బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఐఎంఏ స్కాం, బెంగళూరు ఐపీఎస్ కు 25 కేజీల బంగారం, రూ. 13 కోట్లు లంచం, సీబీఐ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు తూర్పు విభాగం అసిస్టెంట్ పోలీసు కమిషనర్ గా పని చేసిన ఐపీఎస్ అధికారి అజయ్ లహోరి ఏకంగా 25 కేజీల బంగారం, రూ. 13 కోట్ల రూపాయల లంచం తీసుకున్నారని దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఐఎంఏ స్కాం ప్రధాన నిందితుడు, ఆ సంస్థ వ్యవస్థాపకుడు మన్సూర్ ఆలీ ఖాన్ విచారణలో అంగీకరించాడని అధికారులు చెప్పారు, ఐఎంఏ స్కాం నుంచి తాను తప్పించుకోవడానికి చాల మంది అధికారులకు లంచం ఇచ్చానని సీబీఐ, ప్రత్యేక విచారణ సంస్థ (ఏసీబీ)విచారణలో మన్సూర్ ఖాన్ అంగీకరించాడని అధికారులు తెలిపారు.

అల్లుడి రాసలీలలు: అత్తపై మోజుతో కూతురుతో పెళ్లి , వీడియో వైరల్!అల్లుడి రాసలీలలు: అత్తపై మోజుతో కూతురుతో పెళ్లి , వీడియో వైరల్!

వేరే అధికారులు

వేరే అధికారులు

ఐపీఎస్ అధికారి అజయ్ లహోరికి మొత్తం 25 కేజీల బంగారంతో పాటు నెలకు రూ. 1 కోటి చెప్పున మొత్తం రూ. 13 కోట్లు లంచం ఇచ్చానని మన్సూర్ ఖాన్ చెప్పాడు. తాను చాల మంది వేరేవేరే అధికారులకు లంచం ఇవ్వాలని, ఈ మొత్తంలో మీరు తనకు డబ్బులు ఇవ్వాలని ఐపీఎస్ అధికారి అజయ్ లహోరి చెప్పాడని మన్సూర్ ఆలీ ఖాన్ అంగీకరించాడని అధికారులు అన్నారు. నిందితుడు మన్సూర్ ఆలీ ఖాన్ ను విచారణ చేసే సమయంలో అధికారులు వీడియో రికార్డింగ్ చేశారు.

 నాకేం తెలీదు

నాకేం తెలీదు

ఐఎంఏ స్కాం ప్రధాన నిందితుడు మన్సూర్ ఆలీ ఖాన్ తన మీద చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఐపీఎస్ అధికారి అజయ్ లహోరి అంటున్నారు. మన్సూర్ ఆలీ ఖాన్ తనను చాలసార్లు కేసు విషయంలో కలిశాడని, అయితే అతని దగ్గర బంగారం కాని, డబ్బులు కానీ తాను లంచంగా తీసుకోలేదని ఐపీఎస్ అధికారి అజయ్ లహోరి చెప్పారు. ఐఎంఏ కేసు చార్జ్ షీట్ లో చాల మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు లంచం తీసుకున్నారని నమోదు అయ్యిందని తెలిసింది.

నెలకు రూ. 1 కోటి లంచం

నెలకు రూ. 1 కోటి లంచం

ఐఎంఏ స్కాం ప్రధాన నిందితుడు మన్సూర్ ఆలీ ఖాన్ ఐపీఎస్ అధికారి అజయ్ లహోరికి ఎప్పుడు లంచం ఇచ్చాడు అనే విషయం మాత్రం కచ్చితంగా తెలియడం లేదు అని అధికారులు అంటున్నారు. అయితే 25 కేజీల బంగారం, రూ. 13 కోట్లు లంచం ఇచ్చాడని మాత్రం అధికారులు చెబుతున్నారు. ఒక్క నెలకు ఒక్క అధికారికి రూ. 1 కోటి చెప్పున మన్సూర్ ఆలీ ఖాన్ లంచం ఇచ్చాడని వెలుగు చూడటంతో అధికారులు షాక్ కు గురైనారు.

25 కేజీల బంగారం రూ. 94. 77 కోట్లు

25 కేజీల బంగారం రూ. 94. 77 కోట్లు

ఐఎంఏ స్కాం ప్రధాన నిందితుడు తాను 25 కేజీల బంగారం ఐపీఎస్ అధికారి అజయ్ లహోరికి ఇచ్చాను అంటున్నాడు. ప్రస్తుత మార్కెట్ లో 25 కేజీల బంగారం రూ. 94.77 కోట్లు. దానికితోడు నెలకు రూ. 1 కోటి చెప్పున రూ. 13 కోట్లు ఇచ్చాని అంటున్నాడు. కేవలం ఒక్క ఐపీఎస్ అధికారి అజయ్ లహోరికి మాత్రమే లంచం కింద రూ. 108 కోట్లు ఇచ్చానని మన్సూర్ ఆలీ ఖాన్ బాంబు పేల్చాడు.

 ఐపీఎస్, ఐఏఎస్ లు అరెస్టు

ఐపీఎస్, ఐఏఎస్ లు అరెస్టు

ఐఎంఏ స్కాం కేసు విచారణ చేస్తున్న అధికారులు ఇప్పటికే భారీ మొత్తంలో లంచం తీసుకున్నవారి మీద నిఘా వేశారు. ఐఏఎస్ అధికారి బీఎం. విజయ్ శంకర్ రూ. 1 కోటి, ఉప విభాగం అధికారి ఎల్.సీ నాగరాజ్ రూ. 4 కోట్లు లంచం తీసుకున్నారని ఆరోపిస్తూ మన్సూర్ ఆలీ ఖాన్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. అధికారులు విజయ్ శంకర్, ఎల్.సీ. నాగరాజ్ ను అరెస్టు చెయ్యడంతో వారు బెయిల్ మీద బయటకు వచ్చారు.

 మాజీ మంత్రుల విచారణ

మాజీ మంత్రుల విచారణ

మరో సీనియర్ ఐపీఎస్ అధికారి హేమంత్ నింబాళ్కర్ ను ఇదే కేసులో విచారణ చేశారు. బీడీఏకి చెందిన ఓ సీనియర్ అధికారిని విచారణ చేసి వివరాలు సేకరించారు. కర్ణాటక మాజీ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రోషన్ బేగ్ (రెబల్ ఎమ్మెల్యే), జమీర్ అహమ్మద్ ను అధికారులు విచారణ చేసి వివరాలు సేకరించారు. ఐఎంఏ స్కాం కేసులో చాల మంది అధికారుల మీద అనుమానంతో నిఘా వేసి విచారణ చేస్తున్నారు.

సీబీఐ విచారణ

సీబీఐ విచారణ

ఐఎంఏ స్కాంలో చాల మంది ప్రముఖుల హస్తం ఉందని, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు, ప్రముఖ రాజకీయ పార్టీల నాయకులకు ఈకేసుతో సంబంధం ఉందని ఆరోపణలు ఉన్నాయి. అన్ని సరైన పత్రాలు బయటకు వచ్చిన తరువాత వారిని అరెస్టు చేసే అవకాశం ఉందని తెలిసింది. ఐఎంఏ స్కాం కేసును ప్రస్తుతం సీబీఐ విచారణ చేస్తోంది.

English summary
Bengalugu: IMA case accused Mansoor Khan said in CBI custody that IPS officer Ajay Lihori took 25 KG gold and 13 crore rupees as bribe from him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X