బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సాగదీస్తున్నారు, ఆ మధ్య రేప్‌లు: బెంగళూరు షాకింగ్ ఘటనపై మంత్రి

కర్నాటక రాజధాని బెంగళూరులో డిసెంబర్ 31వ తేదీన రాత్రి అమ్మాయిలను వేధించిన ఘటన పైన మంత్రి శివకుమార్ శుక్రవారం నాడు స్పందించారు.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులో డిసెంబర్ 31వ తేదీన రాత్రి అమ్మాయిలను వేధించిన ఘటన పైన మంత్రి శివకుమార్ శుక్రవారం నాడు స్పందించారు. కొన్నిసార్లు మీడియా మిత్రులు, రాజకీయ పార్టీలు ఇష్యూను సాగదీస్తుంటారని ఆవేదన వ్యక్తం చేశారు.

బాయ్‌ఫ్రెండ్ ఉన్నా ఏం చేయలేడని అర్థమైంది!: బెంగళూరు బాధితురాలు

బెంగళూరులో జరిగిన ఘటన పైన ప్రభుత్వం స్పందిస్తోందని చెప్పారు. సమస్యను పరిష్కరిస్తున్నామని, మాకు మీడియా, ప్రతిపక్ష పార్టీలో సహకారం ఇందుకు అవసరమని ఆయన చెప్పారు.

డిసెంబర్ 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఎన్నో అత్యాచారాలు జరిగాయని, ఏదీ కూడా బయటకు రాలేదని, దేని పైన కూడా చర్చ జరగలేదని, బెంగళూరు ఇష్యూ మాత్రం సాగదీస్తున్నారన్నారు. తాము నిందితుల పైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

వేధింపులు

వేధింపులు

కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా డిసెంబరు 31 రాత్రి బెంగళూరులోని ఎంజీ రోడ్‌, బ్రిగేడియర్‌ రోడ్‌లలో జరిగిన మహిళలపై వేధింపుల ఘటనలపై బెంగళూరు పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై నాలుగు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.

కేసులు

కేసులు

పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా మూడు కేసులు, సోషల్‌ మీడియా పోస్ట్‌ ఆధారంగా మరో కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజి చూశామని అందులో వేధింపులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని, ఈ నేపథ్యంలో ఆ వార్తలు ప్రచురించిన వార్తాసంస్థలనుంచి మరిన్ని వివరాలు కోరుతూ నోటీసులు పంపామని పోలీసులు తెలిపారు.

బెంగళూరు ఘటన

బెంగళూరు ఘటన

ఆ ప్రాంతంలో 1400 మంది పోలీసు సిబ్బంది బాధ్యతలు నిర్వర్తించారని, 40 సీసీటీవీలు ఉన్నాయని వీటికి తోడు పత్రికలు, టెలివిజన్‌ ఛానళ్లకు సంబంధించిన కెమెరామెన్‌లు, విలేకరులు ఆ రోజు అక్కడ ఉన్నారని పోలీసులు చెప్పారు.

దర్యాఫ్తు

దర్యాఫ్తు

ఒకటో తేదీ ఉదయం కమిషనర్‌గా తన తొలిరోజున విలేకరుల సమావేశంలో మాట్లాడానని, అవాంఛనీయ సంఘటనలు జరిగినట్లు ఎవరూ తన దృష్టికి తీసుకు రాలేదన్నారు. జరిగిన సంఘటనలను తమ దృష్టికి తెచ్చి, దర్యాప్తునకు సహకరించాల్సిందిగా బాధితులకు, మీడియాకు విజ్ఞప్తి చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

English summary
Bengaluru mass molestation issue been blown out of proportion, says Karnataka energy minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X