బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

139 మంది ప్రయాణికులతో వెళుతున్న విమానంలో సాంకేతిక లోపం: ఎమర్జెన్సీ ల్యాండింగ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 139 మంది ప్రయాణికులతో బెంగళూరు నుంచి పాట్నాకు బయలుదేరిన గో ఫస్ట్ విమానం కాక్‌పిట్‌లో ఇంజిన్ లోపం కారణంగా నాగ్‌పూర్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేయబడింది, ఇది ముందు జాగ్రత్త చర్యగా పైలట్ ఇంజిన్‌ను ఆపివేయవలసి వచ్చింది.

'బెంగళూరు నుంచి పాట్నాకు వెళ్లే గో ఫస్ట్ ఫ్లైట్ జీ8 873 కాక్‌పిట్‌లో ఇంజిన్ లోపం కారణంగా నాగ్‌పూర్‌కు మళ్లించబడింది, దీని వలన కెప్టెన్ ముందు జాగ్రత్త చర్యగా ఇంజిన్‌ను షట్ డౌన్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కెప్టెన్ స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానాలను అనుసరించి నాగ్‌పూర్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు' అని ఎయిర్‌లైన్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

Bengaluru-Patna Go First Flight Carrying 139 Makes Emergency Landing.

విమానం ఉదయం 11.15 గంటలకు విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయినట్లు తెలిపింది. ప్రయాణీకులందరూ డిప్లేన్ చేయబడ్డారు, రిఫ్రెష్‌మెంట్‌లు అందించారని పేర్కొంది.

'మేము పూర్తి స్థాయి ఎమర్జెన్సీగా ప్రకటించడం ద్వారా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాము, దీంతో రన్‌వేలు, ఫైర్ టెండర్లు, వైద్యులు, అంబులెన్స్‌లు అందుబాటులో ఉన్నాయి. పోలీసులతో సమన్వయం చేయబడిందని తెలిపింది. అదృష్టవశాత్తూ, విమానం సురక్షితంగా ల్యాండింగ్ అయిందని నాగ్‌పూర్ విమానాశ్రయం డైరెక్టర్ అబిద్ రూహి.. వార్తా సంస్థ పీటీఐకి వెల్లడించారు.

16.45 గంటలకు పాట్నాకు బయలుదేరే ప్రయాణికులకు వసతి కల్పించేందుకు ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేసినట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది. ఇంజినీరింగ్ బృందం విమానాన్ని తనిఖీ చేస్తోంది.

English summary
Bengaluru-Patna Go First Flight Carrying 139 Makes Emergency Landing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X