బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Annual Traffic Index: ట్రాఫిక్‌తో నరకయాతనే.. ప్రపంచంలోనే బెంగళూరు టాప్‌, మరో 3 నగరాలు కూడా

|
Google Oneindia TeluguNews

ట్రాఫిక్.. ట్రాఫిక్.. ట్రాఫిక్... మెట్రో నగరాల్లో ఉదయం, సాయంత్రం వెళ్లాలంటే వెన్నులో వణుకు. గంటల తరబడి జర్నీ చేయాల్సిందే. ప్రపంచంలో ఎక్కువ ఏ నగరంలో రద్దీ ఉందనే అంశంపై 'టామ్ టామ్' అనే వాహనాల నావిగేషన్ సంస్థ సర్వే చేసి. వార్షిక రద్దీ సూచికను విడుదల చేసింది. అయితే అందులో మనదేశానికి చెందిన నాలుగు నగరాలు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ట్రాఫిక్ కలిగిన నగరంగా బెంగళూరు నిలవడం ఆందోళన కలిగిస్తోంది.

57 దేశాలు..

57 దేశాలు..


ఆరు ఖండాలు, 57 దేశాల్లోని 416 నగరాల్లో ‘టామ్ టామ్' వివరాలు సేకరించింది. ఆన్యువల్ ట్రాఫిక్ ఇండెక్స్‌ను కంపెనీ ప్రకటించడం ఇది తొమ్మిదోసారి. రియల్ టైమ్, హిస్టరికల్ డేటా ఆధారంగా పట్టణ ప్రాంతాలకు ర్యాంకులు కేటాయించింది. అమెరికా, చైనాలో వాహనాల కొనుగోలు పెరుగుతోంది. కానీ ఇండియాలో ఆ స్థాయిలో వాహనాల కొనుగోలు జరగకున్నా..ట్రాఫిక్ స్తంభిస్తోంది. ఇందులో బెంగళూరు టాప్‌లో నిలవగా మరో మూడు నగరాలు కూడా చోటు దక్కించుకున్నాయి.

నెంబర్ వన్ బెంగళూరు

నెంబర్ వన్ బెంగళూరు

ఐటీ హబ్‌గా విరాజిల్లుతోన్న బెంగళూరులో ప్రపంచంలో అత్యధిక ట్రాఫిక్ కలిగిన సిటీ. బెంగళూరుకు ‘టామ్ టామ్' 71 శాతం రద్దీ ఉందని రిపోర్ట్ చేసింది. 2019 ఆగస్ట్ 20వ తేదీని బెంగళూరు ప్రజలు మరచిపోరని చెప్పింది. ఆ రోజు 103 శాతం రికార్డవడంతో ఇళ్లకు/ఆఫీసులకు వెళ్లేందుకు జనాలు గంటలపాటు రోడ్లపైనే ఉన్నారని తెిలపింది. 2019 ఏప్రిల్ 6వ తేదీన మాత్రం 30 శాతం నమోదై కాస్త ఉపశమనం కలిగించింది. ప్రతీ శుక్రవారం రాత్రి 8 గంటల తర్వాత ప్రయాణిస్తే ఏడాదికి 5 గంటలు సేవ్ చేసినవారు అవుతారని తెలిపింది.

సెకండ్ ప్లేస్: మనీలా

సెకండ్ ప్లేస్: మనీలా

బెంగళూరు తర్వాత ఫిలిప్పీన్స్‌కు చెందిన మనీలాలో కూడా 71 శాతం, కొలంబియాకు చెందిన బొగొటాలో 68 శాతంతో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. భారతదేశానికి చెందిన ముంబై, పుణే.. నాలుగు, ఐదో స్థానాల్లో 65, 59 స్థానాలతో ఉన్నాయి. రష్యాలోని మాస్కో 59 శాతంతో ఆరో స్థానంలో, పెరూలోని లిమా 57 శాతంతో ఏడో స్థానంలో, 56 శాతంతో ట్రాఫిక్ రద్దీతో ఢిల్లీ 8వ స్థానంలో ఉంది. టర్కీకి చెందిన ఇస్తాంబుల్ 55 శాతం, ఇండినేషియాకు చెందిన జకార్తా 10వ స్థానంలో నిలిచాయి.

అష్ట దిగ్భందనం..

అష్ట దిగ్భందనం..


2019 సెప్టెంబర్ 9వ తేదీన ముంబైలో 65 శాతం ట్రాఫిక్ రద్దీ ఉంది. ఈ రోజును ముంబైకర్లు మరచిపోలేరు. 2019 ఆగస్ట్ 2 వ తేదీని పుణే వాసులు కూడా గుర్తుంటుంది. ఆ రోజు పుణెలో 59 శాతం ట్రాఫిక్ రద్దీ నెలకొంది. రద్దీ కారణంగా ప్రజలు 193 గంటలను కోల్పోయారు. సర్వేలో కొత్త అంశం కూడా వెలుగులోకి వచ్చింది. ఇదివరకు చేసిన సర్వే సమయం కన్నా ఢిల్లీలో రహదారులు మాత్రం మెరుగుపడ్డాయి. మిగతా నగరాల్లో మాత్రం ఎప్పటిలానే ఉన్నాయని సర్వే సంస్థ పేర్కొన్నది.

English summary
As per the data from TomTom, India is the worst-hit country suffering from traffic congestion. 4 out of 10 most congested cities are in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X