బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కన్నడ ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య: ఇలాంటి వారికి ఇదే గతి, ఇంజనీర్ మల్లి అర్జున్ అరెస్టు !

కన్నడ లంకేష్ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్ హత్యకు గురైన సందర్బంలో ఇలాంటి వారికి ఇదే గతి పడుతోంది అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన సివిల్ ఇంజనీరును బెంగళూరు సిటి క్రైం బ్రాంచ్ (సీసీబీ) .

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కన్నడ లంకేష్ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్ హత్యకు గురైన సందర్బంలో ఇలాంటి వారికి ఇదే గతి పడుతోంది అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన సివిల్ ఇంజనీరును బెంగళూరు సిటి క్రైం బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

ప్రభుత్వ లాంచనాలతో గౌరి లంకేష్ అంత్యక్రియలు, సీఎం, మంత్రులు హాజరు !ప్రభుత్వ లాంచనాలతో గౌరి లంకేష్ అంత్యక్రియలు, సీఎం, మంత్రులు హాజరు !

కర్ణాటకలోని యాదగిరి జిల్లా సురపుర ప్రాంతానికి చెందిన మల్లనగౌడ బీరాదార్ అలియాస్ మల్లి అర్జున్ (22) అనే యువకుడిని అరెస్టు చేశామని బెంగళూరు సీసీబీ పోలీసులు చెప్పారు. మల్లన్నగౌడ అలియాస్ మల్లి అర్జున్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.

ఉద్యోగం కోసం బెంగళూరు

ఉద్యోగం కోసం బెంగళూరు

మల్లి అర్జున్ ఉద్యోగం కోసం బెంగళూరు చేరుకుని విజయనగర్ లోని స్నేహితుడి ఇంటిలో ఉంటున్నాడు. మల్లి అర్జున్ అనే పేరుతో ఇతను ఫేస్ బుక్, ట్వీట్టర్, వాట్సాప్ అకౌంట్లు ఓపెన్ చేశాడు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో గౌరీ లంకేష్ తన ఇంటి ముందు దుండగుల తుపాకి తూటలు దూసుకుపోవడంతో మరణించిన విషయం తెలిసిందే.

ధర్మం కోసం ఇలాగే చంపేస్తారు

ధర్మం కోసం ఇలాగే చంపేస్తారు

గౌరీ లంకేష్ హత్య జరిగిన తరువాత మల్లి అర్జున్ ఫేస్ బుక్ లో రెండు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు పోస్టు చేశాడు. ఒక గంజి చుక్క నేలరాలింది, మిగిలిన గంజి చుక్కలకు ఇదే గతి అంటూ ఒక పోస్టు చేశాడు. ధర్మం కాపాడుకోవడానికి ప్రాణం ఇవ్వాలని, ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్థిస్తే ఇలాగే ప్రాణం తీస్తారని మరో పోస్టు చేశాడు.

సోషల్ మీడియాలో వైరల్

సోషల్ మీడియాలో వైరల్

సోషల్ మీడియాలో మల్లి అర్జున్ చేసిన పోస్టు వైరల్ అయ్యింది. గౌరీ లంకేష్ ను వ్యతిరేకించే వారు ఈ రెండు పోస్టులు షేర్ చెయ్యడంతో వైరల్ గా మారింది. స్వచ్చందంగా కేసు నమోదు చేసిన పోలీసులు మల్లి అర్జున్ ను అరెస్టు చేసి బెంగళూరు ఒకటవ ఏసీఎంఎం న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.

పోలీసు కస్టడీకి మల్లి అర్జున్

పోలీసు కస్టడీకి మల్లి అర్జున్

మల్లి అర్జున్ ను 7 రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. గౌరీ లంకేష్ హత్యకు మల్లి అర్జున్ కు సంబంధం లేదని, నకిలి పేర్లతో ఇతను ఫేస్ బుక్, ట్వీట్టర్, ఈ మెయిల్ అడ్రస్ లు క్రియేట్ చేశాడని, విచారణ జరుగుతోందని సీసీబీ పోలీసులు తెలిపారు.

గౌరీ లంకేష్ కుటుంబ సభ్యులు !

గౌరీ లంకేష్ కుటుంబ సభ్యులు !

మల్లి అర్జున్ కు వ్యతిరేకంగా గౌరీ లంకేష్ కుటుంబ సభ్యులు సైతం ఫిర్యాదు చెయ్యలేదని తెలిసింది. బెంగళూరు సిటీ క్రైం బ్రాంచ్ పోలీసులు స్వచ్చందంగా కేసు నమోదు చేసుకుని విచారణ చెయ్యగా మల్లి అర్జున్ విజయనగర్ లో చిక్కిపోయాడు.

English summary
Mallanagoda Biradar (22), who was allegedly posted abusively on Facebook following the assassination of journalist Gauri Lankesh, was arrested. The city police conducted a operation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X