• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కండోమ్ లేకుండా సెక్స్ వద్దన్నందుకు మహిళ దారుణ హత్య

|

డ్యూటీ నుంచి ఇంటికెళుతోన్న అతనికి.. బస్టాండ్ వద్ద ఓ మహిళ ఎదురుపడింది.. మాటలు కలిపారు.. రూ.2500కు బేరం కుదిరింది.. అడ్వాన్స్‌గా రూ.500 తీసిచ్చాడు.. ఇద్దరూ కలిసి ఆమె ఉంటోన్న చోటికి వెళ్లారు.. ఆటో దిగగానే మరో వెయ్యి రూపాయలు చేతిలో పెట్టాడు.. తీరా గదిలోకి వెళ్లిన తర్వాత ఆమె కండిషన్ పెట్టింది.. కండోమ్ లేకుండా సెక్స్ వద్దని చెప్పింది.. అలా మొదలైన గొడవ చివరికి హత్యకు దారితీసింది. పదిరోజులు గాలింపు తర్వాతగానీ నిందితుడు పోలీసుల చేతికి చిక్కాడు.

అసలేం జరిగిందంటే..

అసలేం జరిగిందంటే..

బెంగళూరు పోలీసుల కథనం ప్రకారం.. 42 ఏళ్ల మహిళ భర్తను వదిలేసి, కొడుకుతోపాటు వెస్ట్ బెంగళూరులోని గాయత్రి నగర్ లో నివసిస్తోంది. పొట్టకూటికోసం సెక్స్ వర్కర్ గా పనిచేస్తోన్న ఆమెకు ఈ నెల11న ముకుందా(48) అనే వ్యక్తి ఎదురయ్యాడు. మాండ్యాకు చెందిన ఆయన చాలా ఏళ్లుగా బెంగళూరులోనే సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. బేరం కుదిరిన తర్వాత ఇద్దరూ కలిసి ఆమె ఇంటికెళ్లారు. అసురక్షిత లైంగిక సంబంధాలపై అవగాహన కలిగిన ఆమె.. కండోమ్ ధరించాల్సిందిగా అతణ్ని కోరింది.

డబ్బుతిరిగివ్వమంటూ గొడవ..

డబ్బుతిరిగివ్వమంటూ గొడవ..

అయితే ముకుందా మాత్రం అందుకు ఒప్పుకోలేదు. కండోమ్ లేకుండానే బలవంతపెట్టబోయాడు. ఎంతకీ వీలుపడకపోవడంతో తన డబ్బులు తిరిగిచ్చేయాలని డిమాండ్ చేశాడు. డబ్బులు తిరిగివ్వడం కుదరదన్న ఆమె.. ఎక్కువ మాట్లాడితే చుట్టుపక్కలవాళ్లకు వినిపించేలా గోలచేస్తానని బెదిరించడంతో ముకుంద్ ఉన్మాదిలా మారిపోయాడు. తన బ్యాగులో కత్తి తీసి ఆమె పొట్టలో పొడిచేశాడు. బాధతో కేకలు వేయబోతుండగా గొంతు కూడా కోసేసి, ఆమె ఒంటిమీదున్న గిల్టు నగలు, సెల్ ఫోన్లు తీసుకుని పరారయ్యాడు.

పోలీసుల వేట..

పోలీసుల వేట..

సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన కొడుకు.. శవంగా మారిన తల్లిని చూసి, పక్కింటివాళ్ల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహిల సెల్ ఫోన్ స్విచాఫ్ కావడంతో, పోలీసులకు చిన్న ఆధారం కూడా దొరకలేదు. వారం రోజుల పాటు హత్య జరిగిన ఏరియాలోని అన్ని సీసీటీవీ కెమెరాల రికార్డుల్ని పరిశీలించగా.. చివరికి ఓకే ఒక్క కెమరాలో నిందితుడు హతురాలితో కలిసున్న విజువల్ దొరికింది. దాని ఆధారంగా గాలించిన పోలీసులు బుధవారం ఎట్టకేలకు నిందితుణ్ని పట్టుకున్నారు. హత్య చేసింది తానేనని అంగీకరించడంతో ముకుంద్ ను రిమాండ్ కు తరలించారు.

English summary
shocking news has come to light from Bengaluru where a 42-year-old ‘sex worker’ was found dead at her residence in West Bengaluru by a customer. As per police, the woman declined to give money back because the accused refused to have safe sex with her
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X