బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరు ఎంబస్సి టెక్ విలేజ్ కు బాంబు బెదిరింపు, 7 వేల మంది టెక్కీలు పరుగోపరుగు !

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఎంబస్సి టెక్ విలేజ్ కు బాంబు బెదిరింపు

బెంగళూరు: బెంగళూరు నగరంలోని ఔటర్ రింగ్ రోడ్డులో ఉన్న ప్రసిద్ది చెందిన ఎంబస్సి టెక్ విలేజ్ లో బాంబు పెట్టామని శుక్రవారం మద్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి బెదిరించాడు. ఎంబస్సి టెక్ విలేజ్ లో ఉద్యోగాలు చేస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, ఉద్యోగులు రోడ్డు మీదకు పరుగు తీశారు.

బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్డులో ప్రసిద్ది చెందిన ఎంబస్సి టెక్ విలేజ్ ఉంది. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయంగా ప్రసిద్ది చెందిన కంపెనీలు ఉన్నాయి. దాదాపు 7,000 మందికిపై సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఎంబస్సి టెక్ విలేజ్ లోని కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు.

Bengaluru embassy Tech village receives bomb threat

శుక్రవారం మద్యాహ్నం ఎంబస్సి టెక్ విలేజ్ సెక్యూరిటీ విభాగంకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. టెక్ పార్క్ లో బాంబు ఉందని, 10 నిమిషాల్లో అది పేలిపోతుందని, వెంటనే ఉద్యోగులను బయటకు పంపించాలని చెప్పి ఫోన్ కట్ చేశాడు.

అన్ని కంపెనీల ఉద్యోగులను వెంటనే బయటకు పంపించారు. ఒక్కసారిగా 7,000కి పైగా రోడ్ల మీదకు పరుగుతీశారు.విషయం తెలుసుకున్న బాంబు నిర్వీర్యదళం బృందాలు, పోలీసు జాగిలాలు, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరకుని పరిశీలిస్తున్నారు. బాంబు బెదిరింపు ఫోన్ వచ్చిన మాట నిజమే అని వైట్ ఫీల్డ్ విభాగం డీసీపీ అబ్దుల్ అహమ్మద్ మీడియాకు చెప్పారు. ఎంబస్సి టెక్ విలేజ్ లో బాంబు కోసం ఇంకా సోదాలు చేస్తున్నారు.

English summary
Bengaluru embassy Tech village receives bomb threat today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X