Bengaluru: హడలిపోయిన ఐటీ హబ్, లక్ష దాటిన కరోనా యాక్టీవ్ కేసులు, ఎంత మంది చనిపోయారంటే !
బెంగళూరు: కరోనా వైరస్ మహమ్మారి థర్డ్ వేవ్ దెబ్బతో భారతదేశంలోని అనేక రాష్ట్రాల ప్రజలు హడలిపోతున్నారు. భారతదేశంలోని అనేక రాష్ట్రాలు ఇప్పటికే కరోనా వైరస్ దెబ్బతో వీకెండ్ లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూలు అమలు చేస్తున్నాయి. కర్ణాటకలో కూడా వీకెండ్ లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ అమలు చేస్తోంది. ఈ రోజు రాత్రి నుంచి సోమవారం (జనవరి 17వ తేదీ ఉదయం వరకు) కర్ణాటకలో వీకెండ్ లాక్ డౌన్, కర్ఫ్యూ జారీ అయ్యింది. కర్ణాటకలో మరోసారి కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయాయి. ఈ విషయం కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ సుధాకర్ శుక్రవారం స్వయంగా ట్వీట్ చేశారు. ఒక్కరోజులో కర్ణాటకలో కొత్తగా 28, 723 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయితే బెంగళూరులో మాత్రమే కొత్తగా 20, 121 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
Khiladi
wife:
భర్త
డాబాకు
నిప్పు
పెట్టించిన
భార్య,
ప్రాణం
పోయింది,
రౌడీషీటర్
తో
డీలింగ్
!

పండగ పూట వీకెండ్ లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ
కర్ణాటకలో కూడా వీకెండ్ లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ అమలు చేస్తోంది. కర్ణాటకలో రోజురోజుకు కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. ఈనెల చివరి వారం వరకు వీకెండ్ లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుందని ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం తేల్చి చెప్పింది. సంక్రాంతి పండుగ టైమ్ లో కూడా వీకెండ్ లాక్ డౌన్ అమలు కావడంతో చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
ఉలిక్కిపడిన బెంగళూరు
కర్ణాటకలో రోజురోజుకు కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. ఈ విషయం కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ సుధాకర్ శుక్రవారం స్వయంగా ట్వీట్ చేశారు. ఒక్కరోజులో కర్ణాటకలో కొత్తగా 28, 723 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయితే బెంగళూరులో మాత్రమే 20, 121 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని మంత్రి డాక్టర్ సుధాకర్ స్పష్టం చేశారు.

బెంగళూరులో ఎంత మంది చనిపోయారంటే ?
కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ సుధాకర్ బుధవారం కోవిడ్ పాజిటివ్ కేసులకు సంబంధించి ఓ ట్విట్ చేశారు. ఒక్కరోజులో కర్ణాటకలో 12. 98 శాతం కోవిడ్ పాజిటివ్ కేసులు పెరిగాయని, 24 గంటల వ్యవధిలో 3,105 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారని, మొత్తం 14 మంది చనిపోయారని, అందులో బెంగళూరులో 7 మంది చనిపోయారని మంత్రి డాక్టర్ సుధాకర్ స్పష్టం చేశారు.

బెంగళూరులో లక్ష దాటిన కోవిడ్ యాక్టీవ్ కేసులు
కర్ణాటకలో కరోనా పాజిటివ్ యాక్టీవ్ కేసుల సంఖ్య 1, 41, 337 దాటిపోయానని వెలుగు చూసింది. బెంగళూరులో లక్షకు పైగా కరోనా వైరస్ యాక్టీవ్ కేసులు ఉన్నాయని కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ సుధాకర్ ట్వీట్ చేశారు. గత 24 గంటల్లో కర్ణాటకలో 2, 21, 205 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించామని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ సుధాకర్ స్పష్టం చేశారు. ఐటీ హబ్ బెంగళూరులో రోజురోజుకు కోవిడ్ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని వెలుగు చూడటంతో బెంగళూరు ప్రజలు బిత్తరపోతున్నారు.