బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీజేపీలో మగాడు లేడురా బుజ్జీ, మండిపడుతున్న కన్నడిగులు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) మేయర్ గా మంగళవారం బీజేపీ కార్పొరేటర్ ఎం. గౌతమ్ కుమార్ జైన్ ఎన్నిక అయ్యారు. బెంగళూరు నూతన్ మేయర్ ఎన్నికల తరువాత బీజేపీ మీద కన్నడ సంఘాలు మండిపడుతున్నాయి. బీజేపీలో బెంగళూరు మేయర్ కావడానికి ఒక్క మగాడు కూడు లేడా అని ఆ పార్టీ నాయకుల మీద మండిపడుతున్నారు. కన్నడిగులను జైలుకు పంపించిన జైన్ మతస్తులను బెంగళూరు మేయర్ చేసి కన్నడిగులను అవమాన పరిచారని బీజేపీ మీద కన్నడ సంఘాలు మండిపడుతున్నాయి. బెంగళూరు నగరంలోని శాంతిపుర శాసన సభ నియోజకవర్గంలోని జోగుపాళ్య కార్పొరేటర్ ఎం. గౌతమ్ కుమార్ జైన్.

బళ్లారి జిల్లా విభజన, గాలి రెడ్డి బ్రదర్ ఫైర్, మేమూ బీజేపీ ఎమ్మెల్యేలే సీఎం గారు, బంద్ !బళ్లారి జిల్లా విభజన, గాలి రెడ్డి బ్రదర్ ఫైర్, మేమూ బీజేపీ ఎమ్మెల్యేలే సీఎం గారు, బంద్ !

బెంగళూరు మేయర్ మార్వాడినా !

బెంగళూరు మేయర్ మార్వాడినా !

బెంగళూరు మేయర్ గా కన్నడిగులను చెయ్యడంలో బీజేపీ విఫలం అయ్యిందని కన్నడ సంఘాలు మండిపడుతున్నాయి. ఒక మార్వాడి (జైన్)ని తీసుకువచ్చి బెంగళూరు మేయర్ చేసి కన్నడిగునుల బీజేపీ అవమానపరిచిందని కన్నడ సంఘాలు విరుచుకుపడుతున్నాయి.

బీజేపీలో మగాడు లేడా ?

బీజేపీలో మగాడు లేడా ?

బెంగళూరు మేయర్ కావడానికి బీజేపీలో ఒక్క మగాడు కూడా లేడా అని కన్నడ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. బీజేపీలో ఒక్క మగాడు కూడా లేకపోవడంతో గౌతమ్ కుమార్ జైన్ ను మేయర్ చేశారని కన్నడ సంఘాలు విమర్శిస్తున్నాయి. బీజేపీ నాయకుల తీరుపై కన్నడ చళవళి వాటాళ్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వాటళ్ నాగరాజ్ ఆధ్వర్యంలో బీబీఎంపీ కార్యాలయం ముందు మంగళవారం ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు.

కన్నడిగుడే మేయర్ కావాలి !

కన్నడిగుడే మేయర్ కావాలి !

కన్నడిగుడే మేయర్ కావాలి అనే డిమాండ్ తో కన్నడ సంఘాలు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నాయి. కన్నడిగుడు బెంగళూరు మేయర్ కావాలని ట్వీట్టర్, ఫేస్ బుక్ లో లో ప్రచారం చేస్తున్నాయి. కన్నడ సంఘాల కార్యకర్తలను జైలుకు పంపించిన జైన్ మతస్తులను బెంగళూరు మేయర్ చేస్తారా ? అని బీజేపీ నాయకులను కన్నడిగులు ప్రశ్నిస్తున్నారు.

కెంపేగౌడ ఆశయాలు

కెంపేగౌడ ఆశయాలు

కన్నడిగులు సుఖసంతోషాలతో ఉండాలని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిని అక్కడ ఆదరించండి అంటూ బెంగళూరు నిర్మించారని కన్నడ సంఘాలు గుర్తు చేస్తున్నాయి. అయితే బీజేపీ నాయకులు కెంపేగౌడ ఆశయాలు నేలమట్టం చేశారని, బెంగళూరులో ఇతర ప్రాంతాల వారికి పెద్దపీట వేసి కన్నడిగులను పరాయివారు చేశారని కన్నడ సంఘాలు మండిపడుతున్నాయి.

బెంగళూరు ఎవరిది ?

బెంగళూరు ఎవరిది ?

బెంగళూరు కన్నడిగులదా ? ఇతర ప్రాంతాల వారిదా ? అనే అనుమానం వస్తోందని, కన్నడిగులు వాపోతున్నారు. వెంటనే కన్నడిగుడిని బీజేపీ మేయర్ చెయ్యాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కన్నడ సంఘాలు బీజేపీని హెచ్చరించాయి. సీఎం యడియూరప్పకు బెంగళూరు మేయర్ ఎన్నికలు తలనొప్పిగా తయారైనాయి. బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటేల్, సీఎం యడియూరప్పల మద్య శీతల సమరంలో ఇదో భాగం అని బీజేపీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.

English summary
Bengaluru Jogupalya ward corporator M.Gowtham Kumar Jain elected as Bruhat Bengaluru Mahanagara Palike (BBMP) mayor. Kannada Organisations upset with BJP for not elected Kannadiga as mayor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X