బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సింగం ఐపీఎస్ రాజీనామా, రాజీకాయాల్లోకి వస్తారని ప్రచారం, బెంగళూరు డీసీపీ సంచలన నిర్ణయం !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక సింహం (సింగం) అనే పేరు సంపాధించుకున్న సిన్సియర్ ఐపీఎస్ అధికారి అణ్ణామలై ఆయన పదవికి రాజీనామా చేశారు. అవినీతిపరుల గుండెల్లో రెళ్లు పరగిగెత్తించిన అణ్ణామలై పోలీసు శాఖకు శాస్వతంగా దూరం కావడంతో అవినీతిపరులు పండుగ చేసుకుంటున్నారు.

అణ్ణామలై పోలీసు యూనీఫాం వదిలి రాజకీయాల్లోకి వస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. బెంగళూరు దక్షిణ విభాగం డీసీపీగా పని చేస్తున్న అణ్ణామలై జూన్ మొదటి వారంలో రాజీనామా చేస్తారని కొంత కాలంగా పోలీసు శాఖ. మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

Bengaluru: Karnataka IPS officer Aannamalai resigns

అయితే ఎవ్వరూ ఊహించని విధంగా మే 28వ తేదీన తన సీనియర్ పోలీసు అధికారుల అణ్ణామలై తన రాజీనామా లేఖను పంపించారని వెలుగు చూసింది. 2011వ ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన అణ్ణామలై నేటి వరకూ సిన్సియర్ పోలీసు అధికారిగా పేరు తెచ్చుకున్నారు.

కర్ణాటకలోని కార్కళ, చిక్కమగళూరు జిల్లాల ఎస్పీగా అణ్ణామలై పని చేశారు. సోమవారం రాత్రి నుంచి కొన్ని టీవీ చానల్స్ లో అణ్ణామలై తన పదవికి రాజీనామా చేస్తున్నారని బ్రేకింగ్ న్యూస్ వేశారు. మీరు రాజీనామా చెయ్యకూడదని అణ్ణామలై అభిమానులు బెంగళూరులోని ఆయన కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు.

తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన అణ్ణామలై తన పదవికి రాజీనామా చేసిన వెంటనే తన సొంత స్వగ్రామానికి వెళ్లారని సమాచారం. పోలీసు శాఖకు గుడ్ బై చెప్పిన అణ్ణామలై త్వరలో రాజకీయాల్లోకి వస్తారని సమాచారం. అయితే ఈ విషయంపై ఐపీఎస్ అధికారి అణ్ణామలై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ డీఎంకే పార్టీలో అణ్ణామలై చేరుతారని ఆయన సన్నిహితులు అంటున్నారు. అయితే అణ్ణామలై అధికారికంగా ఇంకా ఈ విషంపై క్లారిటీ ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాకు చెందిన పోలీసు అధికారి గోరంట్ల మాదవ్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి వైఎస్ఆర్ సీపీ నుంచి హిందూపురం ఎంపీగా ఇటీవల విజయం సాధించిన విషయం తెలిసిందే.

English summary
Karnataka IPS officer Annamalai, popularly known as 'Singham' of Karnataka police, has submitted resignation letter from his profession and he is likely to plunge into politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X