వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐసిస్ సంబంధాలున్నాయనే కారణంతో బెంగుళూరు వ్యక్తి హిమాచల్ ప్రదేశ్ లో అరెస్టు

బెంగుళూరుకు చెందిన 23 ఏళ్ళ అబిద్ ఖాన్ ను హిమాచల్ ప్రదేశ్ లో పోలీసులు అరెస్టుచేశారు. తప్పుడుధృవీకరణ పత్రాలతో ఆయన అక్కడ నివాసం ఉంటున్నారు. ఐసిస్ తో ఆయనకు సంబంధాలున్నాయనే విషయాన్ని పోలీసులు దృవీకరిస్తున్

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు : బెంగుళూరుకు చెందిన 23 ఏళ్ళ అబీద్ ఖాన్ ను హిమాచల్ ప్రదేశ్ లో అరెస్టు చేశారు. ఐసిస్ తో సంబంధాలున్నాయనే కారణంగా పోలీసులు ఆయనను హిమాచల్ ప్రదేశ్ లోని కూలులో అరెస్టు చేశారు ఇంటలిజెన్స్ అధికారులు ఆయనను విచారణ చేస్తున్నారు.

అబీద్ ఖాన్ ను అరెస్టు చేసిన విషయాన్ని డిజిపి సంజయ్ కుమార్ ధృవీకరించారు. హిమాచల్ ప్రదేశ్ లోని కూలులో తప్పుడు ధృవీకరణ పత్రాలతో అబీద్ ఖాన్ నివసిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఐసిస్ లో ఆయన పాత్ర ఏ రకంగా ఉందనే విషయాన్ని పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ విషయమై పూర్తిగా వివరాలు బయటకు రాలేదని అధికారులు చెబుతున్నారు.

Bengaluru man with ISIS links arrested in Kullu

ఐసిస్ సిద్దాంతాలతో ఆయన ప్రభావితమయ్యాడని పోలీసులు అధికారులు చెబుతున్నారు. ఐసిస్ తో సంబంధాలున్నట్టు పోలీసులు అరెస్టు చేసిన అబిద్ ఖాన్ ఈ ఏడాది ఎన్ ఐ ఏ అదుపులోకి తీసుకొన్న మ్యాడ్యుల్ ఆపరేషన్ లో పాల్గొనే పనిలో ఉన్నాడనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఆయనను ఎన్ ఐ ఏ అధికారులు ప్రశ్నించనున్నారు.

ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా ఎన్ ఐ ఏ నిర్వహించిన దాడుల్లో ఐసిస్ సానుభూతిపరులను అరెస్టు చేశారు.న్యూఢిల్లీలో నిర్వహించే ఆపరేషన్ లో భాగంగా అబిద్ ఖాన్ మ్యాడ్యుల్ గా పనిచేస్తున్నారనే అనుమానాన్ని ఎన్ ఐ ఏ అధికారులు అనుమానిస్తున్నారు.

English summary
A 23-year-old resident of Bengaluru with suspected links to the ISIS has been arrested at Kullu in Himachal Pradesh. The man identified as Abeed Khan was picked up by the police and is currently being interrogated by sleuths of the Intelligence Bureau.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X