బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అక్రమంగా డిస్కోథెక్, స్యాండిల్ వుడ్ నటుడు అరెస్టు, అన్నీ షుగర్ ఫ్యాక్టరీలోనే!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు నగరంలో అక్రమంగా డిస్కోథెక్ నిర్వహిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో స్యాండిల్ వుడ్ నటుడు, బిగ్ బాస్ కన్నడ రియాలిటీ షోలో పాల్గొన్న రోషన్ అలియాస్ రోషన్ గౌడ ఉన్నాడని బెంగళూరు పోలీసులు తెలిపారు. డిస్కోథెక్ మీద దాడి చేసిన పోలీసులు నగదుతో పాటు మద్యం బాటిల్స్, స్కైపింగ్ మిషన్లు, మ్యూజిక్ కంట్రోలర్ తదితర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.

బెంగళూరులో లైవ్ బ్యాండ్ అమ్మాయిలు, హైటెక్ వ్యభిచారం, రెచ్చిపో, విటులకు వల!బెంగళూరులో లైవ్ బ్యాండ్ అమ్మాయిలు, హైటెక్ వ్యభిచారం, రెచ్చిపో, విటులకు వల!

షుగర్ ఫ్యాక్టరీ

షుగర్ ఫ్యాక్టరీ

బెంగళూరు నగరంలోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో లి-మెరిడియన్ హోటల్ లో షుగర్ ఫ్యాక్టరీ పేరుతో బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. ఈ షుగర్ ఫ్యాక్టరీ బార్ అండ్ రెస్టారెంట్ లో ఎక్సైజ్ శాఖ, డిస్కోథెక్ నియమాలు ఉల్లంఘించి బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారని పోలీసులు అన్నారు.

అక్రమ సంపాదన

అక్రమ సంపాదన

అక్రమంగా మద్యం, ఆహారం సరఫరా చేసి అక్రమంగా నగదు సంపాదిస్తున్నారని కొందరు సీసీబీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కచ్చితమైన సమాచారం సేకరించిన సీసీబీ పోలీసులు, మాదకద్రవ్యాల నిరోదక దళం పోలీసులు డిస్కోథెక్ మీద దాడులు చేశారు.

డిస్కోథెక్ లోనే మొత్తం !

డిస్కోథెక్ లోనే మొత్తం !

షుగర్ ఫ్యాక్టరీలో డిస్కోథెక్ కు వచ్చే వారికి నియమాలు ఉల్లంఘించి సమయం మించిపోయిన తరువాత అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్నారని, అక్కడే వారికి కావలసిన ఆహారం సరఫరా చేస్తున్నారని, బస చెయ్యడానికి వసతి కల్పిస్తున్నారని బెంగళూరు పోలీసులు తెలిపారు.

సినిమా నటుడు

సినిమా నటుడు

ప్రముఖ బహుబాష నటుడు, ఈగ ఫేం సుదీప్ నటించిన మాణిక్య సినిమాతో పాటు అనేక స్యాండిల్ వుడ్ సినిమాల్లో రోషన్ గౌడ నటించాడు. బిగ్ బాస్ కన్నడతో పాటు మరో రియాలిటీ షోలో రోషన్ గౌడ పాల్గొన్నాడు. అక్రమంగా డిస్కోథెక్ నిర్వహించడమే కాకుండా మ్యూజిక్ సౌండ్ ఎక్కువగా పెట్టి చట్టుపక్కల వారిని ఇబ్బందులకు గురి చేశారని, హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ లో వీరి మీద కేసు నమోదు చేశామని బెంగళూరు సీసీబీ పోలీసులు తెలిపారు.

English summary
Bengaluru High Grounds Police Arrested Three Persons Including Sandalwood Star For Not Obeying the Excise Department Rules And Regulations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X