చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రపంచ టాప్ 20 డైనమిక్ నగరాల్లో భారత్ నుంచి 6: బెంగళూరు ఫస్ట్, హైదరాబాద్ సెకండ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రపంచ టాప్ 20 డైనమిక్ నగరాల్లో హైదరాబాద్‌కు చోటు దక్కింది. భారత్ నుంచి ఆరు నగరాలు ఉన్నాయి. ఇందులో వరుసగా, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, పుణే, చెన్నై నగరాలు ఉన్నాయి. ప్రపంచంలో వేగవంతంగా విస్తరిస్తున్న నగరాల్లో ఇవి ఉన్నాయి.

భారత ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన ముంబై టాప్ 20 నగరాల్లో స్థానం దక్కించుకోలేదు. అది 20వ స్థానంలో ఉంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశంలో జేఎల్ఎల్ సిటీ మెమోంటమ్ ఇండెక్స్(సీఎంఐ) నివేదికను విడుదల చేశారు. 2019 ఏడాదికి గాను దీనిని విడుదల చేశారు.

131 నగరాల నుంచి షార్ట్ లిస్ట్

131 నగరాల నుంచి షార్ట్ లిస్ట్

ప్రపంచవ్యాప్తంగా 131 ప్రధాన వాణిజ్య నగరాల్లో జరుగుతోన్న అభివృద్ధి తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ర్యాంకులను ప్రకటించారు. ఇందులో హైదరాబాద్ రెండోస్థానంలో ఉంది. హైదరాబాదులో సామాజిక, ఆర్థిక పరిస్థితులు, వాణిజ్యం, నిర్మాణ రంగంలో పురోగతి, తక్కువ సమయంలో గణనీయ ఎదుగుదలకు గల కారణాలను పరిశీలనలోకి తీసుకున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ టాప్ 20లో నిలిచింది.

మొదటి స్థానంలో బెంగళూరు

మొదటి స్థానంలో బెంగళూరు

డైనమిక్ సిటీగా ఈసారి బెంగళూరు మొదటిస్థానంలో నిలిచింది. 2015లో సీఎంఐ ప్రకటించిన టాప్ 20 నగరాల్లో హైదరాబాదుకు చోటు దక్కలేదు. ఆ తర్వాత మాత్రం వరుసగా మూడుసార్లు జాబితాలో చోటు దక్కించుకుంది. 2017లో అయిదో స్థానం, 2018లో మొదటి ర్యాంక్ సాధించగా, 2019లో రెండో స్థానంలో నిలిచింది.

ఆసియా పసిఫిక్ బయటి నుంచి నైరోబీ

ఆసియా పసిఫిక్ బయటి నుంచి నైరోబీ

ప్రపంచవ్యాప్తంగా చూస్తే భారత్, చైనా దేశాల నుంచి ఎక్కువ నగరాలు ఉన్నాయి. టాప్ 20 నగరాల్లో ఆసియా పసిఫిక్ దేశాలే 19 ఉండటం గమనార్హం. ఆసియా పసిఫిక్ కాకుండా బయటి నుంచి ఒకటే ఉంది. అది కూడా నైరోబీ. నైరైబీలో ఆసియన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ. బెంగళూరు మొదటి స్థానంలో, హైదరాబాద్ రెండో స్థానంలో, ఢిల్లీ నాలుగో స్థానంలో, పుణే అయిదో స్థానంలో, చెన్నై ఏడో స్థానంలో, కోల్‌కతా 15వ స్థానంలో నిలిచాయి.

English summary
Six Indian cities including Pune and Chennai, are among those currently undergoing the most rapid expansion in the world. Although momentum in the global economy appears to have peaked, there are still many cities in the world where real estate and economic growth continue to be robust.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X