వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

14.5 కిలోమీటర్లు.. రూ.4300 బిల్... కారులో కాదు.... టెకీని ముప్పుతిప్పలు పెట్టిన.....

|
Google Oneindia TeluguNews

కొత్త మోటారు వాహన చట్టం.. వాహనదారుల గుండె గుబేల్ అనిపిస్తోంది. హెల్మెట్, రిజిస్ట్రేషన్ లేదని చెబుతూ వేలకు వేలు ముక్కుపిండి వసూల్ చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఇది ఇలా ఉంటే పుణులో ఓ డ్రైవర్ రెచ్చిపోయాడు. సిటీకొచ్చిన టెక్కీకి చుక్కలు చూపించాడు. దాదాపు 15 కిలోమీటర్లు తిప్పి.. బిల్లు మాత్రం వేలు వసూల్ చేశాడు. బిల్లు గురించి ఇద్దరి మధ్య వాగ్యుద్దమే జరిగింది. కానీ ఆ టెక్కీ చూపించిన మీటర్ మొత్తం కట్టక తప్పని పరిస్థితి నెలకొంది. తర్వాత తాపీగా తనను డ్రైవర్ మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కొలువు కోసం వస్తే ..

కొలువు కోసం వస్తే ..

అతను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఐటీ హబ్ బెంగళూరులో కొలువు. అయితే ఉద్యోగం మారాలని అనుకొన్నాడు. పుణేలో జాబ్ ఇంటర్వ్యూ కోసం వెళితే .. అతనికి ఛేదు అనుభవం ఎదురైంది. ఆటోవాలా దారుణంగా మోసం చేశాడు. 14.5 కిలోమీటర్లు తిప్పి.. అక్షరాలా రూ.4300 వసూల్ చేశాడు. అదేంటి అంటే కల్లబొల్లి కబుర్లు చెప్పి .. డబ్బులు మాత్రం ముక్కుపిండి మరీ వసూల్ చేశాడు. నగదు ఇచ్చే విషయంలో ఇద్దరి మధ్య గొడవ కూడా జరిగింది. కానీ టెక్కీ.. ఆటో డ్రైవర్‌తో వాదనలో నెగ్గలేక డబ్బులు ఇచ్చేశాడు.

దిగి దిగగానే ..

దిగి దిగగానే ..

ఇంటర్వ్యూ కోసం వచ్చిన అతను పుణె బస్టాండ్ వద్ద గల కట్రాజ్ వద్ద ఈ నెల 18న ఉదయం 5 గంటలకు దిగాడు. అక్కడి నుంచి ఎరవాడ వెళ్లాలి. కట్రాజ్ నుంచి ఎరవాడకు కరెక్టు 14.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వాస్తవానికి అక్కడికి వెళ్లేందుకు అతను క్యాబ్ బుక్ చేసుకుంటే సరిపోతుంది. కానీ క్యాబ్ ఎందుకులే అని అనుకొని .. ఆటో మాట్లాడుకున్నాడు. అదే అతను చేసిన తప్పయిపోయింది. ఆ ఆటోవాలా లోకంలో లేని బిల్ వేసి ముక్కుపిండి వసూల్ చేయడంతో టెక్కీ నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి నెలకొంది.

అనుకున్నది ఒక్కటి ..

అనుకున్నది ఒక్కటి ..

టెక్కీకి ఎరవాడ పోలీసుస్టేషన్ సమీపంలోనే కంపెనీ విడిది కూడా ఉంది. అందుకోసమే అక్కడే ఉండి .. తన పని పూర్తిచేసుకుందామని అనుకొన్నాడు. కానీ అక్కడికి వచ్చి ఆటో దిగితే కానీ తెలియరాలేదు. ఆటో దిగి ఎంత అని అడిగితే రూ.4300 అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్‌నకు గురయ్యాడు. అదేంటి అని అడిగితే మీటర్ అంతే చూపిస్తోందని చెప్పాడు. అలా కాదు .. నేనివ్వను అని తేల్చిచెప్పారు. రూ.600 అనేది సిటీలోకి వచ్చేందుకు, వెళ్లేందుకు అని కొత్త కబురు చెప్పాడు. మిగతా మొత్తం మాత్రం ఆటో మీటర్ అని క్లారిటీ ఇచ్చాడు. తాను ఇవ్వబోనని చెప్పినా .. వినిపించుకోకుండా అదిరించి, బెదిరించి ఆటోవాలాతో బిల్ కట్టించుకున్నాడు.

మోసానికి మారుపేరు ..

మోసానికి మారుపేరు ..

తర్వాత తనను ఆటోవాలా చీట్ చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తాను వచ్చింది ఆటోలోనని .. అందులో డ్రైవర్.. తాను మాత్రమే ఉన్నానని పేర్కొన్నారు. కానీ తనకు ఏసీ కారు కన్నా కూడా ఎక్కువ బిల్ వసూల్ చేశాడని వాపోయాడు. తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు. ఆ రోజు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆటో డ్రైవర్‌ను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు.

English summary
engineer was in Pune for a job and was dropped off a bus at Katraj at around 5 in the morning on Wednesday. When they reached, the auto driver demanded Rs 4,300 from him as it was the amount that the meter displayed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X