బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రెండోసారి కరోనా బారిన పడిన మొదటి మహిళ: బెంగళూరు ఆస్పత్రి వర్గాలు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనా బారినపడిన వారికి మరోసారి వచ్చే అవకాశాలు తక్కువ అని కొందరు నిపుణులు చెబుతుంటే.. మరికొందరు మాత్రం రెండోసారి కూడా కరోనా బారిన పడే అవకాశాలున్నాయంటున్నారు. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ 27ఏళ్ల మహిళ కరోనా నుంచి కోలుకున్న తర్వాత మరికొద్ది రోజులకు మరోసారి ఆ మహమ్మారి బారినపడిన ఘటన వెలుగుచూసింది.

Recommended Video

#Lockdown : దేశంలో పెరుగుతున్న Corona కేసులు.. ఒక్కరోజే 30వేలు, మళ్లీ Lockdown దిశగా రాష్ట్రాలు..!

ఇప్పటికే హాంకాంగ్, నెదర్లాండ్స్, బెల్జియంలోలలో ఇలాంటి కేసులు వెలుగుచూడగా.. భారతదేశంలో తొలిసారి ఇలాంటి కేసు నమోదైంది. బెంగళూరులోని ఫోర్టిస్ ఆస్పత్రి వైద్యుడు ప్రతీక్ పాటిల్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. కరోనా లక్షణాలతో 27ఏళ్ల మహిళ జులై మొదటివారంలో ఆస్పత్రిలో చేరారు. ఆమెకు పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు తేలింది.

 Bengaluru Hospital Reports First Case Of Covid Reinfection In City

చికిత్స చేసిన అనంతరం మళ్లీ పరీక్షలు నిర్వహిస్తే నెగిటివ్ అని రిపోర్టు వచ్చింది. దీంతో జులై 24న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. నెల రోజుల తర్వాత ఆగస్టు చివరలో మళ్లీ అదే లక్షణాలతో ఆస్పత్రి వస్తే.. పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్ అని నిర్ధారణ అయ్యిందని వైద్యుడు తెలిపారు.

బెంగళూరులో రెండోసారి కరోనా సోకిన మొదటి వ్యక్తి ఈమే కావొచ్చని చెప్పారు. తాజా కేసులో రెండోసారి మహిళకు యాంటీబాడీలు పరీక్షలో నెగిటివ్ తేలిందని వెల్లడించారు. దీనిని బట్టి వైరస్ సంక్రమించిన తర్వాత ఆమెకు వ్యాధి నిరోధక శక్తి పెరగకపోవడమైనా ఉండాలి లేదా అభివృద్ధి చెందిన యాంటీబాడీస్ నశించిపోయి ఉండాలని వారు అభిప్రాయపడ్డారు. అయితే, కరోనా సోకినవారందరికీ రెండో సారి కూడా వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు.

కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,98,551 కరోనా కేసులు నమోదు కాగా, 99,266 యాక్టివ్ కేసులున్నాయి. 2,92,873 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా బారిన పడి 6,393 మంది మరణించారు

English summary
A 27-yr-old female found to be the 1st confirmed case of #COVID19 reinfection in Bengaluru. She tested positive in July & was discharged after testing negative.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X