బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాజీ డిప్యూటీ సీఎం పీఏ ఆత్మహత్య.. చివరి ఫోన్ కాల్స్ ఎవరికి ? డైరీలో!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ పర్సనల్ సెక్రటరీ (పీఏ) రమేష్ ఆత్మహత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. అయితే పోలీసులు మాత్రం రమేష్ ఆత్మహత్యను అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి విచారణ చేస్తున్నారు. రమేష్ డైరీ, ఆయన చివరిగా ఎవరెవరికి ఫోన్ చేశారు అని పోలీసుల వివరాలు సేకరిస్తున్నారు. రమేష్ అనుమానాస్పద కేసును రెండు ప్రత్యేక బృందాలతో విచారణ చేస్తున్నారు.

చివరి రెండు ఫోన్ కాల్స్

చివరి రెండు ఫోన్ కాల్స్

శనివారం ఉదయం మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ పీఏ అనీల్ అనే వ్యక్తితో మాట్లాడాడు. డాక్టర్ జీ. పరమేశ్వర్ కారు డ్రైవర్ అనీల్. అనీల్ తో పాటు ప్రైవేట్ టీవీ చానల్ పాత్రికేయుడితో మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ పీఏ రమేష్ ఫోన్ లో మాట్లాడారు. అయితే మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ గన్ మ్యాన్ తో మాట్లాడిన రమేష్ తరువాత ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసుల దగ్గర సమాచారం ఉంది.

మిస్ అయ్యి ఫోన్ చేశా!

మిస్ అయ్యి ఫోన్ చేశా!

శనివారం ఉదయం డాక్టర్ జీ పరమేశ్వర్ కారు డ్రైవర్ అనీల్ కు రమేష్ ఫోన్ చేశాడు. అయితే ఫోన్ లో మాట్లాడిన రమేష్ పొరపాటును నీకు ఫోన్ వచ్చింది ( మిస్ అయ్యింది) అంటూ రమేష్ ఫోన్ కట్ చేశాడని పోలీసులు అంటున్నారు. ఈ సందర్బంలో పోలీసులు అనీల్ ను మరోసారి విచారణ చెయ్యడానికి సిద్దం అయ్యారు.

డైరీలో ఏముంది?

డైరీలో ఏముంది?

డాక్టర్ జీ. పరమేశ్వర్ పీఏ రమేష్ ఇంటిలో పోలీసులు సోదాలు చేసిన సమయంలో ఓ డైరీని స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. ఆ డైరీలో రమేష్ దినచర్యలు, ఎప్పుడు ఎక్కడికి వెళ్లాలి అనే వివరాలు ఉన్నాయని తెలిసింది. ఇదే డైరీలో డాక్టర్ జీ. పరమేశ్వర్ హోం మంత్రిగా, బెంగళూరు నగరాభివృద్ది శాఖా మంత్రిగా వివిద కార్యక్రమాల్లో పాల్గొన్న కార్యక్రమాల వివరాలు, ఆ సమయంలో ఎవరెవరిని కలిశారు అనే పూర్తి సమాచారం ఉందని తెలిసింది. రమేష్ ఇంటిలో స్వాధీనం చేసుకున్నారని అంటున్న డైరీని పోలీసులు పరిశీలిస్తున్నారు.

రమేష్ డెత్ నోట్

రమేష్ డెత్ నోట్

రమేష్ ఆత్మహత్య చేసుకునే ముందు డెత్ నోట్ రాసిపెట్టి దానిని అతని కారులో వదిలిపెట్టాడు. ఐటీ దాడులతో విసిగిపోయానని, ఐటీ శాఖ అధికారులు వేస్తున్న ప్రశ్నలకు తాను సమాధానం చెప్పలేకపోతున్నానని, అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని డెత్ నోట్ లో ఉందని మీడియాలో ప్రచారం జరిగింది.

English summary
Bengaluru Police probing the Former DyCM G.Parameshwara PA Ramesh death case will look in to the dairy and last call details.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X