన్

కరోనా వైరస్ మహమ్మారి తాండవం చేసిన సమయంలో భారతదేశంలో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ టైమ్ లో ఇంటికే పరిమితం అయిన హీరోయిన్ రాగిణి నార్త్ ఇండియా స్టైల్లో నాటు మసాలా వంటకాలు, రుచికరమైన వంటలు చేస్తూ ఆ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేసి ఆమె అభిమానులకు దగ్గర అయ్యి కొంతకాలం టచ్ లో ఉంది.

 వంటలు చేస్తుంటే షాక్

వంటలు చేస్తుంటే షాక్

బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసులో బహుబాష నటి, స్యాండిల్ వుడ్ హనీ బేబి రాగిణిని గత ఏడాది సెప్టెంబర్ 4వ తేదీన బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు నగర శివార్లలోని యలహంకలోని రాగిణి ఇంటిలో సోదాలు చేసిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమె మొబైల్ ఫోన్ లు సీజ్ చేశారు. రాగిణి బెడ్ రూమ్ లో పోలీసులు గంజాయితో నింపిన సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. నార్త్ ఇండియా వంటలు చేస్తున్న రాగిణికి ఆ రోజు దిమ్మతిరిగిపోయింది.

 రాగిణి పోరాటం

రాగిణి పోరాటం

తనకు ఏపాపం తెలీదని, ఈ డ్రగ్స్ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని, నాకు బెయిల్ ఇవ్వండి అంటూ రాగిణి కోర్టును ఆశ్రయించింది. అయితే రాగిణికి డ్రగ్స్ కేసుతో పక్కా సంబంధం ఉందని, బెయిల్ ఇవ్వకూడదని బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బెంగళూరు ప్రత్యేక కోర్టుకు మనవి చేశారు. రాగిణికి బెయిల్ ఇవ్వడానికి ప్రత్యేక కోర్టులు, కర్ణాటక హైకోర్టు నిరాకరించింది. అప్పటి నుంచి రాగిణ ద్వివేది బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకే పరిమితం అయ్యింది.

 షరతులతో మేడమ్ కు బెయిల్

షరతులతో మేడమ్ కు బెయిల్

బెంగళూరు సీసీబీ పోలీసుల విచారణ పూర్తి అయ్యిందని, రాగిణి అనారోగ్యంతో బాధపడుతోందని, కర్ణాటక హైకోర్టు తీర్పును రద్దు చెయ్యాలని, ఆమెకు బెయిల్ మంజూరు చెయ్యాలని, పోలీసుల విచారణకు రాగిణి పూర్తిగా సహకరిస్తుందని ఆమె న్యాయవాది సిద్దార్థ లూత్రా సుప్రీం కోర్టుకు మనవి చేశారు.సుప్రీం కోర్టులో అనేకసార్లు వాదనలు జరిగాయి. చివరికి నటి రాగిణికి సుప్రీం కోర్టులో షరతులతో బెయిల్ మంజూరు అయ్యింది.

 ఊపిరిపీల్చుకున్న రాగిణి

ఊపిరిపీల్చుకున్న రాగిణి

బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసులో అరెస్టు అయ్యి నాలుగు నెలలకు పైగా జైలు జీవితం గడిపిన స్యాండిల్ వుడ్ బ్యూటీక్వీన్ రాణిగి ద్వివేది గత సోమవారం రాత్రి ఎట్టకేలకు జైలు నుంచి బయటకు వచ్చారు. పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు సమీపంలోని జడే మునేశ్వరిస్వామి ఆలయంలో రాగిణి ద్వివేది ప్రత్యేక పూజలు చేసి స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన రాగిణి ద్వివేది చాలా ఎక్ట్ర్సాలు చేస్తోందని అంటున్నారు. ఎప్పటికైనా న్యాయం గెలుస్తోందని నా విషయంలో రుజువు అయ్యిందని రాగిణి భారీ డైలాగ్ వేసింది.

 చిందులు వేసి చాలెంజ్

చిందులు వేసి చాలెంజ్

నేను జైలుకు వెళ్లడానికి కారణం ఏమిటి ?, నాకు ఈ ఖర్మ పట్టడానికి కారణం ఏమిటి ? దాని వెనుక చాలా పెద్ద కథ ఉంది, ఆ కారణాలు మొత్తం తాను ప్రెస్ మీట్ పెట్టి మరీ చెబుతానని, అంత సామాన్యంగా ఎవ్వరినీ వదిలేది లేదని రాగిణి పరోక్షంగా ఆమె జైలుకు వెళ్లడానికి వార్నింగ్ ఇచ్చింది. జైలు నుంచి బయటకు వచ్చిన కొన్ని గంటల్లోనే రాగిణి చాలా ఎక్ట్ర్సాలు చేస్తోందని స్యాండిల్ వుడ్ వర్గాలు అన్నారు.

 సైలెంట్ గా మళ్లీ నార్త్ ఇండియా నాటు వంటలు

సైలెంట్ గా మళ్లీ నార్త్ ఇండియా నాటు వంటలు

తనను జైలు నుంచి బయటకు తీసుకురావడానికి సుప్రీం కోర్టు వరకు వెళ్లిన తల్లిదండ్రులతో రాగిణి కాలం గడుపుతోంది. జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే తండ్రిని పట్టుకుని బోరున విలపించిన రాగిణి ఇప్పుడు ఇంటికే పరిమితం అయ్యింది. ఆర్ డి కిచెన్ పేరుతో మళ్లీ వంటలు చేస్తూ తల్లిదండ్రులకు వడ్డిస్తూ కాలం గడుపుతున్న రాగిణి ఇంతకు ముందు చాలెంజ్ చేసినట్లు ప్రెస్ మీట్ లకు దూరంగా ఉంటోంది. తాను ఇంట్లోవంటలు చేస్తూ తల్లిదండ్రులతో సంతోషంగా గుడుతున్నానని రాగిణి సోషల్ మీడియాలో ఫోటోలు పోస్టు చేసింది.

English summary
Bengaluru Drugs Case: How is Ragini Dwivedi spending her time after she was released from jail in sandalwood Drug case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X