IT Hub: వీకెండ్ కర్ఫ్యూ రద్దు చేసిన ప్రభుత్వం, సీఎం మీటింగ్ లో, కోవిడ్ కేసులు తక్కువగా ఉన్నాయని !
బెంగళూరు: కరోనా వైరస్ మహమ్మారి థర్డ్ వేవ్ దెబ్బతో ఐటీ హబ్ బెంగళూరు నగరంతో సహ కర్ణాటక మొత్తం వీకెండ్ లాక్ డౌన్, వీకెండ్ కర్ఫ్యూ నైట్ కర్ఫ్యూ అమలు చేశారు. డిసెంబర్ చివరి వారం నుంచి వీకెండ్ కర్ఫ్యూతో పాటు వీకెండ్ లాక్ డౌన్ తో సతమతం అయిన ఐటీ హబ్ బెంగళూరు నగరంతో పాటు కర్ణాటక ప్రజలకు ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రోజు రాత్రి నుంచి వీకెండ్ కర్ఫ్యూ ఉండదని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే నైట్ కర్ఫ్యూ మాత్రం అమలులో ఉంటుందని, అందులో ఎలాంటి మార్పులు లేవని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ సమక్షంలో ఈ రోజు మద్యాహ్నం జరిగిన అత్యతున్నత స్థాయి అధికారులు. మంత్రులు, కోవిడ్ నిపుణుల సమావేశంలో కరోనా వైరస్ థర్డ్ వేవ్ విషయంలో సీఎం బసవరాజ్ బోమ్మయ్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని ఆ రాష్ట్ర సీనియర్ మంత్రి ఆర్. అశోక్ మీడియాకు చెప్పారు.

వీకెండ్ లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ
భారతదేశంలో కరోనా వైరస్ థర్డ్ వేవ్ దెబ్బతో ప్రజలు హడలిపోయారు. భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో కోవిడ్ నియమాలు, ఆంక్షలు కఠినంగా అమలు చేశారు. కర్ణాటకలో కూడా కోవిడ్ నియమాలు జారీ చేశారు. నూతన సంవత్సరం (2022) వేడుకల దెబ్బతో జనవరి 1వ తేదీ ముందు నుంచి కర్ణాటకలో వీకెండ్ లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ అమలు చేశారు.

ఒత్తిడి పెరిగిపోయింది
వీకెండ్ లాక్ డౌన్, వీకెండ్ కర్ఫ్యూ కారణంగా మా వ్యాపారాలు దెబ్బ తింటున్నాయని, వీకెండ్ లాక్ డౌన్ ఎత్తేయాలని బెంగళూరు నగరంతో సహ కర్ణాటక వ్యాప్తంగా ఉన్న హోటల్ వ్యాపారులు కర్ణాటక ప్రభుత్వం మీద ఒత్తిడి చేశారు. ఇదే సమయంలో కర్ణాటకలో కోవిడ్ పాజిటివ్ కేసులు తక్కువగానే ఉన్నాయని, వీకెండ్ లాక్ డౌన్ రద్దు చెయ్యాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.

నిపుణులు ఏం చెప్పారంటే ?
ప్రభుత్వం మీద ఒత్తిడి ఎక్కువ కావడంతో శుక్రవారం కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ నేతృత్వంలో బెంగళూరులోని సీఎం అధికారిక నివాసం కృష్ణలో అత్యవసర సమావేశం జరిగింది. బెంగళూరు నగరంలో ఉంటున్న మంత్రులు, సీనియర్ మంత్రులు, కోవిడ్ నిపుణుల బృందం, ఆరోగ్య శాఖ అధికారులు, సంబంధిత సీనియర్ అధికారులు సమావేశం అయ్యి వీకెండ్ లాక్ డౌన్, వీకెండ్ కర్ఫ్యూ సడలించే విషయంలో క్షుణ్ణంగా చర్చించారు.

కొంత మందికి గుడ్ న్యూస్....... కొందరు ఫైర్
కరోనా వైరస్ మహమ్మారి థర్డ్ వేవ్ దెబ్బతో ఐటీ హబ్ బెంగళూరు నగరంతో సహ కర్ణాటక మొత్తం వీకెండ్ లాక్ డౌన్, వీకెండ్ కర్ఫ్యూ నైట్ కర్ఫ్యూ అమలు చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ చివరి వారం నుంచి వీకెండ్ కర్ఫ్యూతో పాటు వీకెండ్ లాక్ డౌన్ తో సతమతం అయిన ఐటీ హబ్ బెంగళూరు నగరంతో పాటు కర్ణాటక ప్రజలకు ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అయితే కరోనా కట్టడి అవుతున్న సమయంలో వీకెండ్ లాక్ డౌన్ రద్దు చెయ్యడంతో కొంత మంది ప్రజలు మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఈ రోజు నుంచి వీకెండ్ లాక్ డౌన్ రద్దు
ఈ రోజు రాత్రి నుంచి వీకెండ్ కర్ఫ్యూ ఉండదని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే నైట్ కర్ఫ్యూ మాత్రం అమలులో ఉంటుందని, అందులో ఎలాంటి మార్పులు లేవని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ సమక్షంలో ఈ రోజు మద్యాహ్నం జరిగిన అత్యతున్నత స్థాయి అధికారులు. మంత్రులు, కోవిడ్ నిపుణుల సమావేశంలో కరోనా వైరస్ థర్డ్ వేవ్ విషయంలో సీఎం బసవరాజ్ బోమ్మయ్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని ఆ రాష్ట్ర సీనియర్ మంత్రి ఆర్. అశోక్ మీడియాకు చెప్పారు.

అ నియమాల్లో ఎలాంటి మార్పులేదు
వీకెండ్ లాక్ డౌన్, వీకెండ్ కర్ఫ్యూ రద్దు చేసినా శుభకార్యాలు, అంతిమ యాత్రలు, బహిరంగ సభలు, సమావేశాలు, పార్టీలు నిర్వహించచే విషయంలో గతంలో ప్రభుత్వం విధించిన నియమాల్లో ఎలాంటి మార్పులు లేవని కర్ణాటక ప్రభుత్వం తేల్చి చెప్పింది. జిల్లాల వారిగా కోవిడ్ పాజిటివ్ కేసులను అంచనా వేసి కోవిడ్ నియమాల్లో మార్పులు చేస్తామని కర్ణాటక ప్రభుత్వం అంటోంది.