బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘ఇంట్లో దుస్తులు లేవా? ఇలాంటి డ్రెస్‌లో బయట తిరుగుతారా?’(వీడియో)

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ యువతిని ఓ వ్యక్తి తీవ్రంగా దూషించాడు. ఆమె వేసుకున్న డ్రెస్‌ను గురించి మాట్లాడుతూ.. సరైన డ్రెస్ వేసుకోలేవా? అంటూ ప్రశ్నించాడు. ఇలాంటి డ్రెస్‌లు బహిరంగ ప్రదేశాల్లో ఎలా తిరుగుతున్నావ్ అంటూ నిలదీశాడు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది.

మహిళా ఐఏఎస్‌లకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్‌ వేధింపులు.. ఉన్నతాధికారులే టార్గెట్‌గా అశ్లీల పోస్టులతోమహిళా ఐఏఎస్‌లకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్‌ వేధింపులు.. ఉన్నతాధికారులే టార్గెట్‌గా అశ్లీల పోస్టులతో

బెంగళూరు హెచ్ఎస్ఆర్ లేఅవుట్ సమీపంలో గురువారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మెజార్టీ నెటిజన్లు ఆమెకు మద్దతు పలుకుతుండగా.. మరికొందరు అతనికి సపోర్ట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు.

బాయ్‌ఫ్రెండ్‌తో షాపింగ్‌కి వెళితే..

బాయ్‌ఫ్రెండ్‌తో షాపింగ్‌కి వెళితే..

ముంబైకి చెందిన 28ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్‌లో నివాసం ఉంటోంది. గురువారం సాయంత్రం ఆమె అదే లేఅవు‌ట్‌లో ఉంటున్న తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి షాపింగ్‌కి వెళ్లారు. వారిద్దరూ తిరిగి వస్తుండగా.. పక్కనే వేరే బైక్‌పై వెళ్తున్న గుర్తుతెలియని వ్యక్తి ఆమెను దూషిస్తున్నట్లు గమనించారు.

ఇంట్లో డ్రెస్‌లో లేవా అంటూ...

ఇంట్లో డ్రెస్‌లో లేవా అంటూ...

‘నీకు ఇంటి దగ్గర దుస్తులు లేవా.. ఇలాంటి డ్రెస్ ధరించావు' అంటూ ఆ యువతిని ప్రశ్నించాడు. దీంతో ఆ యువతి బాయ్ ఫ్రెండ్ బైక్‌ను నిలిపివేసి.. అతడ్ని అడ్డగించాడు. ఆ తర్వాత అతని మాటలను వీడియో తీశాడు. ఈ విషయం గమనించిన సదరు వ్యక్తి కొంత తగ్గిపోయాడు. అతను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.

ఇలాంటి దుస్తులా?

ఇలాంటి దుస్తులా?

ఈ ఘటనపై బాధిత యువతి మాట్లాడుతూ.. తాము షాపింగ్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా సదరు వ్యక్తి తనను దూషించడం విన్నామని, ఆ తర్వాత బైక్ ఆపి అతడ్ని ప్రశ్నించామని చెప్పింది. ఇంట్లో సరైన దుస్తులు లేవా? అని తనను ప్రశ్నించాడని తెలిపింది. నేను ఎలాంటి దుస్తులు వేసుకుంటే నీకేంటని తాను ప్రశ్నించినట్లు చెప్పింది. అయితే భారత మహిళలు ఇలాంటి దుస్తులు ధరించరు అని అతడు వ్యాఖ్యానించాడని తెలిపింది.

టీ షర్ట్, షార్ట్‌తో యువతి..

టీ షర్ట్, షార్ట్‌తో యువతి..

తాను ఆ సమయంలో టీ షర్ట్, షార్ట్ ధరించి ఉన్నానని తెలిపింది. తాను వేసుకున్న డ్రెస్ పై అతనికి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించింది. తన బాయ్‌ఫ్రెండ్ కూడా అతడ్ని నిలదీశాడని చెప్పింది. అతడు దూషిస్తుండగా తాము వీడియో తీయడంతో అతడు కొంత తగ్గాడని యువతి చెప్పింది. అయితే, ఇలాంటి పొట్టి దుస్తులు ధరించవద్దని సూచించడం మాత్రం ఆపలేదని తెలిపింది. ఎలాంటి దుస్తులు ధరిస్తే నీకెంటని తన బాయ్‌ఫ్రెండ్ అతడ్ని అడిగాడని తెలిపింది.

పోలీసులకు ఫిర్యాదు చేసినా..

కేవలం అతడు మమ్మల్ని భయపెట్టడానికే ఇలా చేసివుంటాడని భావించి తాను పోలీసులకు ఫిర్యాదు చేయలేదని చెప్పింది ఆ యువతి. పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. వేరే దుస్తులు ధరించవచ్చు కదా? అని తనకే సలహా ఇస్తారే కానీ.. అతనిపై చర్యలు తీసుకునే అవకాశం లేదని భావించినట్లు ఆమె తెలిపింది. అందుకే ఫిర్యాదు చేయలేదని వెల్లడించింది.

English summary
An instance of moral policing reported from Bengaluru’s HSR layout has caught many eyes on social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X