బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరు బీఇ విద్యార్థిని ఆత్మహత్య: కాలేజ్ హెచ్ఓడీతో సహ ఐదు మంది, అందుకే!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరులోని కుమారస్వామి లేఔట్ లో ఉన్న దయానంద సాగర్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థిని మేఘనా (18) ఆత్మహత్య కేసులో పోలీసులు ఎఫ్ఆర్ నమోదు చేశారు. దయానంద్ కాలేజ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ (హెచ్ఓడీ) రాజ్ కుమార్ తో సహ ఐదు మంది మీద కేసు నమోదు చేశారు.

మేఘనా తల్లి

మేఘనా తల్లి

మేఘనా తల్లి లతా ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజరాజేశ్వరీనగర పోలీసులు ఎఫ్ఐఆర్ తయారు చేశారు. ఎఫ్ఐఆర్ లో దయానంద సాగర్ కాలేజ్ హెచ్ఓడీ రాజ్ కుమార్, మేఘనాతో పాటు విద్యాభ్యాసం చేస్తున్న మరో నలుగురు విద్యార్థుల మీద కేసు నమోదు చేశారు.

కాలేజ్ లో టార్చర్

కాలేజ్ లో టార్చర్

మంగళవారం ఉదయం కాలేజ్ కు వెళ్లిన మేఘనాను సాటి విద్యార్థులు ర్యాగింగ్ చేశారు. ఆ సమయంలో మేఘనాను బూతులు తిట్టారని, దాడి చెయ్యడానికి ప్రయత్నించారని, వేధించారని రికార్డు అయిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి.

కాలేజ్ నుంచి వచ్చి !

కాలేజ్ నుంచి వచ్చి !

కాలేజ్ నుంచి నేరుగా తను నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ కు చేరుకున్న మేఘనా ఇంటిలో ఎవరూ లేని విషయం గుర్తించి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాలేజ్ లో ర్యాగింగ్ చేశారని మేఘనా ఆత్మహత్య చేసుకున్నారని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులు కేసు నమోదు చేశారు.

హెచ్ఓడీ, విద్యార్థులు

హెచ్ఓడీ, విద్యార్థులు

కాలేజ్ హెచ్ఓడి రాజ్ కుమార్, మేఘనా సాటి విద్యార్థులు రెచ్చగొట్టడం వలనే ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు కేసు నమోదు చేశారు. ర్యాగింగ్ చేసే సమయంలో వీడియోలు తీసిన విద్యార్థులు ఎవరూ అని రాజరాజేశ్వరినగర పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇంటి దగ్గరకు వెళ్లి !

ఇంటి దగ్గరకు వెళ్లి !

క్లాస్ రెప్రసెంటిటీవ్ ఎన్నికల్లో మేఘనా పోటీ చేసి ఓడిపోయింది. తరువాత మేఘనా మీద పోటీ చేసి గెలిచిన వారు ఆమెను వేధించారని, ఇద్దరు విద్యార్థులు నేరుగా ఇంటి దగ్గరకు వచ్చి నీ అంతు చూస్తాం అని బెదిరించారని మేఘనా తల్లిదండ్రులు లతా, చంద్రశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

English summary
A civil engineering student committed suicide at her residence in Rajarajeshwari Naga in the city on Tuesday, police said. According to preliminary investigation, Meghana confined herself inside her room after returning from college.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X