వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం కు బోకే ఇచ్చిన మేయర్‌కు రూ.500 జరిమాన ఎందుకో తెలుసా...?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు నగర పాలక సంస్థ అధికారులు సహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. చట్టాలు ఎవరికి చుట్టాలు కాదని నిరూపించారు. ఈనేపథ్యంలోనే ప్లాస్టిక్ నిషేధం పై ఉన్న నిబంధనలు ఉల్లంఘించిన నగర మేయర్‌పైనే ఏకంగా జరిమాన విధించారు. ముఖ్యమంత్రి ,మేయర్ అని చూడకుండా ప్లాస్టిక్ వినియోగించిన మేయర్‌పై రూ.500 జరిమానా విధించారు.

ఇటివల కర్ణాటక రాజకీయ పరిణామాల నేపథ్యంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే..ముఖ్యమంత్రిగా బీజేపీ నేత యడియూరప్ప భాద్యతలు చేపట్టిన సంధర్భంలో ఆయనకు గ్రీటింగ్స్ చేప్పేందుకు బెంగళూరు మేయర్ గంగమ్‌బైక్ మల్లికార్జున్ పళ్ల బోకేను తీసుకువచ్చింది. అయితే ఆ పూలబోకే ప్లాస్టిక్‌ కవర్‌తో కప్పి ఉండడంతో ఆమేపై పలు విమర్శలు చెలరేగాయి. సోషల్ మీడీయాలో పలువురు నెటిజన్లు ప్రశ్నించడంతో నగర పాలక సంస్థ అధికారులు ఆమేకు రూ.500 జరిమానాను విధించింది. కాగా నగరపాలక సంస్థ 2016లోనే పూర్తిగా ప్లాస్టిక్‌ను నిషేధించింది.

 Bengaluru Mayor paid Rs 500 fine for presenting a gift wrapped in plastic

చట్టాలు చేసే వారే వాటిని ఉల్లంఘిస్తే, సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి, సమాజ పరిస్థితులపై ఎంతో అవగహానతోపాటు ముందు తరాలకు భవిష్యత్‌ను అందించేందుకు ప్రజా ప్రతినిధులు, మేధావులు అనేక చట్టాలు చేస్తున్నారు. వాటిని పాటించని వారిపై చర్యలు చేపడుతూ అనేక చట్టాలను తెస్తున్నారు. అయితే ఇలాంటీ చట్టాలు చేసే వారే ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తీసుకోవడం చాల ప్రాంతాల్లో ఉండదు, కాని బెంగళూరు మాత్రం మేయర్‌పై చర్యలు తీసుకుని ఇతర కార్పోరేషన్లకు ఆదర్శంగా నిలించింది.

 Bengaluru Mayor paid Rs 500 fine for presenting a gift wrapped in plastic
English summary
Bengaluru Mayor Gangambike Mallikarjun paid Rs 500 fine for presenting a gift wrapped in plastic to Chief Minister BS Yediyurappa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X