బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అక్రమ గన్ లు సేల్: ముఠాలో కన్నడ నటుడు, అరెస్టు, బుల్లెట్లు సీజ్, సీసీబీ నిఘా!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: అక్రమ ఆయుధాలు విక్రయిస్తున్న నిందితులను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో స్యాండిల్ వుడ్ నటుడు ఉండటంతో సీసీబీ పోలీసులు పలుకోణాల్లో విచారణ చేస్తున్నారు. అక్రమ ఆయుధాలు ఎక్కడ తీసుకువచ్చారు అని సీసీబీ పోలీసులు ఆరా తీస్తున్నారు.

కన్నడ నటుడు జగదీష్ ఎస్. హోరమఠ (25), అహమ్మద్ నిజామ్, సయ్యద్ సమీర్ అహమ్మద్, సతీష్ కుమార్ అనే నలుగురు నిందితులను అరెస్టు చేసి ఒక పిస్తోల్, సజీవంగా ఉన్న బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నామని బెంగళూరు సీసీబీ పోలీసులు తెలిపారు.

Bengaluru police arrested Kannada actor in connection with the illegal gun sale.

బెంగళూరు నగరంలోని హెచ్ఏఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెమెల్ ఆడిటోరియం దగ్గర ఇద్దరు పిస్తోల్ పెట్టుకుని విక్రయించడానికి ప్రయత్నిస్తున్నారని సీసీబీ పోలీసులకు సమాచారం అందింది. పిస్తోల్ కొనుగోలు చేసినట్లు నిటిస్తూ సీసీబీ పోలీసులు అక్కడికి వెళ్లారు.

Bengaluru police arrested Kannada actor in connection with the illegal gun sale.

పిస్తోలు విక్రయానికి బేరం పెట్టిన నిందితులను సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు తెలిపిన వివరాల ఆధారంగా మరో ఇద్దరిని అరెస్టు చేశామని సీసీబీ పోలీసు అధికారి మురుగేంద్ర తెలిపారు. నిందితుడు జగదీష్ పలు కన్నడ చిత్రాల్లో నటించాడని, సర్కార్ చిత్రంలో అతను నటించాడని వివరాలు ఉన్నాయని, వీరు ఎక్కడ పిస్తోలు సంపాధించారు అని ఆరా తీస్తున్నామని సీసీబీ పోలీసులు తెలిపారు.

English summary
Bengaluru Central Crime Branch (CCB) police arrested Kannada actor Jagadeesh (31) and three others in connection with the illegal gun sale. Case registered in HAL police station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X