బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెస్ లోకి బెంగళూరు మాజీ మేయర్, తెలుగోడి దెబ్బ, ఆంధ్రా సెంటిమెంట్, బీజేపీకి !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరులో బీజేపీకి భారీ దెబ్బపడుతోంది. బెంగళూరు మాజీ మేయర్, బీజేపీ సీనియర్ నాయకుడు డి. వెంకటేశ్ మూర్తి ఆపార్టీకి గుడ్ బై చెప్పి త్వరలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్దం అయ్యారు. ఢిల్లీలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో చర్చలు జరిపిన తరువాత డి. వెంకటేశ్ మూర్తి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. బెంగళూరు మాజీ మేయర్ తెలుగువాడు కావడంతో బెంగళూరులో ఆంధ్రులు బీజేపీకి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్దం అవుతున్నారు.

 బీజేపీ నుంచి సస్పెండ్

బీజేపీ నుంచి సస్పెండ్

సంగోలి రాయణ్ణ బ్రిగేడ్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న డి. వెంకటేశ్ మూర్తిని బీజేపీ పార్టీ నుంచి ఆరు సంవత్సరాలు సస్పెండ్ చేసింది. అయితే కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రులు కేఎస్. ఈశ్వరప్ప, ఆర్. అశోక్ తదితరుల ఒత్తిడి మేరకు డి. వెంకటేశ్ మూర్తి మీద సస్పెన్షన్ వేటును ఉపసంహరించుకున్నారు.

మాజీ డీసీఎంకు రైట్ హ్యాండ్

మాజీ డీసీఎంకు రైట్ హ్యాండ్

కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి, బెంగళూరులోని పద్మనాభనగర శాసన నభ్యుడు ఆర్. అశోక్ (బీజేపీ)కి అత్యంత సన్నిహితుడుగా డి. వెంకటేశ్ మూర్తి గుర్తింపుతెచ్చుకున్నారు. ఆర్. అశోక్ ఎమ్మెల్యేగా విజయం సాధించడంలో వెంకటేశ్ మూర్తి కీలకపాత్రపోషించారు.

 ఎన్.ఏ హ్యారీస్ తో ఢీ

ఎన్.ఏ హ్యారీస్ తో ఢీ

2013 శాసన సభ ఎన్నికల్లో బెంగళూరులోని శాంతినగర నియోజక వర్గం నుంచి వెంకటేశ్ మూర్తి ఎన్ఏ. హ్యారీస్ మీద పోటీచేసి ఓడిపోయారు. తరువాత బీజేపీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న వెంకటేశ్ మూర్తి ఒక్కసారిగా సంగోలి రాయణ్ణ బ్రిగేడ్ కార్యక్రమాలలో పాల్గొని బీఎస్. యడ్యూరప్ప అగ్రహానికి గురైనాడు.

పక్కా తెలుగోడు

పక్కా తెలుగోడు

డి. వెంటకేశ్ మూర్తి తండ్రి తమిళనాడులోని హోసూరు సమీపంలో ప్రభుత్వ తెలుగు పాఠశాల ఉపాధ్యాయుడిగా పని చేశారు. 10వ తరగతి వరకూ వెంకటేశ్ మూర్తి హోసూరు సమీపంలోని తెలుగు ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభ్యాసం చేశాడు. తరువాత ఉన్నత చదవులు బెంగళూరులో కొనసాగించిన వెంకటేశ్ మూర్తి పక్కా తెలుగువాడు.

 తెలుగు సెంటిమెంట్

తెలుగు సెంటిమెంట్

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఢిల్లీలో పోరాటం చేస్తున్న సమయంలో బెంగళూరులోని సీనియర్ బీజేపీ నాయకుడు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడు. 2018 శాసన సభ ఎన్నికల్లో డి. వెంకటేశ్ మూర్తి పోటీ చెయ్యనున్నారు. అయితే వెంకటేశ్ మూర్తి పధ్మనాభ నగర నియోజక వర్గం నుంచి ఆర్. అశోక్ మీద పోటీ చేస్తారా ? లేక వేరే నియోజక వర్గం నుంచి పోటీ చేస్తారా అనే విషయం ఇంకా ప్రకటించలేదు.

English summary
The Bruhat Bengaluru Mahanagara Palike (BBMP) former Mayor and BJP leader D.Venkatesha Murthy all set to quit BJP. D.Venkatesha Murthy will join Congress and contest for 2018 assembly elections from Padmanabhanagar assembly constituency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X