బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Law student: విదేశీ విద్యార్థిని గ్యాంగ్ రేప్, 7 మందికి యావజ్జీవ శిక్ష, ప్రియుడి కళ్ల ముందే ఆరోజు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ న్యూఢిల్లీ: బెంగళూరు సిటీలో కలకం రేపిన నేషనల్ లా కాలేజ్ విదేశీ విద్యార్థిని (21) గ్యాంగ్ రేప్ కేసులో 7 మంది కామాంధులకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. శిక్ష నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన కామాంధులకు హైకోర్టు అదే శిక్షను ఖరారు చేసింది. ప్రియుడితో కలిసి కారులో కుర్చో ఉన్న విద్యార్థిని ఎత్తుకెళ్లి ప్రియుడి కళ్ల ముందే 7 మంది కామాంధులు రాత్రి పూర్తిగా సామూహిక అత్యాచారం చేశారు. 2012లో బెంగళూరు నగరంతో పాటు దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఈ కేసులో నిందితులకు సరైన శిక్ష పడిందని బాధితురాలి సన్నిహితులు అంటున్నారు.

Illegal affair: భర్త ఎగ్ రైస్ వ్యాపారి, గుడ్డు పక్కింట్లో పెడుతున్నాడని రాగిముద్దతో చంపేసిన భార్య!Illegal affair: భర్త ఎగ్ రైస్ వ్యాపారి, గుడ్డు పక్కింట్లో పెడుతున్నాడని రాగిముద్దతో చంపేసిన భార్య!

 Law College అమ్మాయి

Law College అమ్మాయి

బెంగళూరులోని జ్ఞానభారతీ క్యాంపస్ (బెంగళూరు యూనివర్శిటీ) ఆవరణంలో Law కాలేజ్ విద్యార్థిని గ్యాంగ్ రేప్ కేసులో 7 మంది కామాంధులకు కింది కోర్టు విధించిన శిక్షను కర్ణాటక హైకోర్టు ఖరారు చేసింది. నిందితులు శిక్ష నుంచి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ నిందితులు కర్ణాటక హైకోర్టను ఆశ్రయించారు. నిందితుల పెట్టుకున్న పిటిషన్ విచారణను కర్ణాటక హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం న్యాయమూర్తులు జస్టిస్ వి. వీరప్ప, జస్టిస్ ఆర్. నటరాజ్ తిరస్కరించారు. కింది కోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటక హైకోర్టు సమర్థించడంతో కామాంధులకు చుక్కెదురైయ్యింది.

 రాత్రి ప్రియుడితో ఏకాంతంగా !

రాత్రి ప్రియుడితో ఏకాంతంగా !

బెంగళూరులోని జ్ఞానభారతీ క్యాంపస్ (బెంగళూరు యూనివర్శిటీ) ఆవరణంలో 2012 అక్టోబర్ 13వ తేదీ శనివారం రాత్రి 21 ఏళ్ల (అప్పటి ఆమె వయసు) నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్శిటీ (NLSIU) విద్యార్ధిని, ఆమె ప్రియుడు కారులో కుర్చుని ఏకాంతంగా గడుపుతున్నారు. ప్రియుడితో కలిసి ఉన్న అమ్మాయిది భారతదేశం పొరుగున ఉన్న నేపాల్. ఆ సమయంలో 8 మంది అక్కడికి వెళ్లారు.

నేపాల్ అమ్మాయి ఎర్రగా, బుర్రగా ఉండటంతో నిందితులు కామంతో రగిలిపోయారు.

 ప్రియురాలి ముందే ప్రియుడిని

ప్రియురాలి ముందే ప్రియుడిని

కారు దగ్గరకు వెళ్లిన 8 మంది నిందితులు కారు అద్దాలు ద్వంసం చేసి నానా హంగామా చేశారు. కారులో నుంచి కాలేజ్ అమ్మాయి, ఆమె ప్రియుడిని బయటకులాగేశారు. కాలేజ్ అమ్మాయి ముందే ఆమె ప్రియుడిని చెట్టుకు కట్టేసి చితకబాదేశారు. మమ్మల్ని వదిలేయాలని, ఇదే యూనివర్శిటీలో తాము ఇద్దరూ చదువుకుంటున్నామని, ఇక్కెప్పుడు ఇటువైపురామని ఇద్దరూ నిందితుల కాళ్లు పట్టుకుని వేడుకున్నారు.

 ప్రియుడి కళ్ల ముందే !

ప్రియుడి కళ్ల ముందే !

యువకుడిని అక్కడే కట్టేసిన నిందితులు నేపాల్ అమ్మాయిని జ్ఞానభారతీ క్యాంపస్ ఆవరణంలోని అటివీ ప్రాంతంలో సుమారు 2-3 కిటోమీటర్ల దూరం లోపలికి ఎత్తుకుని వెళ్లిపోయారు. తరువాత 7 మంది కామాంధులు ఆ యువతిపై ఒకరి తరువాత ఒకరు మరుసటి రోజు వేకువ జామున వరకు పదేపదే కసితీరా ఆమెను చిత్రహింసలకు గురి చేసి, శారీరకంగా హింసించి గ్యాంగ్ రేప్ చేశారు.

 రాత్రి ప్రియుడికి నరకం

రాత్రి ప్రియుడికి నరకం

కామాంధులు కామం తీరిపోయిన తరువాత ఆ అమ్మాయిని అదే అటవి ప్రాంతంలో వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు. ఆ రోజు రాత్రి నుంచి మరుసటి రోజు వరకు ఓ కానిస్టేబుల్ సహాయంతో ప్రియుడు నిర్మల్ ప్రియురాలి కోసం అటవీ ప్రాంతంలో గాలించారు. అయినా అమ్మాయి కనపడకపోవడంతో మొదట మిస్సింగ్ కేసు పెట్టారు, ఆ మరుసటి రోజు ఆ యువతి తాను హాస్టల్ లో ఉన్నానని ప్రియుడు నిర్మల్ కు ఫోన్ చేసింది. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు హాస్టల్ కు వెళ్లి యువతిని విచారణ చేసి గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేసి వివరాలు సేకరించారు.

 8 మంది గంధం చెక్కల స్మగ్లర్లు

8 మంది గంధం చెక్కల స్మగ్లర్లు

పోలీసుల విచారణలో నేపాల్ విద్యార్థిని మీద గ్యాంగ్ రేప్ చేసింది గంధపు చెక్కల స్మగ్లర్లు అని వెలుగు చూసింది. వారం రోజుల తరువాత జ్ఞానభారతీ క్యాంపస్ ఆవరణంలోని అటివీ ప్రాంతంలో గంధం చెట్లు నరకడానికి వెళ్లిన 6 మందిని పోలీసులు పట్టుకున్నారు. ఆ 6 మంది నిందితులు నేపాల్ యువతి మీద అత్యాచారం చేసినవాళ్లే అని పోలీసులు గుర్తించారు. తన మీద అత్యాచారం చేసింది వీళ్లే అని బాధితురాలు గుర్తుపట్టింది. మరో నిందితుడు ముత్తురాజు అలియాస్ రాజు అనే నిందితుడు తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు కాల్పులు జరిపి నిందితుడిని పట్టుకున్నారు. వీళ్లందరూ నిత్యం గంధం చెట్లు నరికి వాటిని తరలిస్తూ నేరాలు చేస్తున్నారని పోలీసు అధికారులు గుర్తించారు.

 కొన్ని నెలల్లో శిక్ష ఖరారు

కొన్ని నెలల్లో శిక్ష ఖరారు

బెంగళూరు సిటీ సివిల్ కోర్టులో కాలేజ్ అమ్మాయి గ్యాంగ్ రేప్ కేసు విచారణ జరిగింది. 10 నెలల నెలల లోపే కేసు విచారణ ముమ్మరంగా జరిగింది. అత్యాచారం జరిగిన తరువాత నేపాల్ వెళ్లిపోయిన బాధితురాలు తరువాత 5 రోజులు వరుసగా కోర్టుకు హాజరై కామాంధులు చేసిన ఆగడాలు మొత్తం వివరించింది. 2013 సెప్టెంబర్ 5వ తేదీన బెంగళూరు 55వ సిటీ సివిల్ కోర్టు 6 మంది కామాంధులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మరో నిందితుడు ముత్తురాజు 10 నెలల తరువాత చిక్కడంతో అతనికి అదే శిక్ష పడింది. కామాంధుల్లో ఓ నిందితుడు మైనర్ కావడంతో అతన్ని బాలనేరస్తుల కారాగారానికి పంపించారు.

 తప్పించుకోవాలని ప్రయత్నం

తప్పించుకోవాలని ప్రయత్నం

కర్ణాటకలో 10 నెలల వ్యవధిలో ఓ గ్యాంగ్ రేప్ కేసు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ పూర్తి చేసి నిందితులకు శిక్ష విధించిన మొదటి కేసు ఇదే. బాధితురాలు లండన్ లో చదువుకోవడానికి వెలుతున్న సందర్బంగా కోర్టులో ప్రతిరోజు విచారణ జరిగింది. లండన్ వెళ్లడానికి వారం రోజుల ముందు బాధితురాలు కోర్టుకు హాజరై కామాంధులు తన జీవితం ఏలా నాశనం చేశారో అనే విషయాన్ని న్యాయమూర్తి కేబి, సంగన్నవర్ కు వివరించింది. అయితే ఇప్పుడు కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ నిందితులు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించడంతో అక్కడ కామాంధులకు చుక్కెదురైయ్యింది.

English summary
Bengaluru: The Karnataka High Court on Wednesday confirmed the life sentence awarded by a trial court to seven people involved in the gangrape of a law student on the Jnana Bharathi campus in the city in October 2012.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X