• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జోమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ కామరాజ్ విజయం: మోడల్ హితేషా చంద్రానీపై కేసు నమోదు

|

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ జోమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్ తనపై దాడి చేసి గాయపర్చాడంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఘటనలో చివరకు నిజం తెలిసింది.. న్యాయం గెలిచింది. జోమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్ కామరాజ్‌పై దాడి చేసిన ఇన్‌స్టాగ్రామ్ మోడల్ హితేషా చంద్రానీపై పోలీసులు కేసు నమోదు చేశారు.

మోడల్ హితేషా చంద్రానీపై కేసు నమోదు

మోడల్ హితేషా చంద్రానీపై కేసు నమోదు

జోమాటో డెలివరీ వ్యక్తి తనను కొట్టాడని ఆరోపించిన మోడల్, ఇన్‌ఫ్లుయెన్సర్ హితేషా చంద్రానీపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. జోమాటో ఉద్యోగి కామరాజ్ ఫిర్యాదు ఆధారంగా హితేషా చంద్రనీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జరిగిన ఘటనను తప్పుదోవపట్టించడం, దాడి చేయడం, ఉద్దేశపూర్వకంగా అవమానించడం, క్రిమినల్ బెదిరింపులకు పాల్పడటం లాంటి అభియోగాల మీద ఆమెపై కేసు నమోదు చేశారు.

తనపై జోమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్ దాడి చేశారంటూ మహిళ ట్వీట్

కాగా, మార్చి 9న హితేషా సోషల్ మీడియా వేదికగా.. డెలివరీ ఎగ్జిక్యూటివ్ తనను ఇంట్లోకి లాక్కెళ్లి దాడి చేశాడని కన్నీటిపర్యంతమవుతూ ఓ వీడియో పోస్టు చేసింది. దీనిపై జోమాటో యాజమాన్యానికి ఫిర్యాదు చేయడంతో వారు స్పందించారు. ఈ ఘటన గురించి తమకు తెలియజేసినందుకు ధన్యవాదాలంటూ జోమాటో ఆమెకు భరోసా ఇచ్చింది. ఇలాంటి దాడులను తాము సహించమని, సరైన చర్యలు తీసుకుంటామని చెప్పింది.

డెలివరీ ఆలస్యం.. సారీ చెప్పినా చెప్పుతో దాడి చేసిన హితేషా

అయితే, పోలీసులు సదరు జోమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ను విచారించగా.. అసలు నిజం బయటపడింది. హితేషా.. జోమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసింది. అయితే, జోమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్ కాస్త ఆలస్యంగా ఆ ఆర్డర్ తీసుకొచ్చాడు. ట్రాఫిక్ సమస్య, రోడ్డు బాగాలేని కారణంగా ఆలస్యమైందని, తనను క్షమించాలని హితేషాను కోరాడు. అయితే, ఆమె మాత్రం అదేం పట్టించుకోకుండా అతనిపై దూషణలకు దిగింది. అయితే, క్యాష్ డెలివరీ కావడంతో అతను డబ్బులు అడిగాడు, కానీ, ఆమె ఇవ్వలేదు. అంతేగాక, అతనిపై చెప్పులు విసిరి దాడి చేసింది. ఆమె దాడిని అడ్డుకునేందుకు డెలివరీ ఎగ్జిక్యూటివ్ తన చేతులను అడ్డుపెట్టాడు. దీంతో ఆమె చేతికి ఉన్న ఉంగరం ఆమె ముక్కును చీరింది. ఈ క్రమంలో ఆమె ముక్కుపైగా గాయమై రక్తం కారింది. ఈ నేపథ్యంలోనే ఆమె తనపై జోమాటో ఎగ్జిక్యూటివ్ దాడి చేశారంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేసి అందర్నీ నమ్మించింది.

కామరాజుకు మద్దతుగా ప్రముఖులు, నెటిజన్లు

అయితే, తాను రెండేళ్లుగా జోమాటోలో పనిచేస్తున్నానని, ఇలాంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదని, ఆమె చాలా అహంకారపూరితంగా వ్యవహరించి తనపైనే దాడి చేసి బాధితురాలిగా ఫిర్యాదు చేసిందని వాపోయాడు సదరు జోమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్ కామరాజు. అసలు విషయం తెలుసుకున్న జోమాటో సదరు డెలివరీ ఎగ్జిక్యూటివ్ హై రేటెడ్ డెలివరీ బాయ్ అని, అతనికి అండగా ఉంటామని తెలిపింది. అసలు విషయం తెలియక సదరు మహిళకు మద్దతు పలికిన నెటిజన్లు నిజం తెలిసి.. ఆమెపై మండిపడ్డారు. అంత అహంకారం పనికిరాదంటూ ఆమెకు చీవాట్లు పెడుతున్నారు. జీవనాధారంగా తన విధులను బాధ్యతగా నిర్వహిస్తున్న వ్యక్తిపై ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలువురు బాలీవుడు నటులు కూడా హితేషా మద్దతుగా నిలవడం గమనార్హం.

English summary
The Bengaluru police have booked model and influencer Hitesha Chandranee, who had accused a Zomato delivery person of hitting her, for assault.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X