బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసమ్మతి: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద వేటు, సీఎల్ పీ సమావేశం, ఆపరేషన్ కమల, ప్రభుత్వం !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసహనం వ్యక్తం చేసిన నలుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేశామని మాజీ ముఖ్యమంత్రి, సీఎల్ పీ నేత సిద్దరామయ్య అన్నారు. శుక్రవారం బెంగళూరులోని విధాన సౌధలో సీఎల్ పీ సమావేశం జరిగింది.

మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆధ్వర్యంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుల సమావేశానికి నలుగురు అసమ్మతి ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. కర్ణాటకలో శుక్రవారం ముఖ్యమంత్రి కుమారస్వామి బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. ఈ సందర్బంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ సీఎల్ పీ సమావేశానికి హాజరు కావాలని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య గురువారం ఆదేశాలు జారీ చేశారు.

Bengaluru: Karnataka Congress finally decided to suspended 4 legislators who spoke to the CLP meet.

శుక్రవారం విధాన సౌధలో జరిగిన సీఎల్ పీ సమావేశానికి గోకాక్ శాసన సభ్యుడు రమేష్ జారకిహోళి, బళ్లారి గ్రామీణ ఎమ్మెల్యే బి. నాగేంద్ర, అథణి ఎమ్మెల్యే మహేష్ కుమరళ్లి, చించోళి ఎమ్మెల్యే డాక్టర్ ఉమేష్ జాధవ్ హాజరు కాలేదు.

సీఎల్ పీ సమావేశానికి హాజరుకాని నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చెయ్యాలని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య నేతృత్వంలోని సీఎల్ పీ సమావేశం నిర్ణయించింది. ఆపరేషన్ కమలలో భాగంగా నలుగురు ఎమ్మెల్యేలు ముంబైలోని హోటల్ లో ఉన్నారని సమాచారం. ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రవేశపెట్టనున్న బడ్జెట్ ను వ్యతిరేకిస్తు బీజేపీకి మద్దతుగా నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరస వ్యక్తం చేస్తున్నారని సమాచారం.

English summary
Bengaluru: Karnataka Congress finally decided to suspended 4 legislators who spoke to the CLP meet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X