బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డిసెంబర్ 20న బెంగుళూరులో మిడ్‌నైట్ మారథాన్ (ఫోటో)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: డిసెంబర్ 20న బెంగుళూరులో మిడ్‌నైట్ మారథాన్ నిర్వహించనున్నారు. ఓ ఛారిటీ కోసం విరాళాలు సేకరించే కార్యక్రమంలో భాగంగా ఈవెంట్‌ని 8వసారి నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్‌కి మొత్తం 15 సంస్ధలు ప్రచారకర్తలుగా వ్వవహరిస్తున్నారు. టైటిల్ స్పాన్సర్‌గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. ఈ ఈవెంట్‌ను నిర్వహణ మొత్తం రోటర్ బెంగుళూరు ఐటీ కారిడార్ (ఆర్‌బీఐటీసీ) పర్యవేక్షిస్తుంది.

మారథాన్ టైమింగ్స్:

* సాయంత్రం 4 గంటలకు కమ్యూనిటీ రిలే: ఈ రిలేలో కమ్యూనిటీ ఆధారంగా ఐదుగురు టీమ్ సభ్యులను పాల్గొంటారు. ప్రతి ఒక్కరు కూడా ఒక్క కిలోమీటరు పరుగెత్తుతారు. తర్వాత మరో టీమ్ సభ్యుడికి వారి చేతిలో ఉన్న బ్యాటన్ అందిస్తారు. ఇలా ఐదుగురు సభ్యులు ఐదు కిలోమీటర్లు దూరం పరిగెత్తుతారు.

Bengaluru midnight marathon to be held on december 20

* సాయంత్రం 6 గంటలకు ఐటీ సీటీ ఫన్ రన్: ఇది ఫ్లాగ్‌షిప్ ఈవెంట్. ఈ ఈవెంట్‌లో కుటుంబం మొత్తం పాల్గొనొచ్చు. ఐతే ఐటీ ప్రోపెషనల్స్ ఇందులో పాల్గొనకూడదు.

* రాత్రి 7:30ని మహిళల 10కె రన్: ఇది ప్రత్యేకించి మహిళల కోసం నిర్వహిస్తున్న ఈవెంట్. ఈ ఈవెంట్ మహిళలో ధైర్యం నింపేందుకు నిర్వహిస్తున్నారు.

* రాత్రి 7:45ని మహిళల రిలే: ఈ ఈవెంట్ ముఖ్య ఉద్దేశ్యం బెంగుళూరులో ఉన్న ఎన్‌జీవోలకు విరాళాలు సేకరించడం. ఈ ఈవెంట్‌లో 8 మంది సభ్యులు పాల్గొనొచ్చు. ఒక్కో సభ్యుడు 5కిలోమీటర్లు పరుగెత్తాల్సి ఉంటుంది.

* రాత్రి 10 గంటలకు టార్గెట్ ఓపెన్ 10కె రన్: ఈ ఈవెంట్‌లో సెలబ్రటీల సరసన పరుగు తీసే అవకాశం ఉంది.

* రాత్రి 12 గంటలకు పుల్ మారథాన్: ఈ ఈవెంట్‌లో ముఖ్యమైన పరుగు పందెం. బెంగుళూరు ఐటీ కారిడార్‌లో సుమారు 42.195 కిలోమీటర్లు దూరం పరుగెత్తాల్సి ఉంటుంది.

* రాత్రి 12 గంటలకు కేర్‌వెల్ హాఫ్ మారథాన్: ఈ పరుగు పందెంలో 21 కిలో మీటర్లు పరుగెత్తాల్సి ఉంది.

* రాత్రి 12:15నిలకు ఎయిర్‌బస్ కార్పోరేట్ రిలే: మిడ్‌నైట్ మారథాన్‌లో భాగంగా బెంగుళూరులో ఉన్న కార్పోరేట్ వారి కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్‌లో 8గురు సభ్యులు ఒక జట్టుగా పాల్గొనొచ్చు.

బెంగుళూరు మిడ్ నైట్ మారథాన్‌లో ఒలింపిక్ పతక విజేత మేరీ కోమ్ కూడా పాల్గొంనుండటం విశేషం. ఈ మారథాన్ ద్వారా వచ్చిన విరాళాలను రోటర్ బెంగుళూరు ఐటీ కారిడార్ (ఆర్‌బీఐటీసీ) ఛారిటీలకు ఉపయోగించనుంది.

మరిన్ని వివరాల కోసం ఈ వెబ్‌సైట్‌ను సందర్శించండి

English summary
Come December 20 and Bengaluru will witness the eighth edition of the midnight marathon (www.bengalurumidnightmarathon), a popular platform for raising funds for charity. The event has 15 sponsors, including the State Bank of India, which is the title sponsor. Rotary Bangalore IT Corridor (RBITC), a service club, is organising the event.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X