బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పౌరసత్వ చట్టంపై హిందువులను కించపరిచి, అసభ్యంగా దూషింస్తూ పోస్టర్లు, విద్యార్థులపై కేసులు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ఆందోళనలు చేస్తున్న విద్యార్థులు హిందువులు, భగవంతుడిని అవహేళన చేశారని ఆరోపిస్తూ బెంగళూరు నగరంలో కేసులు నమోదైనాయి. ఆందోళన చేస్తున్న విద్యార్థులు కాలేజ్ ఆవరణంలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా, అసభ్యంగా దూషిస్తూ పోస్టర్లు ప్రదర్శించారని ఆరోపిస్తూ బెంగళూరు నగరంలోని హలసూరు పోలీస్ స్టేషన్ లో విద్యార్థుల మీద కేసులు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. బెంగళూరు నగరంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణంలో సీఏఏకి విరుద్దంగా ఆందోళన చేపట్టిన విద్యార్థులు హిందువులను కించపరిచి, అసభ్య పదజాలంతో దూషించి పోస్టర్ల ప్రదర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

విదేశాల్లో ఉద్యోగం, బిడ్డ నాకు పుట్టిందని గ్యారంటీ లేదు, మహిళా ఇంజనీరు షాక్, భర్త ఇంటి ముందే!విదేశాల్లో ఉద్యోగం, బిడ్డ నాకు పుట్టిందని గ్యారంటీ లేదు, మహిళా ఇంజనీరు షాక్, భర్త ఇంటి ముందే!

కాలేజ్ ప్రిన్సిపల్ ఫిర్యాదు

కాలేజ్ ప్రిన్సిపల్ ఫిర్యాదు

సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళన చేసిన విద్యార్థులు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ పోస్టర్లు ప్రదర్శించడమే కాకుండా హిందువులను కించపరిచే విధంగా నినాదాలు చేశారు. ఈ విషయంపై హలసూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైయ్యింది. తరువాత విద్యార్థులు అక్కడి నుంచి వెళ్లే సమయంలో అనుమతి లేకుండానే కాలేజ్ మైదానంలో కార్యక్రమాలు నిర్వహించారని, కాలేజ్ ఆవరణంలో అనుమతి లేకుండా గుంపులు గుంపులుగా ధర్నాలు నిర్వహించారని కాలేజ్ ప్రిన్సిపల్ నీలమతి విద్యార్థుల మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాలేజ్ విద్యార్థుల గ్యాంగ్ లు

కాలేజ్ విద్యార్థుల గ్యాంగ్ లు

క్రైస్ట్ కాలేజ్, సెంట్రల్ కాలేజ్ తో పాటు బెంగళూరు నగరంలోని వివిద కాలేజ్ ల విద్యార్థులు ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణంలో (గ్యాస్ టీం) గుమికూడి హిందూ ధార్మిక భావాలను దెబ్బతీసే విధంగా నినాదలు చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 144 సెక్షన్ అమలులో ఉందని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు చెప్పినా విద్యార్థులు పట్టించుకోలేదని, ధర్నాలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ కేసులు నమోదైనాయి.

ఐపీఎస్ సెక్షన్ లు

ఐపీఎస్ సెక్షన్ లు

కాలేజ్ విద్యార్థి సంఘం నాయకులు సరోవర్, గౌతమ్ రాజ్, అమృతా, మల్లికార్జున్, అమూల్య, ఆండ్రియా, రాజ్ గోపాల్ తో పాటు అనేక మంది విద్యార్థులపై ఐపీఎస్ 188, 153 ఏ, 295 ఏ సెక్షన్ ల కింద కేసు నమోదు చేసి విచారణ మొదలు పెట్టామని డీసీపీ చేతన్ సింగ్ శనివారం మీడియాకు చెప్పారు.

కాలేజ్ యాజమాన్యం

కాలేజ్ యాజమాన్యం

ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులను గుర్తించడానికి కాలేజ్ యాజమాన్యం, పరిపాలనా విభాగం అధికారుల సహాయం తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. అయితే ఆందోళనలో పాల్గొన్న విద్యార్థుల వివరాలు, సమాచారం ఇవ్వకుండా వారిని రక్షించడానికి కాలేజ్ యాజమాన్యం, పరిపాలనా విభాగం అధికారులు ప్రయత్నిస్తే వారిమీద కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు అంటున్నారు. ఈ కేసులకు సంబంధించి ఇంత వరకు విద్యార్థులు ఎవ్వరినీ అరెస్టు చెయ్యలేదని, విచారణ చేస్తున్నామని డీసీపీ చేతన్ సింగ్ శనివారం మీడియాకు చెప్పారు.

English summary
Bengaluru police has booked more than 8 students for displaying abusive poster against Hindutva during the protest against CAA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X