బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరు ప్యాలెస్ మైదానంలో 5 ఎకరాలు రూ. 1 కోటి, అదే డీకే కొంప ముంచింది, బినామి !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: అక్రమ నగదు లావాదేవీలు చేశారని ఆరోపిస్తు అరెస్టు అయిన కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ట్రుబల్ షూటర్ డీకే. శివకుమార్ గురించి అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. బెంగళూరు ప్యాలెస్ మైదానంలోని 5 ఎకరాల భూమిని డీకే. శివకుమార్ బినామి పేరుతో కేవలం రూ. 1 కోటికి చెక్ ఇచ్చి విశాలాక్షి దేవి దగ్గర కొనుగోలు చేశారని వెలుగు చూసింది. అదే డీకే. శివకుమార్ కొంప ముంచిందని సమాచారం. బినామీ పేరుతో డీకే ఆ భూమి కొనుగోలు చేశారని ఆరోపణలు ఉన్నాయి.

దూల తీరింది, బెంగళూరులో ట్రాఫిక్ పోలీసులు ఎన్ని రూ. లక్షలు వసూలు చేశారంటే!దూల తీరింది, బెంగళూరులో ట్రాఫిక్ పోలీసులు ఎన్ని రూ. లక్షలు వసూలు చేశారంటే!

విశాలక్షి దేవి ఎవరు ?

విశాలక్షి దేవి ఎవరు ?

మైసూరు మహారాజుల వంశానికి చెందిన దివంగత శ్రీకంఠదత్త ఒడయార్ సోదరి ఈ విశాలాక్షి దేవి. బెంగళూరు ప్యాలెస్ మైదానంలోని ఆస్తిలో విశాలాక్షి దేవికి భాగం ఉంది. విశాలాక్షి దేవికి చెందిన 5 ఎకరాల భూమిని డీకే. శివకుమార్ అక్రమంగా కొనుగోలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. 2018లో విశాలాక్షి దేవి మరణించారు.

కోర్టులో ఇవే వాదనలు

కోర్టులో ఇవే వాదనలు

కర్ణాటక మాజీ మంత్రి డీకే. శివకుమార్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. డీకే. శివకుమార్ కు బెయిల్ ఇవ్వరాదని ఈడీ అధికారుల తరపున న్యాయవాది కోర్టులో వాదించారు. బెంగళూరు ప్యాలెస్ మైదానంలోని 5 ఎకరాల భూమిని విశాలాక్షి దేవీ దగ్గర కొనుగోలు చేసిన డీకే. శివకుమార్ కేవలం రూ. 1 కోటికి మాత్రం చెక్ ఇచ్చారని, మిగిలిన నగదు అక్రమంగా బదిలీ చేశారని ఈడీ అధికారుల తరుపు న్యాయవాది కోర్టులో వాదించారు.

బినామి శశికుమార్

బినామి శశికుమార్

డీకే. శివకుమార్ కు శశికుమార్ సమీప బంధువు. డీకే. శివకుమార్ ఇంటి మీద ఐటీ అధికారులు దాడి చేసిన సమయంలో శశికుమార్ ఇంటిలో సోదాలు చేశారు. శశికుమార్ ఇంటిలో చిక్కిన డైరీలో బెంగళూరు ప్యాలెస్ మైదానంలోని 5 ఎకరాల భూమి కొనుగోలు విషయం వెలుగు చూసింది. డీకే. శివకుమార్ బినామి పేరుతో శశికుమార్ పేరు మీద బెంగళూరు ప్యాలెస్ మైదానంలో భూమి కొనుగోలు చేశారని ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు.

డబ్బులు ఎక్కడివి ?

డబ్బులు ఎక్కడివి ?

బెంగళూరు ప్యాలెస్ మైదానంలో 5 ఎకరాల భూమి కొనుగోలు చెయ్యడానికి శశికుమార్ కు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని అధికారులు ఆరా తీస్తున్నారు. బెంగళూరు ప్యాలెస్ మైదానంలో 5 ఎకరాల భూమి కొనుగోలు చెయ్యడానికి నగదు ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయం శశికుమార్ చెప్పడం లేదని, ఆ వివరాలు సేకరిస్తున్నామని ఈడీ అధికారులు అంటున్నారు.

English summary
New Delhi: Enforcement Directorate (ED) may question D.K.Shivakumar in connection with the buying 5 acres in Palace Grounds land from Vishalakshi Devi of the Mysuru royal family.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X