బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరు జయనగర అసెంబ్లీ ఎన్నికలు: చిరుజల్లుల్లో ఓటింగ్, కాంగ్రెస్, బీజేపీ బిగ్ ఫైట్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు నగరంలోని జయనగర శాసన సభ నియోజక వర్గం ఎన్నికలు జూన్ 11వ తేదీ సోమవారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభం అయ్యాయి. జయనగర బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బిఎస్. విజయ్ కుమార్ ఆకస్మికమరణంతో మే 12వ తేదీ జరగవలసిన ఎన్నికలు వాయిదా పడ్డాయి.

జయనగర శాసన సభ నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే బిఎస్. విజయ్ కుమార్ సోదరుడు బిఎన్. ప్రహ్లాద్, కాంగ్రెైస్ అభ్యర్థిగా కర్ణాటక మాజీ హొం శాఖ మంత్రి రామలింగా రెడ్డి కుమార్తె సౌమ్యా రెడ్డి పోటీ చేస్తున్నారు.

Bengaluru Jayanagar assembly election 2018 voting anderway

కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో జేడీఎస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సౌమ్యా రెడ్డికి మద్దతు ఇస్తోంది. స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా రవికృష్ణా రెడ్డి పోటీ చేస్తున్నారు. మొత్తం 19 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. జయనగర నియోజక వర్గంలో సోమవారం ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభం అయ్యింది.

జయనగర్ శాసన సభ నియోక వర్గంలో మొత్తం 216 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బీజేపీ అభ్యర్థి బిఎన్. ప్రహ్లాద్ రాణి చెన్నమ్మ స్టేడియంలోని పోలింగ్ కేంద్రంలో క్యూలైన్ లో నిలబడి ఓట హక్కు వినియోగించుకున్నారు.

జయనగర 4వ Tబ్లాక్ లోని 52వ పోలింగ్ బూత్ లో ప్రముఖ సీనియర్ టి భారతీ విష్ణువర్దన్, సాహితేవత్త, సినీ దర్శకుడ బరుగూరు రామచంద్రప్ప ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసున్నారు.

English summary
Karnataka assembly elections 2018: Jayanagar constituency voting. Voting of Jayanagar constituency was postponed to June 11 due to the death of BJP candidate BN Vijayakumar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X