బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Bengaluru longlock: కరోనా మాయాబజార్, ఉన్నది లేనట్లు, లేనిది ? దెబ్బకు దౌడ్, ఏ టైంలో ?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: భారతదేశంలో కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి తాండవం చేస్తోంది. కరోనా వైరస్ కట్టడి కాకపోవడంతో మళ్లీ అనేక రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలు చేశారు. ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధాని సిలికాన్ సిటీ బెంగళూరులో లాక్ డౌన్ అమలు చేశారు. ఈ దెబ్బతో బెంగళూరు మరోసారి ఖాళీ అయ్యింది. మూడు రోజులు ముందుగానే బెంగళూరులో లాక్ డౌన్ అమలు చేస్తామని సీఎం ప్రకటించడంతో ప్రజలు బ్యాగులు సర్దుకుని పిల్లాపాపలతో సొంత ఊర్లకు రైట్ రైట్ అంటూ పరుగు తీశారు. బెంగళూరు సిటీలో రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో స్థానిక ప్రజలతో పాటు కర్ణాటక ప్రభుత్వం ఎప్పుడు ఏం జరుగుతుందో అంటూ హడలిపోతున్నది.

Missed call lover: నేను మిస్, యువకుడికి స్వర్గం చూపించింది, ఎటూకాకుండా పోయింది !Missed call lover: నేను మిస్, యువకుడికి స్వర్గం చూపించింది, ఎటూకాకుండా పోయింది !

 బెంగళూరు సిటీలో ఎంత మంది అంటే !

బెంగళూరు సిటీలో ఎంత మంది అంటే !

బెంగళూరు సిటీలో సుమారు 1 కోటి 40 లక్షల మంది నివాసం ఉంటున్నారు. కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు మార్చి 25వ తేదీన దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు కావడంతో బెంగళూరు ప్రజలు లాక్ డౌన్ రుచి చూశారు. ఈ దెబ్బతో బెంగళూరు నుంచి కొన్ని లక్షల మంది వారివారి సొంత ప్రాంతాలకు చెక్కేశారు. అయితే కరోనా వైరస్ నివారణకు మొదట్లో కన్నడిగులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారనే చెప్పాలి. ఎందుకంటే కరోనా వైరస్ కట్టడిలో కర్ణాటక ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్వయంగా కేంద్ర ఆరోగ్య శాఖ మెచ్చుకుని కితాబు ఇచ్చింది.

 బారో ఏనూ ఆగళ్లా ? (రారా... ఏం కాదు)

బారో ఏనూ ఆగళ్లా ? (రారా... ఏం కాదు)

కేంద్ర ప్రభుత్వం సైతం కన్నడిగులను మెచ్చుకోవడం, ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కరోనా వైరస్ కట్టడికి స్థానిక ప్రజలు తీసుకుంటున్న జాగ్రత్తలను ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ గత నెల చివరి వారంలో సూచించింది. అయితే అక్కడే వ్యవహారం మొత్తం చెడింది. కర్ణాటకలో కరోనా వైరస్ ఎక్కువ వ్యాపించదని గుడ్డిగా అంచనా వేసిన కొందరు ప్రజలు బారో ఏనూ ఆగళ్లా (రారా... ఏం కాదు) అంటూ పోలో అంటూ రోడ్ల మీదకు వచ్చి తెగతిరిగేశారు.

 దెబ్బకు మాయాబజార్

దెబ్బకు మాయాబజార్

ఎప్పుడైతే ప్రజలు రోడ్ల మీద విచ్చలవిడిగా తిరగడం మొదలుపెట్టారో అప్పుడే నేను ఉన్నాను గుర్తు పెట్టుకో ? అంటూ కరోనా వైరస్ తన ప్రతాపం చూపించడం మొదలుపెట్టింది. ఒక్కసారిగి ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు మయాబజార్ సినిమా గుర్తుకు వచ్చింది. కరోనా వైరస్ కేసుల సంఖ్య మూడింతలు పెరిగిపోవడంతో బెంగళూరు ప్రజలతో పాటు కర్ణాటక ప్రభుత్వం ఉలిక్కిపడింది.

 సీఎం యూటర్న్

సీఎం యూటర్న్

బెంగళూరులో ఎలాంటి పరిస్థితుల్లో మళ్లీ లాక్ డౌన్ విధించమని, ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా ఈ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప పదేపదే చెప్పారు. అయితే కరోనా వైరస్ కట్టడి కాకపోవడం, సీఎం కార్యాలయంలోని కొందరు సిబ్బందికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో మంగళవారం రాత్రి 8 గంటల నుంచి బెంగళూరు సిటీ, బెంగళూరు గ్రామీణ జిల్లాలతో సహ నాలుగు జిల్లాల్లో వారం రోజుల పాటు లాక్ డౌన్ అమలు చెయ్యాలని సీఎం బీఎస్. యడియూరప్ప అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఒక్కసారిగా కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్ప యూటర్న్ తీసుకోవడంతో బెంగళూరులో ఏ విధంగా కరోనా వైరస్ వ్యాధి తాండవం చేస్తోందో అర్థం అవుతోంది.

 సర్దుకున్నారా..... రైట్ రైట్

సర్దుకున్నారా..... రైట్ రైట్

మార్చి 25 లాక్ డౌన్ తరువాత కొన్ని లక్షల మంది బెంగళూరు ఖాళీ చేసి వారివారి సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇప్పుడు మళ్లీ లాక్ డౌన్ అమలుకావడంతో ఎన్ని లక్షల మంది వారి సొంత ప్రాంతాలకు చెక్కేస్తారో అర్థం కావడం లేదని కొందరు అధికారులు అంటున్నారు. అయితే కరోనా వైరస్ కట్టడి కోసం బీజేపీ ప్రభుత్వం ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదని, బెంగళూరులోని వలస జీవులను ఆదుకోవడంలో బీఎస్. యడియూరప్ప ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని ప్రతిపక్ష నాయకులు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు.

Recommended Video

Ram Gopal Varma's Power Star Movie Releasing On July 21st పవర్ స్టార్ మూవీ ట్రైలర్, రిలీజ్ వివరాలు!
 బెంగళూరులో ‘మళ్లీ లాక్'పడింది

బెంగళూరులో ‘మళ్లీ లాక్'పడింది

బెంగళూరు సిటీలో మళ్లీ లాక్ డౌన్ అమలు కావడంతో సిలికాన్ సిటీలోని అనేక ప్రాంతాల్లోని అన్ని ఫ్లైఓవర్లు మూసివేశారు. బెంగళూరు సిటీ, బెంగళూరు గ్రామీణ జిల్లాల్లోని ఇతర ప్రాంతాల నుంచి ఏ వాహనాలు సిలికాన్ సిటీలోకి ప్రవేశించకుండా అన్ని రహదారులు మూసివేశారు. మంగళవారమే కొన్ని వేల మంది ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఎప్పుడు ఏం జరుగుతుందో ? అనే విషయం అర్థం కాక బెంగళూరు ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

English summary
Bengaluru Lockdown: Karnataka government announced one week long lockdown in Bengaluru Urban & Rural district. Lockdown began from 8 pm of July 14, 2020.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X