బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరులో 39 H1N1 కేసులు, ప్రజలు జాగ్రత్త, దృవీకరించిన వైద్య శాఖ, మహమ్మారి వ్యాది!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: మహమ్మారి వ్యాది H1N1 బెంగళూరు నగరంలో వ్యాపించిందని స్పష్టంగా వెలుగు చూడటంతో ప్రజలు, వైద్య శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే H1N1 39 కేసులు గుర్తించామని వైద్య శాఖ అధికారులు తెలిపారు. ఈ వ్యాదివ్యాపించకుండా ప్రజలు జాగ్రత్తగా శుభ్రత పాటించాలని ఆరోగ్య శాఖ అధికారులు మనవి చేశారు.

H1N1 వ్యాది వచ్చిన నెలరోజుల తరువాత అది బయటపడుతుంది. ఈ వ్యాది గుట్టుచప్పుడు కాకుండా వ్యాపిస్తుందని అధికారులు అంటున్నారు. ఈ వ్యాది ఎలా వ్యాపిస్తుంది, ఆ రోగం రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ వైద్యశాఖ అధికారులు ప్రజలకు వివరించడానికి ప్రత్యేక వైద్యశిభిరాలు నిర్వహిస్తున్నారు.

2018లో బెంగళూరు నగరంలో H1N1 వ్యాది 64 మందికి వ్యాపించడంతో నలుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. బెంగళూరు నగరంలో 6 డెంగ్యూ కేసులు, 7 చికెన్ గూన్యా కేసులు నమోదు అయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ సీనియర్ అధికారి డాక్టర్ పీకే. సునందా స్పష్టం చేశారు.

Bengaluru health department officials cautioned the public about H1N1 or swine flu cases in the city.

H1N1 వ్యాది ఎక్కువగా వలస వ్యక్తులకు వ్యాపిస్తుందని వైద్య శాఖ అధికారులు అంటున్నారు. బెంగళూరు నగరంలోని 12 జిల్లా వైద్య కళాశాలతో పాటు ప్రైవేటు వైద్య కళాశాలకు చెందిన 1.658 మంది వైద్యులకు H1N1 వ్యాది, చికెన్ గూన్యా, డెంగ్యూ వ్యాదులను ఎలా అరికట్టాలి అని ప్రత్యేక వైద్య శిభిరాలు ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తామని అధికారులు అంటున్నారు.

ప్రజలు ఎక్కువగా స్వచ్చతను కాపాడుకుని పౌష్టిక ఆహారం తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకుని ఈ వ్యాదులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు మనవి చేశారు. బెంగళూరు నగరంలో H1N1 వ్యాది వ్యాపించకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్చ చేయించుకోవాలని ప్రజలకు అధికారులు మనవి చేశారు.

పేదలు, బీపీఎల్ రేషన్ కార్డులు ఉన్న వారికి ప్రత్యేక ఆరోగ్య శిభిరాలు ఏర్పాటు చేశామని, మార్చి 3,5,7వ తేదీల్లో ఆరోగ్య మేళా కార్యక్రమాలు ఏర్పాటు చేశామని ఆరోగ్య శాఖ అదికారులు తెలిపారు, H1N1, చికెన్ గూన్యా, డెంగ్యూ వ్యాద్యులకు ప్రజలు ఆందోళన చెందరాదని, ముఖ్యంగా శుభ్రత పాటించాలని ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలకు మనవి చేశారు.

English summary
Health department officials on Thursday cautioned the public about H1N1 or swine flu cases in the city. According to the data released by the District Health Family Welfare office, 39 cases of swine flu were confirmed in the city as of Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X