బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం సొంత జిల్లాలో కలకలం రేపిన విద్యార్థిని నందితా కేసు క్లోజ్, కేసులో ఎమ్మెల్యే, 6 ఏళ్లకు సీఐడీ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ శివమొగ్గ: కర్ణాటకలో రాజకీయంగా కలకలం రేపిన 9వ విద్యార్థిని నందితా మృతి కేసు ఊహించని మలుపు తిరిగింది. నందితా మృతి చెందిన సమయంలో జరిగిన అల్లర్లు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం చేసులు అన్ని రద్దు చెయ్యాలని కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 6 ఏళ్ల క్రితం కర్ణాటకను కుదుపేసిన నందితా కేసులో ఓ ఎమ్మెల్యేతో సహ 47 మంది మీద ఐదు కేసులు నమోదైనాయి. నందితా మృతితో రెండు వర్గాల మధ్య గొడవలు జరిగి అల్లర్లు తారాస్థాయికి చేరడంతో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప సొంత జిల్లా శివమొగ్గతో పాటు కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో తీవ్రస్థాయిలో ఆందోళనలు జరిగాయి. ఆ సమయంలో రాజకీయంగా నందితా కేసు కర్ణాటకను కుదిపేసింది. 6 ఏళ్ల తరువాత నందితాకు సంబంధించి జరిగిన అన్ని కేసులు రద్దు అయ్యాయి.

Lockdown: ప్రధాని మోదీపై దుష్ప్రచారం, మేకప్ ఎలా చేశారో చూడండి ?, చీప్ ట్రిక్స్, ఎవరో తెలిస్తే !Lockdown: ప్రధాని మోదీపై దుష్ప్రచారం, మేకప్ ఎలా చేశారో చూడండి ?, చీప్ ట్రిక్స్, ఎవరో తెలిస్తే !

నందితా ఎవరంటే ?

నందితా ఎవరంటే ?

కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా (కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్ప సొంత జిల్లా) తీర్థహళ్ళిలోని ప్రభుత్వ హైస్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ లో నందితా 9వ తరగతి చదివేది. 2014 అక్టోబర్ 30వ తేదీన నందితా ఇంటి నుంచి స్కూల్ కు బయలుదేరి వెళ్లింది. అయితే ఆ రోజు నందితా స్కూల్ కు వెళ్లలేదు.

ఆనందగిరి గుట్టలో !

ఆనందగిరి గుట్టలో !

తీర్థహళ్ళి పరిసర ప్రాంతాలకు చెందిన మహిళలు కొందరు అదే రోజు మద్యాహ్నం ఆనందగిరి గుట్టలో కట్టెలు తెచ్చుకోవడానికి వెళ్లారు. ఆ సమయంలో ఆనందగిరి గుట్టలోని నిర్జనప్రదేశంలో చలనం లేకుండా పడి ఉన్న నందితాను ఆ మహిళలు చూశారు. తరువాత ఆ మహిళలు నందితాను పిలుచుకుని వచ్చి ఆమె ఇంటి దగ్గర వదిలిపెట్టారు.

నందితా మృతితో అల్లకల్లోలం

నందితా మృతితో అల్లకల్లోలం

ఇంటికి వెళ్లిన నందితా తనను ముగ్గురు వ్యక్తులు కారులో కిడ్నాప్ చేసి ఆనందగిరి గుట్టలోకి తీసుకెళ్లారని కుటుంబ సభ్యులకు చెప్పింది. అదే రోజు రాత్రి వాంతులు చేసుకుని తీవ్ర అనారోగ్యానికి గురైయ్యింది. వెంటనే నందితాకు తీర్థహళ్ళి జేసీ ఆసుపత్రిలో చికిత్స చేయించి తరువాత శివమొగ్గలోని మెగ్గాన్ ఆసుపత్రికి తరలించారు. శివమొగ్గ నుంచి నందితాను మణిపాల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స విఫలమై మరణించింది. నందితా మీద ఓ వర్గం వారు అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపిస్తూ తీర్థహళ్ళిలో గొడవలు మొదలైనాయి. నందితా మృతితో తీర్థహళ్ళితో పాటు శివమొగ్గ జిల్లా అల్లకల్లోలం అయ్యింది.

సీబీఐకి నో.... సీఐడీ విచారణకు ఓకే

సీబీఐకి నో.... సీఐడీ విచారణకు ఓకే

నందితా అనుమానాస్పద మృతితో అప్పట్లో తీర్థహళ్ళిలో రెండు వర్గాల మధ్య అల్లర్లకు దారితీశాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసం అయ్యాయి. లాఠీచార్జ్ లు, 144 సెక్షన్ లతో పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కర్ఫ్యూ విధించారు. నందితా అనుమానాస్పద కేసు విచారణ సీబీఐకి అప్పగించాలని శివమొగ్గ జిల్లాతో పాటు కర్ణాటకలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. చివరికి అప్పటి ప్రభుత్వం నందితా కేసు విచారణ సీఐడీకి అప్పగించింది. సీఐడీ అధికారులు కేసు విచారణ చేసి అప్పటి తీర్థహళ్ళి ఎమ్మెల్యే, ప్రస్తుతం ఎమ్మెల్యే అయిన అరగ జ్ఞానేంద్రతో సహ మొత్తం 47 మంది మీద మొత్తం ఐదు కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు.

Recommended Video

Bengaluru Loud Sonic Boom Mystery Finally Solved, Watch Video
నందితా కేసులు క్లోజ్

నందితా కేసులు క్లోజ్

నందితా కేసులో అరెస్టు అయిన వారు చాలా మంది బళ్లారి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించి బెయిల్ మీద బయటకు వచ్చారు. అప్పటి నుంచి నందితా కేసులు అన్ని విచారణలో ఉన్నాయి. అయితే సీఐడీ అధికారులు నందితా ఆత్మహత్య చేసుకుందని కోర్టులో చార్జ్ షీటు దాఖలు చేశారు. ఈ కేసు విచారణ ఓ కొలిక్కిరావడంతో నందితా అనుమానాస్పద కేసు విచారణ పూర్తి కావడంతో ఆ సమయంలో నమోదైన అన్ని కేసులు రద్దు చెయ్యాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం మీద 6 ఏళ్ల తరువాత 9వ తరగతి విద్యార్థిని నందితా కేసుల విచారణ పూర్తి కావడం, ఆ కేసుల్లో అందరికీ క్లీన్ చిట్ ఇవ్వడంతో ఓ వర్గం వారు ఊపిరిపీల్చుకున్నారు.

English summary
Bengaluru: Karnataka government withdraw the case file after the protest and violence in Thirthahalli town of Shivamogga district in 2014 after the death of 14 year old girl Nanditha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X